Borneo
-
వర్షాలలో ఎలుకలతో వచ్చే జబ్బు!
చినుకు రాలే కాలమిది. వానలతో నేల తడిసే సమయమిది. దాంతో బొరియల్లోని ఎలుకలు బయటకు వస్తాయి. ఆహారం కోసం.. మెతుకుల్ని వెతుక్కుంటూ కిచెన్‌లో ప్రవేశిస్తాయి. వర్షాలు ఎక్కువగా ఉండి, కిచెన్ ప్లాట్‌ఫామ్‌పై ఎలుక కనిపించిందంటే చాలా జాగ్రత్తగా ఉండాలని అర్థం. ఎందుకంటే. వాటి నుంచి వ్యాప్తిచెందే లెప్టోస్పైరా జాతికి చెందిన బ్యాక్టీరియాతో ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది. చాలా సందర్భాల్లో పెద్దగా ప్రమాదం లేకపోయినా... కొన్నిసార్లు మాత్రం ప్రాణాంతకం అయ్యే ప్రమాదమూ ఉంది. మనం వర్షాకాలం ముంగిట్లో ఉన్న ప్రస్తుత సమయంలో ‘లెప్టోస్పైరోసిస్’ ఇన్ఫెక్షన్పై అవగాహన కోసం ఈ కథనం. లెప్టోస్పైరా ఇంటెరొగాన్ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే ఆరోగ్య సమస్య కాబట్టి దీనికి ‘లెప్టోస్పైరోసిస్’ అని పేరు. ఇది ఎక్కువగా ఎలుకలు, కొన్ని పెంపుడు జంతువులైన కుక్కలూ, ఫామ్‌లలో పెంచే జంతువులతోనూ వ్యాపిస్తుంది. దీన్ని ‘వీల్స్/ వెయిల్స్ డిసీజ్’ అని కూడా అంటారు. వ్యాప్తి ఇలా.. ఎలుకలు, ఇతర రోడెంట్స్ల (ఎలుక జాతికి చెందిన జీవుల) మూత్రవిసర్జనతో పొలాల్లోని నీరు కలుషితమవుతుంది. ఆ నీరూ, మట్టీ కలిసిన బురదలో పనిచేసేవారి ఒంటిపై గాయాలుంటే.. వాటి ద్వారా ఈ బ్యాక్టీరియా. మనిషి దేహంలోకి ప్రవేశించి లెప్టోస్పైరోసిస్‌ను కలుగజేస్తుంది. అందుకే చేలలో పనిచేసే రైతులు, పశువుల డాక్టర్లు (వెటర్నేరియన్స్), అండర్‌గ్రౌండ్ సీవరేజ్ వర్కర్లు వంటి వాళ్లలో ఇది ఎక్కువ. కలుషితమైన చెరువులు, వాగులు, సరస్సుల్లో ఈదేవారిలోనూ కనిపిస్తుంది. నివారణ: ఆహారాన్ని శుభ్రమైన ప్రదేశాల్లో (ఎలుకల వంటివి చేరలేని చోట్ల) సురక్షితంగా ఉంచాలి. రోడ్లపై మలమూత్రాలతో కలుషితమైన నీళ్లు (సీవరేజ్) ప్రవహించే చోట్ల నడవకపోవడం (కాళ్లకు పగుళ్లు, ఇతర గాయాలు ఉంటే వాటి ద్వారా బ్యాక్టీరియా దేహంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది); వీలైనంతవరకు జంతుమూత్రాలతో కలుషితమైన బురదనీటిలో, బురదనేలల్లో తిరగకుండా ఉండటం; పెంపుడు జంతువులకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలతో దీన్ని చాలావరకు నివారించవచ్చు. చికిత్స: పెన్సిలిన్, డాక్సిసైక్లిన్ వంటి మామూలు యాంటిబయాటిక్స్‌తో చికిత్స అందించడం ద్వారా దీన్ని తేలిగ్గానే నయం చేయవచ్చు. కాకపోతే లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కొన్నిసార్లు హాస్పిటల్లో ఉంచి చికిత్స అందించాల్సి రావచ్చు. ఎందుకంటే బ్యాక్టీరియా తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఇది కిడ్నీ ఫెయిల్యూర్, మెదడువాపు కలిగించే మెనింజైటిస్, లంగ్ ఫెయిల్యూర్ వంటి కాంప్లికేషన్లకు దారితీసే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో గుండె కండరాలు, అంతర్గత రక్తస్రావం వంటి ప్రమాదకరమైన పరిస్థితికి దారితీసే అవకాశం ఉన్నప్పటికీ అది చాలా అరుదు. లక్షణాలు: బ్యాక్టీరియా