బైక్, కారు ఢీకొని యువకుడి మృతి
నేరేడుచర్ల(నల్లగొండ): బైక్ పై వేగంగా వెళ్తున్న ఇద్దరు యువకులు ఎదురుగా వస్తున్న లారీని తప్పించే క్రమంలో కారును ఢీకొట్టారు. దీంతో బైక్ నడుపుతున్న యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నేరేడుచర్లలో ఆదివారం చోటుచేసుకుంది.
స్థానిక ఎన్టీఆర్ నగర్‌కు చెందిన షేక్ గౌస్(17), నాగరాజు(24) బైక్‌పై వెళ్తుండగా.. హుజూర్నగర్ నుంచి మిర్యాలగూడ వెళ్తున్న లారీని తప్పించే క్రమంలో దాని వెనుక వస్తున్న కారును ఢీకొట్టారు. ఆ సమయంలో బైక్ చాలా వేగంలో ఉంది. దీంతో బైక్ నడుపుతున్న గౌస్ అక్కడికక్కడే మృతిచెందగా, నాగరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.