ఎక్స్‌కు బై చెబుతున్న యూజర్లు.. మస్క్ వైఖరి మారిందా?
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ట్రంప్ విజయం ఖరారు అయినప్పటి నుంచి క్రమంగా ఇలాన్‌మస్క్ ఆధ్యర్యంలోని ఎక్స్ వినియోగదారులు తగ్గిపోతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అయితే అందుకు మస్క్ అవలంభిస్తున్న విధానాలే కారణమని కొందరు విశ్లేషిస్తున్నారు. ఇదే అదనుగా ట్విటర్(ప్రస్తుతం ఎక్స్) సహవ్యవస్థాపకులు జాక్ డోర్సే తయారు చేసిన ‘బ్లూస్కై’ వినియోగదారులు పెరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.డొనాల్డ్ట్రంప్ విజయానికి మస్క్ తీవ్రంగా కృషి చేశారు. రిపబ్లికన్ పార్టీకి తన వంతుగా దాదాపు రూ.900 కోట్లకు పైనే విరాళం అందించారు. ఎన్నికల ప్రచారంలోనూ యాక్టివ్‌గా పనిచేశారు. ఈ నేపథ్యంలో మస్క్ ఆధ్వర్యంలోని ఎక్స్ తటస్థతపై ప్రశ్నలొస్తున్నాయి. 2022లో ట్విటర్ చేజిక్కించుకున్న సమయంలో మస్క్ మాట్లాడుతూ..‘ప్రజల్లో ట్విటర్(ప్రస్తుతం ఎక్స్)పై విశ్వాసం పెరగాలంటే రాజకీయంగా తటస్థంగా ఉండాలి’ అన్నారు. కానీ, ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల్లో తన వైఖరి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఎన్నికల్లో ట్రంప్‌నకు మద్దతుకు ముందు ‘ఈసారి తన పదవీకాలం ముగిసే సమయానికి ట్రంప్‌నకు 82 ఏళ్లు వస్తాయి. దాంతో ఏ కంపెనీకు తాను సీఈఓగా ఉండేందుకు వీలుండదు. తర్వాత అమెరికాకు సారథ్యం వహించేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది’ అన్నారు. మస్క్ ఎక్స్‌ను టేకోవర్ చేసుకున్నప్పటి నుంచి అందులో తప్పుడు సమాచారం వ్యాప్తి జరుగుతోందనే వాదనలున్నాయి. ద్వేషపూరిత ప్రసంగాలు ప్రసారం జరుగుతున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.వారంలో 10 లక్షల వినియోగదారులు ఇదిలాఉండగా, ట్విటర్ సహవ్యవస్థాపకుడు జాక్ డోర్సే స్థాపించిన బ్లూస్కై యాప్‌కు వినియోగదారులు పెరుగుతున్నారు. అమెరికా ఎన్నికల అనంతరం వీరి సంఖ్య మరింత ఎక్కువవుతోంది. ఎన్నికల తర్వాత వారం రోజుల్లోనే ఒక మిలియన్ కంటే ఎక్కువ కొత్త వినియోగదారులను సంపాదించినట్లు కంపెనీ ప్రతినిధి ఎమిలీ లియు తెలిపారు. వీరిలో అధికంగా యునైటెడ్ స్టేట్స్, కెనడా, బ్రిటన్‌కు చెందినవారని చెప్పారు.ఇదీ చదవండి: ఉద్యోగ ప్రకటనలో వివక్షతతో కూడిన ప్రమాణాలు తొలగింపుబ్లూస్కై అంటే ఏమిటి?జాక్ డోర్సే 2019లో బ్లూస్కైను ప్రారంభించారు. ఇది ఎక్స్, ఫేస్బుక్ మాదిరిగానే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్. 2022లో మస్క్ ట్విటర్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి దీని ప్రచారాన్ని పెంచారు. ఈ ప్లాట్ఫామ్లో తాజాగా రాపర్ ఫ్లేవర్ ఫ్లావ్, రచయిత జాన్ గ్రీన్, అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్, చస్టెన్ బుట్టిగీగ్, మెహదీ హసన్, మోలీ జోంగ్-ఫాస్ట్ వంటి ప్రముఖులు చేరారు. ప్రస్తుతం ఈ యాప్ 14.7 మిలియన్ల వినియోగదారులను కలిగి ఉందని కంపెనీ తెలిపింది. యూఎస్ ఎన్నికల తర్వాత అమెరికా, యూకేలో యాపిల్ స్టోర్ డౌన్లోడ్ చార్ట్‌ల్లో తరచుగా ఇది అగ్రస్థానంలో నిలుస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు చెప్పారు.