దేహంలోకి ప్రవేశించిన రెండువారాల్లో లక్షణాలు బయటపడవచ్చు. కొన్ని సందర్భాల్లో అసలు లక్షణాలే కనిపించకపోవచ్చు. తీవ్రమైన తలనొప్పి (కొన్నిసార్లు కొద్దిగా జ్వరంతో) ఛాతీ నొప్పి, కండరాల నొప్పి కొందరిలో కామెర్లు (కళ్లు, చర్మం పచ్చబడటం) వాంతులు, విరేచనాలు కొందరిలో చర్మంపై ర్యాష్‌తో. నిర్ధారణ: రక్తపరీక్షల్లో బ్యాక్టీరియా తాలూకు యాంటీబాడీస్‌తో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. మరింత ఖచ్చితమైన నిర్ధారణ కోసం డీఎన్ఏ పరీక్ష కూడా అవసరం పడవచ్చు. అయితే లక్షణాలు,ఆయా సీజన్లలో ఇది వచ్చే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ఈ జబ్బును అనుమానించి చికిత్స అందిస్తారు. డాక్టర్ గురుప్రసాద్, సీనియర్ ఫిజీషియన్ అండ్ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ (నిర్థారణ: బీట్రూట్ జ్యూస్ తాగే అలవాటుందా? ఇందులోని నైట్రేట్ వల్ల..) -
ఇండోనేసియాకు కొత్త రాజధాని.. రాజధానిని మార్చిన దేశాలివే..!
ఇండోనేసియా రాజధాని జకార్తా నుంచి తరలిపోతోంది. బోర్నియో ద్వీపంలో నుసంతర పేరిట కొత్త రాజధాని నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. దీన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని రేయింబవళ్లు పనులు కొనసాగిస్తోంది. ఈ కొత్త రాజధాని జకార్తాకు ఈశాన్యంగా 2 వేల కిలోమీటర్ల దూరంలో బోర్నియో ద్వీపంలో పచ్చని అటవీ ప్రాంతమైన కాలిమాంటన్లో కొలువుదీరనుంది. దీన్ని కాలుష్యరహిత, సతత హరిత నగరంగా రూపొందిస్తున్నారు. అయితే దీనిపై పర్యావరణవేత్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్త రాజధాని నిర్మాణంతో ఆ ప్రాంతంలో అటవీ సంపద తరిగిపోయి వన్యప్రాణులకు నిలువ నీడ లేకుండా పోతుందని, పర్యావరణంపై తీవ్ర దుష్ప్రభావం పడుతుందని వారంటున్నారు. జకార్తా ఇసుకవేస్తే రాలనంత జనాభాతో కిటకిటలాడుతోంది. రాజధానిలో కోటి మందికి పైగా జనాభా నివసిస్తారు. మెట్రోపాలిటన్ ప్రాంతాన్నీ కలిపితే 3 కోట్ల దాకా ఉంటారు. భరించలేని కాలుష్యం రాజధాని వాసుల్ని ఊపిరి పీల్చుకోనివ్వడం లేదు. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో జకార్తా అగ్ర భాగంలో ఉంటోంది. ఇక అత్యంత వేగంగా కుంగిపోతున్న నగరాల్లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ప్రస్తుత అంచనాల ప్రకారం 2050 నాటికి జకార్తాలో మూడింట ఒక వంతు సముద్రంలో మునిగిపోతుంది. దీనికి తోడు ఇండోనేసియాకు భూకంపాల ముప్పు ఉండనే ఉంది. అన్నింటి కంటే రాజధాని మార్పుకు మరో ముఖ్య కారణం అడ్డూ అదుపు లేకుండా భూగర్భ జలాల వెలికితీయడం. దీనివల్ల వాతావరణంలో మార్పులు ఏర్పడి వరదలు ముంచెత్తుతున్నాయి. వరదల కారణంగా ఏటా 450 కోట్ల డాలర్లు నష్టం వాటిల్లితోంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని జకార్తా నుంచి బోర్నియోకు రాజధానిని మార్చేయాలని అధ్యక్షుడు జోకో విడొడొ గతేడాది ప్రకటించారు. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించారు. పర్యావరణవేత్తలు ఏమంటున్నారు? కొత్త నగర నిర్మాణ ప్రాంతం అరుదైన వృక్షజాలం, జంతుజాలానికి ఆలవాలం. ఇప్పుడు వాటి ఉనికి ప్రమాదంలో పడనుంది. నగర నిర్మాణానికి చెట్లను కూడా భారీగా కొట్టేస్తున్నారు. రాజధాని కోసం ఏకంగా 2,56,142 హెక్టార్ల అటవీ భూమిని సేకరిస్తున్నారు. ఇవన్నీ పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపేవే. పైగా ఈ అడవుల్లో దాదాపుగా 100 గిరిజన తెగలు నివాసం ఉంటున్నాయి. వారందరికీ పునరావాసం, నష్టపరిహారం ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో అన్నీ సరిగ్గా అమలయ్యే అవకాశం లేదన్న ఆందోళనలున్నాయి. రాజధానిని మార్చిన దేశాలివే..! గతంలో ఎన్నో దేశాలు పలు కారణాలతో రాజధానుల్ని మార్చాయి... ► రాజధాని దేశానికి నడిబొడ్డున ఉండాలన్న కారణంతో బ్రెజిల్ 1960లో రియో డిజనిరో నుంచి బ్రెసీలియాకు మార్చింది. ► 1991లో నైజీరియా లాగోస్ నుంచి అబూజాకు రాజధానిని మార్చుకుంది. ► 1997లో కజకిస్తాన్ కూడా అల్మటి నుంచి నూర్–సుల్తాన్‌కు రాజధానిని మార్చింది. కానీ ఇప్పటికీ అల్మటీయే వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది. ► మయన్మార్ రంగూన్ నుంచి రాజధానిని నేపిడాకు మార్చింది. కొత్త రాజధాని ఎలా ఉంటుంది? కొత్త రాజధాని నిర్మాణాన్ని అధ్యక్షుడు విడొడొ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒక సుస్థిర నగరంలో అందరూ కొత్త జీవితాల్ని ప్రారంభించాలని ఆయన ఆశపడుతున్నారు. ఫారెస్ట్ సిటీ కాన్సెప్ట్‌తో హరిత నగరాన్ని నిర్మించనున్నారు. నగరంలో 65% ప్రాంతంలో ఉద్యానవనాలే ఉంటాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని స్మార్ట్ నగరంగా కూడా తీర్చిదిద్దనున్నారు. సౌర విద్యుత్, జల సంరక్షణ విధానాలు, వ్యర్థాల నిర్వహణ వంటివన్నీ కొత్త సాంకేతిక హంగులతో ఉంటాయి. ప్రస్తుతానికి ఐదు గిరిజన గ్రామాలను ఖాళీ చేయించి నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ఈ ఏడాది 184 ప్రభుత్వ భవనాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్త రాజధాని నుసంతరను అటవీ నగరం కాన్సెప్ట్‌తో ప్రణాళికాబద్ధంగా కడుతున్నాం. 65% ప్రాంతం పచ్చదనానికే కేటాయిస్తున్నాం. 2024 ఆగస్టు 17 స్వాతంత్య్ర దిన వేడుకలను కొత్త రాజధానిలో జరిపేలా సన్నాహాలు చేస్తున్నాం. – బాంబాంగ్ సుసాంటొనొ, నుసంతర నేషనల్ కేపిటల్ అథారిటీ చీఫ్ అధ్యక్ష భవనం నమూనా కొత్త రాజధాని నిర్మాణ అంచనా వ్యయం: 3,200 కోట్ల డాలర్లు రాజధాని నిర్మాణంలో ప్రైవేటు పెట్టుబడులు: 80% ఈ ఏడాది నిర్మాణం జరుపుకునే భవనాలు: 184 ప్రస్తుతం నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికులు: 7 వేలు తొలి దశలో తరలివెళ్లే ప్రజలు సంఖ్య: 15 లక్షలు అధ్యక్ష భవనం నిర్మాణం పూర్తయ్యేది: 2024 ఆగస్టు 17 (దేశ స్వాతంత్య్ర దినోత్సవం) రాజధాని నుసంతర నిర్మాణం పూర్తయ్యేది: 2045 ఆగస్టు 17 (దేశ వందో స్వాతంత్య్ర దినం) – సాక్షి, నేషనల్ డెస్క్ -
జకార్తా జలవిలయం!
