నిలిచిన డబుల్ డెక్కర్
బోనకల్: గుంటూరు నుంచి కాచిగూడ వెళ్తున్న డబుల్ డెక్కర్ రైలు శనివారం ఉదయం ఖమ్మం జిల్లా బోనకల్ రైల్వే స్టేషన్లో నిలిచి పోయింది. రైల్వే ట్రాక్ ఇరుపక్కల ఉన్న కంకరు ట్రైన్ కింది భాగంలోతగులుతుండటంతో.. అప్రమత్తమైన డ్రైవర్ బోనకల్ రైల్వేస్టేషన్లో రైలును నిలిపివేసి సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన సిబ్బంది పరిస్థితిని సమీక్షిస్తున్నారు.