boarder issues
-
పబ్జీని బ్యాన్ చేసినా భారత్‌లో ఆడొచ్చు!
భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మళ్లీ చోటు చేసుకోవడంతో కేంద్రప్రభుత్వం మరిన్ని చైనా యాప్స్‌పై నిషేధం విధించింది. వాటిలో అత్యంత ప్రజాదరణ పొందిన పబ్జీ గేమ్‌తో పాటు 118 ఇతర యాప్‌లు కూడా ఉన్నాయి. భారతదేశంలో 50 మిలియన్ మందికి పైగా పబ్జీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. 35 మిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్లు ఉన్నారు. పబ్జీ గేమ్‌ను మొదట దక్షిణ కొరియా తయారు చేసింది. దీనిని డెస్క్‌టాప్ వర్షన్లో ఆడొచ్చు. తరువాత సౌత్ కొరియా నుంచి లైసెన్స్ పొందిన చైనా కంపెనీ టెన్సెన్ట్ పబ్జీ మొబైల్, పబ్జీ మొబైల్ లైట్ యాప్‌ను తీసుకువచ్చింది. ఇప్పుడు చైనా, భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా కంపెనీతో సంబంధం ఉన్న పబ్జీ మొబైల్ యాప్‌ను కేంద్రం నిషేధించింది. అయితే భారత్‌లో డెస్క్‌టాప్‌లో ఈ ఆటను ఆడవచ్చు. డెస్క్‌టాప్ మోడ్‌ను సౌత్‌కొరియా రూపొందించి కాబట్టి దానిని ఇండియాలో బ్యాన్ చేసే అవకాశం లేదు. పబ్జీ యాప్ ఏమౌతుంది: టిక్‌టాక్ మాదిరిగానే పబ్జీయాప్ ఇంకా గూగుల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కేంద్రం ఆదేశాలు అందగానే గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆ యాప్‌ను తొలగిస్తారు. అయితే అంతకుముందు ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని ఉన్నప్పటికి ఎయిర్‌టల్,జియో మిగత నెట్ వర్క్‌లు తమ సర్వర్ల నుంచి పబ్జీ ఐపీ అడ్రస్‌ను తొలగించడంతో గేమ్ ఓపెన్ అవదు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ గేమ్ ఆడటానికి వీలు లేదు అంటూ ఒక పాప్అప్ కనిపిస్తోంది. మళ్లీ భారత్‌లో పబ్జీ ఎప్పుడు వస్తుంది భారత్-చైనా మధ్య ఉద్రికత్తలు నెలకొన్న నేపథ్యంలో భద్రతకు ముప్పు వాటిల్లుతుందనే కారణంతో కొన్ని చైనా యాప్స్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ వివాదాలు ముగిసిన తరువాత టిక్‌టాక్‌తో సహా పబ్జీ, హలో మిగిలిన యాప్స్ అన్నింటిని కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుందా, లేదా అనేది వేచిచూడాలి. చదవండి: పబ్జీ గేమ్‌ను నిషేధించిన కేంద్రం -
చైనాతో దౌత్య యుద్ధం చేయాల్సిందే!
సాక్షి, న్యూఢిల్లీ : ‘భారత్ శాంతికాముక దేశం. అనవసరంగా ఎవరైనా కయ్యానికి కాలు దువ్వితే తగిన రీతిలో గుణపాఠం చెబుతాం’ అని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం చైనాను ఉద్దేశించి వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. సైనిక సంపత్తితోపాటు ఆర్థికంగా భారత్‌కన్నా ఎన్నో రెట్లు బలమైన చైనా దేశానికి గుణపాఠం చెప్పడం ఎలా ? భారత్ భూభాగంలోకి కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న చైనా ఉత్పత్తులను బహిష్కరించడమే సరైన గుణ పాఠమని బీజేపీకి మిత్రులైన సంఘ్ వర్గాలతోపాటు పలు రంగాలకు చెందిన నిపుణులు కూడా సూచిస్తున్నారు. దాని వల్ల ఆశించిన ప్రయోజనం లభించక పోయినా దాన్ని ఓ ఆయుధంగా ఉపయోగించాల్సిందేనని ఆర్థిక నిపుణులు చెబున్నారు. భారత్‌లోని అనేక కంపెనీల్లో కూడా చైనా పెట్టుబడులు