Bird Head
-
ఓ చేప.. సోషల్‌మీడియాని కుదిపేస్తోంది!
-
పక్షి తల చేప.. వైరల్..
గ్విజౌ, నైరుతి చైనా : చైనాలో ఓ చేప సోషల్‌మీడియా ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇందుకు కారణం దాని తల ఆకారమే. సాధారణ చేపలకు భిన్నంగా పక్షి తలను పోలి ఉంది దాని రూపు. సోషల్‌మీడియాలో దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. చేప తల పావురం, చిలుక, డాల్ఫిన్ తలల ఆకారంలో ఉందని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. గ్విజౌ ప్రాంతంలో వేటకు వెళ్లిన జాలర్లకు ఈ చేప వలలో పడింది. దాని తల భిన్నంగా ఉండటంతో అక్కడి పత్రికల్లోనూ ప్రచురితమైంది. గత వారం రోజులుగా దీని గురించి సోషల్‌మీడియాలో భారీ చర్చ నడుస్తోంది. -
డిన్నర్ కోసం మూత తీస్తే.. కోలుకోలేని షాక్
సాక్షి, మాస్కో: రష్యాకు చెందిన ఓ యువతి సోషల్ మీడియా అకౌంట్లో భయానక పోస్టు దర్శనమిస్తోంది. రాత్రిపూట భోజనానికి సిద్ధమైన ఆమె తాను చూసిన దిగ్భ్రాంతికి దృశ్యాన్ని చూపిస్తూ.. అందరూ జాగ్రత్తగా.. ఉండాలంటూ ఓ ఫోటోను షేర్ చేసింది. బెల్గ్రోడాకు రీజియన్‌కు చెందిన మహిళ గురువారం సాయంత్రం డిన్నర్ తయారు చేసుకునేందుకు సిద్ధమైంది. అంతకు ముందే షాపు నుంచి తెచ్చిన ఓ మొక్కజోన్న పొత్తుల డబ్బాను తెరిచింది. అందులో ఓ పక్షి తల ఉండటంతో షాక్ కి గురైన మహిళ.. మిగతా డబ్బాలను తెరవకుండానే అలాగే ఉండిపోయింది. వెంటనే ఆ విషయాన్ని ఆమె తన ‘పీకబూ’ ఖాతాలో తెలియజేసింది. ఒకవేళ పక్షి తల అడుగుభాగన ఉండి ఉంటే.. అది గమనించకుండా కొన్ని పొత్తులను తినేసి ఉండేదాన్నేమో అంటూ భయం వ్యక్తం చేసింది. అయితే ఇంత చేసిన ఆ మహిళ సదరు కంపెనీపై దావా వేసే విషయంపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కానీ, ఆ భయాన అనుభవం ఇప్పటికీ తన కళ్ల ముందు మెదులుతూనే ఉందని, ఆ షాక్ నుంచి తాను ఇప్పట్లో కోలుకోనేమోనని ఆమె చెబుతోంది.