జకార్తా: ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో శుక్రవారం కీలక ప్రకటన చేశారు. పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తూ..‘దేశ రాజధానిని జకార్తా నుంచి బోర్నియో దీవిలోని కలిమంతన్కు తరలించేందుకు పార్లమెంటు అనుమతి కోరుతున్నాను. రాజధాని అంటే కేవలం ఓ జాతికున్న గుర్తింపు మాత్రమే కాదు. అది దేశం సాధించిన ప్రగతికి చిహ్నం కూడా’ అని విడోడో తెలిపారు. ఏకంగా అధ్యక్షుడే ఈ తరహా వ్యాఖ్యలు చేయడానికి చాలా ముఖ్యమైన కారణముంది. పర్యావరణ మార్పులు, భూతాపం కారణంగా జకార్తా సముద్రంలో శరవేగంగా మునిగిపోతోంది. దీన్ని నివారించేందుకు ప్రభుత్వం పలుచర్యలు తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. ప్రస్తుతమున్న పరిస్థితులే కొనసాగితే, 2050 నాటికి నగరంలోని మూడో వంతు ప్రాంతం సముద్రగర్భంలోకి జారిపోతుందని పర్యావరణవేత్తలు హెచ్చరించిన నేపథ్యంలో రాజధానిని తరలించాలని ఇండోనేసియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాలకుల వైఫల్యమే శాపం.. కోటి మందికిపైగా ప్రజలు నివసిస్తున్న జకార్తా భూకంపాలు అధికంగా సంభవించే జోన్లో ఉంది. చిత్తడినేలపై నిర్మితమైన ఈ నగరానికి సమీపంలో 13 నదులు కలుస్తున్నాయి. పాలకులు జకార్తా నిర్మాణం సమయంలో తాగునీటి సరఫరాపై దృష్టి సారించకపోవడం ఈ నగరం పాలిట శాపంగా మారింది. నీటి సరఫరా జరగకపోవడంతో పరిశ్రమలు, ప్రజలు తమ అవసరాల కోసం బోర్లు వేసి భూగర్భ జలాన్ని విచ్చలవిడిగా తోడేశారు. స్థానిక జలాశయాల్లోని నీటిని కోలుకోలేని రీతిలో వాడేశారు. దీంతో చాలాచోట్ల భూగర్భ జలాలు ఇంకిపోయాయి. దీనికితోడు రాజధాని కావడంతో పెద్దఎత్తున ఆకాశ హర్మ్యాల నిర్మాణం జరిగింది. ఈ చర్యల కారణంగా జకార్తాలో భూమి క్రమంగా కుంగడం ప్రారంభమైంది. ప్రస్తుతం జకార్తాలో ఏటా 25 సెం.మీ. మేర భూమి కుంగిపోతోంది. కొన్నిచోట్లయితే నేల సముద్రమట్టానికి 4 మీటర్ల దిగువకు చేరుకుంది. భూతాపం కారణంగా సముద్రమట్టం పెరుగుతోంది. ఫలించని ప్రయత్నాలు.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జకార్తాను కాపాడుకునేందుకు ఇండోనేసియా ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డుతోంది. జవా సముద్రం ఆటుపోట్లను అడ్డుకునేలా ఓ పొడవైన గోడతో పాటు కృత్రిమ దీవులను నిర్మించాలని అధ్యక్షుడు జోకో విడోడో ప్రతిపాదించారు. ఇందుకు రూ.2.84 లక్షల కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. ఇందులోభాగంగా ఇప్పటివరకూ 32 కిలోమీటర్ల మేర భారీ సముద్రపు గోడను, 17 కృత్రిమ దీవులను నిర్మించారు. అయితే ఇది సమస్యకు అనుకున్న పరిష్కారం చూపలేకపోయింది. ఈ భారీ సముద్రపు గోడ నుంచి చాలాచోట్ల నీరు ఊరటం ప్రారంభమైంది. మరికొన్ని చోట్ల ఈ గోడే నేలలోకి కుంగిపోవడం ప్రారంభించింది. దీంతో రాజధానిని తరలించడం తప్ప మరో ప్రత్యామ్నాయం ప్రస్తుతానికి లేదని ప్రభుత్వం ఓ అభిప్రాయానికి వచ్చేసింది. అయితే జకార్తాలోని మూడోవంతు ప్రాంతం మునిగిపోతే లక్షలాది మంది ఇండోనేసియా ప్రజలు నిరాశ్రయులయ్యే ప్రమాదముంది. వీరందరికీ ఆశ్రయం కల్పించడం ఇండోనేసియా ప్రభుత్వానికి నిజంగానే సవాలుగా మారనుంది. -
ఈ మానవ తెగ నశించి పోతోంది!
