black glasses
-
నల్ల కళ్లద్దాలు ధరించిన వరుడు.. పెళ్లి ఆపేసిన వధువు.. కారణం?
లక్నో: అతిథులు, బంధుమిత్రులతో కళ్యాణ మండపం సందడిగా మారింది. ఓవైపు సంగీత్‌లో రెండు కుటుంబాలు కలిసి హుషారుగా స్టెప్పులేస్తున్నారు. ఇంతలోనే పెళ్లిలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. పీటల మీద పెళ్లి అనూహ్యంగా ఆగిపోయింది. పెళ్లి కొడుక్కి ఓ టెస్ట్ పెట్టి.. అందులో అతడు ఫెయిల్ అవ్వడంతో తనకీ పెళ్లి వద్దని చెప్పి అతిథులందరికి షాకిచ్చింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఔరయ ప్రాంతంలో చోటుచేసుకుంది. చల్దా పోలీస్ స్టేషన్ పరిధిలోని మహారాజ్ పూర్ గ్రామానికి చెందిన వినోద్ కుమాత్‌తో . జమాలిపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి కుమార్తెకు వివాహం నిశ్చయించారు. పెళ్లిరోజున… వేదికలో అబ్బాయి నల్ల కళ్లద్దాలు పెట్టుకోవడంతో అతనిపై వదువు బంధువులకు అనుమానం వచ్చింది. దీంతో వెంటనే వారు వరుని తరుపువారిని ప్రశ్నించారు. వారు సరైన సమాధానం చెప్పకపోవడంతో వధువు అతని కళ్లజోడు తీయించి న్యూస్ పేపర్ చదవమని అడిగింది. దీంతో వరుడు తెల్లముఖం వేశాడు. పేపర్ చదవలేకపోయాడు. ఇక వరుడికి కళ్లు సరిగా కనిపించవన్న నిజం గురించి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వెంటనే పెళ్లి ఆపేసింది. ఇదే విషయంపై ఇరువర్గాల మధ్య రెండు రోజులు పంచాయితీ జరిగినా ఎటూ తేలలేదు. ఏదేమైనా తనకు ఆ వ్యక్తితో పెళ్లి వద్దని వధువు తెగేసి చెప్పింది. దీంతో వదువు తండ్రి వరుడు కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: లవ్ ఎఫైర్: వరుడి చెంప చెళ్లుమనిపించిన వధువు వైరల్: వధువు నోరు, ముక్కు నుంచి పొగ! -
40 డిగ్రీల ఎండలో సూటా?
ప్రోటోకాల్‌కు విరుద్దంగా ప్రధాని పర్యటనలో నల్ల కళ్లద్దాలు, ఫార్మల్ డ్రెస్ ధరించి, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించిన ఐఏఎస్ అధికారి, బస్తర్ జిల్లా కలెక్టర్ అమిత్ కటారియా ఎట్టకేలకు వివాదంపై స్పందించారు. నల్ల కళ్లద్దాలు, ఫార్మల్ డ్రెస్‌లో ప్రధానికి షేక్ హ్యాండ్ ఇవ్వడాన్ని సమర్థించుకున్నారు. 'దేశంలో అత్యధికి ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో బస్తర్ కూడా ఒకటి. 40 డిగ్రీల ఎండలో.. బంద్గలా లేదా నార్మల్ సూటు ధరించి ఉక్కపోతను అనుభవిస్తూ విధులు నిర్వర్తించడం నావల్ల కాదు బాబోయ్..' అంటూ వాట్సాప్ మెస్సేజ్‌ల ద్వారా ఐఏఎస్ సహచరులతో తన గోడు వెలిబుచ్చుకున్నాడు. 'అయినా నేనేమీ టీషర్లు, స్లిప్పర్సు ధరించానా? బ్లూ షర్లు, బ్లాక్ ప్యాంటు, షూ.. ఇలా కంప్లీట్ ఫార్మల్ వేర్ లో ఉండటం తప్పెలా అవుతుంది?' అని మనసులో మాటను మిత్రులతో పంచుకున్నారు. అసలీ విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ పట్టించుకోలేదని, ఆయన తనకు 'హలో' చెప్పారని, మీడియానే ఈ వ్యవహారాన్ని వివాదాస్పదం చేసిందని అమిత్ కటారియా పేర్కొన్నారు. గతవారం ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ లో పర్యటించిన ప్రధాని నరేంద్రమోదీ 24 వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రధాని పర్యటనలో ప్రోటోకాల్ కు విరుద్ధంగా నల్ల కళ్లద్దాలు, ఫార్మల్ దుస్తులు ధరించినందుకు బస్తర్ కలెక్టర్ అమిత్ కటారియాకు ఛత్తీస్‌గఢ్ సర్కారు నోటీసులు కూడా జారీచేసింది.