billionaire tag
-
6 నెలల్లో లక్ష కోట్లు కోల్పోయిన చైనా బిలియనీర్
ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరైన మాజీ పాఠశాల ఉపాధ్యాయుడు లారీ చెన్ పరిస్థితి 6 నెలల్లో తలక్రిందులుగా మారింది. చైనా ప్రభుత్వం ప్రైవేట్ విద్యా రంగంపై కఠిన నియమాలు విధించడంతో చెన్ బిలియనీర్ హోదాను కోల్పోయాడు. గ్వోటు టెచెడు ఇంక్ వ్యవస్థాపకుడు, చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన చెన్ ఆస్తి ఇప్పుడు 336 మిలియన్(రూ.24,98,22,38,400.00) డాలర్లకు చేరుకుంది. బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, తన ఆన్ లైన్-ట్యూటరింగ్ సంస్థ షేర్లు శుక్రవారం న్యూయార్క్ ట్రేడింగ్ లో దాదాపు మూడింట రెండు వంతులు పడిపోయాయి. చైనా ప్రభుత్వం జూలై 24న విద్యా రంగానికి సంబందించి కొత్త నిబంధనలను విడుదల చేసింది. ఈ నిబందనల ప్రకారం పాఠ్యాంశాలను బోధించే సంస్థలు లాభాలు సంపాదించకూడదు, మూలధనాన్ని పెంచుకోకూడదు. 15 బిలియన్(రూ.11,15,27,85,00,000.00) డాలర్లు గల లారీ చెన్ సంపద రూ.2,498 కోట్లకు పడిపోయింది. గావోటు స్టాక్ ధర గత ఆరు నెల కాలంలో భారీగా పడిపోయింది. గావోటు "నిబంధనలను పాటిస్తుంది, సామాజిక బాధ్యతలను నెరవేరుస్తుంది" అని చెన్ శనివారం అర్థరాత్రి చైనీస్ సోషల్ మీడియా వీబోలో తెలిపారు. కేవలం చెన్ మాత్రమే తన సంపదను పోగొట్టుకోలేదు. న్యూయార్క్ లో కంపెనీ షేర్లు 71% పడిపోవడంతో తాల్ ఎడ్యుకేషన్ గ్రూప్ సీఈఓ జాంగ్ బాంగ్సిన్ సంపద 2.5 బిలియన్ డాలర్లు నుంచి 1.4 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అలాగే, న్యూ ఓరియంటల్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ గ్రూప్ ఇంక్. ఛైర్మన్ యు మిన్హాంగ్ తన బిలియనీర్ హోదాను కోల్పోయారు. ఈ రెండు కంపెనీలు కూడా కొత్త నిబంధనలను పాటిస్తాము అని ప్రతిజ్ఞ చేస్తూ ప్రకటనలను విడుదల చేశాయి. 2014లో గావోటును స్థాపించిన చెన్ కు కరోనా మహమ్మరి సమయంలో భారీగా సంపద కలిసి వచ్చింది. 2020 జనవరిలో అతని కంపెనీ స్టాక్ ధర ఏకంగా 13 రెట్లు పెరిగింది. 2021 జనవరి 27న 142 డాలర్లుగా ఉన్న షేర్ ధర నేడు 2.72 డాలర్లకు పడిపోయింది. చైనాలో ఉన్న ప్రైవేట్ కంపెనీలకు మన దేశంలో ఉన్న సంస్థలకు లాగా స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఉండదు. అక్కడి ప్రతి కంపెనీ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నడవాల్సి ఉంటుంది. -
బిలియనీర్ క్లబ్‌నుంచి అంబానీ ఔట్