ఉన్నాయి. ముందుగా వాటి జోలికి పోకుండా చైనా నుంచి నేరుగా వచ్చి పడుతున్న ఉత్పత్తులను బహిష్కరించాలని వారు సూచిస్తున్నారు. ఆత్మాభిమానం నిలుపుకోవడానికి ఆ మాత్రం చర్య అవసరమని వారంటున్నారు. ఆత్మాభిమానం కన్నా పారదర్శకమైన దౌత్యపరమైన చర్యలు మరీ ముఖ్యం. (చైనా కాఠిన్యం: భారత జవాన్లపై కర్కశం) ‘వాస్తవాధీన రేఖ వద్ద సైనిక కదలికలను తగ్గించాలని జూన్ 6వ తేదీన చైనా, భారత్‌కు చెందిన ఉన్నత స్థాయి సైనిక అధికారుల మధ్య జరిగిన చర్చల్లో అవగాహన కుదిరింది. ఆ అవగాహనకు విరుద్ధుంగా చైనా అధికారులు వాస్తవాధీన రేఖను అతిక్రమించి ముందుకు చొచ్చుకు వచ్చారు. అక్కడ సైనిక గుడారం లాంటి నిర్మాణాన్ని నిర్మించబోగా భారత సైనికులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన సైనికులు మరణించారు’ అంటూ భారత విదేశాంగ శాఖ బుధవారం స్పష్టం చేసింది. లద్ధాఖ్లోని గాల్వలోయలో అసలు ఏం జరిగిందీ, ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసిన పరిస్థితులేమిటీ ? అన్న అంశాలపై భారత్ కాస్త ఆలస్యంగా స్పందించినప్పటికీ స్పష్టమైన వివరణ ఇచ్చింది. మిత్ర దేశాలకు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. అంతటితో ఆగిపోకుండా ఇదే పారదర్శకమైన విధానంతో అంతర్జాతీయ సమాజం ముందుకు వెళ్లి చైనా నిజ నైజాన్ని చూపించాలి. కరోనా వైరస్ కూడా చైనా ల్యాబ్ సృష్టించేదంటూ ఆ దేశంపై మండిపడుతున్న అమెరికా కూటమి దేశాలతో కలిసి చైనాతో భారత్ దౌత్య యుద్ధం చేయాలని పలువురు వార్ వెటరన్స్ సూచిస్తున్నారు. (భారత సైన్యంపై చైనా నిందలు) -
దోవల్ వస్తే పంచాయితీ పోతుందనుకోకండి: చైనా
న్యూఢిల్లీ: ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యను పరిష్కరించుకునే ఉద్దేశం చైనాకు ఏమాత్రం లేనట్లుంది. భారత్ నుంచి ఎలాంటి ప్రకటనలు రాకుండానే చైనా మీడియా మాత్రం రోజూ ఏదో ఒక ఆర్బాటం చేస్తూనే ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి రోజు భారత్‌పై జపం చేస్తోంది. చైనాలో జరగనున్న బ్రిక్స్ సమావేశానికి భారత జాతీయ రక్షణ సలహాదారు దోవల్ వెళ్లనున్న నేపథ్యంలో ఆయన వచ్చినంత మాత్రాన ఇరు దేశాల మధ్య సమస్య పరిష్కారం అవుతందని భారత్ భావించొద్దని పేర్కొంటూ చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ తాజాగా ఓ కథనాన్ని వెలువరించింది. ఈ నెల 27, 28 తేదీల్లో బ్రిక్స్ దేశాల జాతీయ సలహాదారుల సమావేశం చైనాలో జరగనుంది. ప్రస్తుతం చైనా, భారత్ మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నవారిలో దోవల్ ఒకరు. అయితే, ఈయన త్వరలోనే చైనాలో అడుగుపెట్టనున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దు వివాదం సర్దుమణుగుతుందని ఆశించొద్దని పేర్కొంది. 'అన్ని ఊహాగానాలకు న్యూఢిల్లీ స్వస్తి పలకాలి. బీజింగ్‌లో జరగనున్న దోవల్ పర్యటన మా దేశంతో ఉన్న సరిహద్దు వివాధానికి పరిష్కారం ఇస్తుందని మాత్రం భావించొద్దు. బ్రిక్స్ సదస్సులో భాగంగా ప్రతిసంవత్సరం బ్రిక్స్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ సమావేశం జరగడం అనేది సాధారణమైన విషయం. ఇది చైనా-భారత్ మధ్య సమస్యల పరిష్కారానికి వేదిక కాదు' అంటూ చైనా మీడియా వెల్లడించింది.