బోర్నియో: ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ మధ్యన సముద్ర జలాల్లో నివసిస్తున్న అరుదైన ‘బ్యాడ్జావో’ సంచార మానవ తెగ నశించిపోతోంది. బీచ్‌లకు సమీపాన పడవల్లో లేదా సముద్ర జలాల్లో మంచెలాంటి గుడిసెలు వేసుకొని జీవనం సాగించే ఈ తెగను తమ జాతీయులుగా ఇండోనేషియాగానీ, ఫిలిప్పీన్స్‌గానీ, వలసలను అనుమతించిన మలేషియాగానీ నేటికి గుర్తించడంలేదు. దాదాపు ఐదు శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ జాతి కేవలం సముద్ర జీవులపై ఆధారపడి బతుకుతోంది. బరిశెలతోనే కాకుండా ఒట్టి చేతులతో కూడా చేపలు పట్టడంలో ఈ జాతి వారు అనుభవజ్ఞులు. నీటి లోపల, సముద్రం ఒడ్డున ఊపిరి భిగపట్టి చేపలు పడతారు. ఎప్పుడూ నీటి మీదనే జీవనం సాగిస్తుండడం వల్లనా వీరు సముద్రం అట్టడుగు ప్రాంతం వరకు ఈత కొట్టడంలో ఎంతో నేర్పరులు. బ్యాడ్జావో తెగ ప్రజలు పర్యాటకులు ఇచ్చే కళ్లజోళ్లను ఆధునిక నీటి కెమెరాలను కూడా ఇటీవల ఉపయోగిస్తున్నారు. ఎలాంటి ఆవేశకావేశాలకు ఆస్కారమివ్వకుండా ప్రశాంతంగా జీవించే ఈ తెగవారు చాలా మృధు స్వభావులు. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. తోటి మానవుల పట్ల ప్రేమగా మెలగుతారు. అయినా ఈ జాతి వారు ప్రధాన మానవ జీవన స్రవంతిలో కలువకుండా దాదాపు నాలుగు శతాబ్దాలపాటు ఉండిపోయారు. దాంతో వీరిలో ఎవరూ కూడా చదువు సంధ్యలవైపు దృష్టి సారించలేదు. వివిధ తుఫానులు కారణంగా మృత్యువాత పడుతుండడంతో ఈ జాతి క్రమంగా నశిస్తూ వస్తోంది. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ సముద్ర జలాల్లో బతకడం కష్టమనుకున్న వారు మలేషియా సముద్ర తీరాలకు తరలిపోయారు. అక్కడ కూడా వీరు ప్రధాన మానవ జీవన స్రవంతికి దూరంగానే బతుకుతున్నారు. సాయస యాత్రలు చేయడంలో పేరుపొందిన పోలండ్ ఫొటోగ్రాఫర్ డేవిడ్ కస్జీలికోవిస్కీ ఈ జాతి జనులతో వారం రోజులపాటు గడిపి పలు ఫొటోలు తీశారు.