సాక్షి, ముంబై : అడాగ్ గ్రూపు అధినేత, అనిల్ అంబానీ బిలియనీర్ క్లబ్‌నుంచి కిందికి పడిపోయారు. 2008 లో 42 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలో 6 వ స్థానంలో నిలిచిన అనిల్ అంబానీ ఇప్పుడు ప్రస్తుతం ఆ స్థానాన్ని కోల్పోయారు. 11 సంవత్సరాలలో, అంబానీ మొత్తం వ్యాపార సామ్రాజ్యం ఈక్విటీ విలువ 3,651 కోట్ల రూపాయలకు (523 మిలియన్ డాలర్లు) కుప్పకూలింది. దీంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. అప్పుల సంక్షోభం, టెలికాం సంస్థ ఆర్కాంతోపాటు ఇతర గ్రూపుసంస్థల వరుస నష్టాల నేపథ్యంలో అంబానీ సామ్రాజ్యం కుప్పకూలింది. ముఖ్యంగా మ్యూచుఫల్ ఫండ్ జాయింట్ వెంచర్ రిలయన్స్ నిప్సాన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్లో బ్యాంకులు 43 శాతం వాటాలను విక్రయించడం షాకింగ్ పరిమాణం. అలాగే రుణాలను తీర్చేందుకు ప్రధాన ఆస్తులు వ్యాపారాల అమ్మకంతో అనిల్ అంబానీ సంపద బాగా క్షీణించింది. కాగా ఇటీవల ఆస్తులను అమ్మిఅయినా మొత్త రుణాలను తీరుస్తామని అనిల్అంబానీ హామీ ఇచ్చారు. గత గత 14 నెలల్లో రూ .35 వేల కోట్లకు పైగా రుణాలు తీర్చామని ప్రకటించిన సంగతి తెలిసిందే. రిలయన్స్ గ్రూప్ విలువ నాలుగు నెలల క్రితం రూ .8వేల కోట్లకు పైగా ఉండటం గమనార్హం. ఆయన మొత్తం సంపద 42 బిలియన్ డాలర్లనుంచి 0.5 బిలియన్ డార్లకు పడిపోయింది. 2018 ,మార్చి నాటికి రిలయన్స్ గ్రూప్ కంపెనీల మొత్తం రుణం 1.7 లక్షల కోట్లకు పైగా ఉంది. -
మెగా డీల్‌తో సచిన్‌కు రూ.6700 కోట్లు
ముంబై : ఈ-కామర్స్ మార్కెట్ అతిపెద్ద డీల్ నేడు ఖరారైంది. గత ఎన్నో రోజులుగా చక్కర్లు కొడుతున్న ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్ వశమైపోయింది. అమెరికాకు చెందినరిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్, దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను 16 బిలియన డాలర్లకు కొనుగోలు చేయబోతున్నట్టు ప్రకటించింది. ఇప్పటి వరకు జరిగిన కొనుగోళ్లలో ఇదే అతిపెద్దది కావడం విశేషం. ఈ డీల్ నేపథ్యంలో 11ఏళ్ల క్రితం ఫ్లిప్‌కార్ట్‌ను స్థాపించిన వ్యవస్థాపకుల్లో ఒకరైన సచిన్ బన్సాల్ కంపెనీ నుంచి పూర్తిగా వైదొలిగారు. ఫ్లిప్‌కార్ట్‌లో తనకున్న 5.5 శాతం వాటాను అమ్మేశారు. దీంతో సచిన్ బన్సాల్ రూ.6700 కోట్లకు పైగా(1బిలియన్ డాలర్లు) పొందారు. అంతేకాక సచిన్ మరోసారి తన బిలీనియర్ స్టేటస్‌ను పొందగలిగారు. మరో వ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్ కూడా ఈ డీల్‌లో భాగంగా ప్రస్తుతం తను కలిగి ఉన్న వాటాలో 10 శాతం అమ్మేశారు. దీంతో బిన్నీ బన్సాల్ వాటా 5.1 శాతం నుంచి 4.5 శాతానికి తగ్గింది. ఈ వాటా విక్రయంతో బిన్నీ బన్సాల్ కూడా బిలీనియర్ అయ్యారు. సచిన్ బన్సాల్ కంపెనీ నుంచి వైదొలుగుతున్నప్పటికీ, బిన్నీ బన్సాల్ మాత్రం గ్రూప్ సీఈవోగా కంపెనీలోనే ఉండనున్నారు. మరోవైపు కంపెనీ బోర్డుపై వాల్‌మార్ట్ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. టెన్సెంట్, టైగర్ గ్లోబల్ ఫ్లిప్‌కార్ట్ బోర్డులో కొనసాగనున్నాయని, కొత్త సభ్యులు వాల్‌మార్ట్ నుంచి వచ్చి చేరతారని తెలుస్తోంది. -
సిక్కా ఎఫెక్ట్: ఇన్పీ కో-ఫౌండర్స్ సంపద ఆవిరి
సాక్షి, ముంబై : ఇన్ఫోసిస్ కో-ఫౌండర్స్, విశాల్ సిక్కా దెబ్బ భారీగానే కొట్టింది. సిక్కా దెబ్బకు ఇన్ఫీ షేర్లు కుప్పకూలడంతో, కంపెనీ సహ-వ్యవస్థాపకులు తమ బిలీనియర్ ట్యాగ్ పోగొట్టుకున్నారు. గత రెండు రోజులుగా కంపెనీ షేర్లు నష్టాలు పాలవడంతో ఇన్ఫోసిస్ హై ప్రొఫైల్ ఫౌండర్ ఎన్ఆర్ నారాయణమూర్తి తన బిలీనియర్ స్టేటస్‌ను కోల్పోగా... గోపాలక్రిష్ణన్ కూడా ఆ ట్యాగ్‌ను వదులుకోవాల్సి వచ్చింది. సీఈవోగా సిక్కా రాజీనామా అనంతరం పతనమవడం ప్రారంభమైన ఇన్పీ షేర్లు, సోమవారం మార్కెట్ ట్రేడింగ్‌కు 14.5 శాతం క్రాష్ అయ్యాయి. దీంతో ఫౌండర్ ప్రమోటర్లు కూడా భారీగా తమ సంపదను కోల్పోయారు. మొత్త ఫౌండర్లు కంపెనీలో 12.74 శాతం వాటాను కలిగి ఉన్నారు. గత గురువారం 1,160 మిలియన్ డాలర్లు(రూ.7,437కోట్లకు పైన)గా ఉన్న గోపాలక్రిష్ణన్ షేర్లు సోమవారం సాయంత్రానికి 998 మిలియన్ డాలర్ల(రూ.6,398 కోట్లు)కు పడిపోయాయి. ఇక నారాయణమూర్తి, ఆయన కుటుంబం రూ.1000 కోట్లకు పైగానే కోల్పోయింది. 800 మిలియన్ డాలర్ల(రూ.5,129కోట్లు)కు పైన ఉన్న నందన్ నిలేకని సంపద కూడా 750 మిలియన్ డాలర్ల(రూ.4,808కోట్లు) కిందకి దిగజారింది. అటు ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా రెండు రోజుల వ్యవధిలోనే రూ.34వేల కోట్లకు పైగా క్షీణించింది. మొత్తంగా ప్రమోటర్లు రూ.4,321 కోట్లను నష్టపోయారు. ఈ మొత్తం ప్రస్తుతం నందన్ నిలేకని కలిగి ఉన్న సంపదంతగా ఉంది. రూ.30వేల కోట్లగా ఉన్న ఫౌండర్ల షేర్లు, సోమవారం సాయంత్రానికి రూ.25,594 కోట్లకు వచ్చి చేరాయి. సిక్కా దెబ్బకు మూడేళ్ల కనిష్ట స్థాయిలకు పడిపోయిన ఇన్ఫీ షేర్లు, మంగళవారం మార్కెట్లో కోలుకున్నాయి. ప్రస్తుతం స్వల్పంగా 0.11శాతం లాభపడుతూ.. రూ.874.30 వద్ద ట్రేడవుతోంది.