అండర్-14 విజేత సీసీఓబీ
ముగిసిన బోస్టన్ కప్ క్రికెట్ టోర్నీ
బహదూర్‌పురా, న్యూస్‌లైన్: బోస్టన్ కప్ క్రికెట్ టోర్నమెంట్ అండర్-14 విభాగంలో సీసీఓబీ జట్టు టైటిల్ గెలుచుకుంది. మాసాబ్‌ట్యాంక్‌లోని ఎస్సీఎఫ్ గ్రౌండ్స్‌లో శనివారం జరిగిన ఫైనల్లో సీసీఓబీ, ఎస్సీఎఫ్ గ్రీన్‌పై విజయం సాధించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన ఎస్సీఎఫ్ గ్రీన్ నిర్ణీత 10 ఓవర్లలో 108 పరుగులు చేయగా...సీసీఓబీ 9.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. అండర్-12, అండర్-16 విభాగాల్లో మాత్రం సీసీఓబీ రన్నరప్‌గా నిలిచింది. అండర్-12 విభాగంల్లో సూపర్ క్యాట్ జట్టు కప్ గెలుచుకుంది. ఫైనల్లో సూపర్ క్యాట్ 10 ఓవర్లలో 3 వికెట్లకు 95 పరుగులు సాధించగా, సీసీఓబీ 65 పరుగులే చేయగలిగింది. అండర్-16 విభాగంలో ఎస్సీఎఫ్ తులసి గెలుపు సొంతం చేసుకుంది.
ఫైనల్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో సీసీఓబీని చిత్తు చేసింది. ముందుగా సీసీఓబీ 122 పరుగులు చేయగా...తులసి టీమ్ 2 వికెట్లకు 124 పరుగులు చేసింది. ముజీబ్ 45, బాబీ 38 పరుగులతో రాణించి విజయంలో కీలకపాత్ర పోషించారు. ఐపీఎస్ అధికారి ఆవుల రమేశ్ రెడ్డి, మాజీ క్రికెటర్ మోమిన్ పటేల్, ఎస్సీఎఫ్ చైర్మన్ సాయిబాబా, బోస్టన్ కప్ నిర్వాహకులు మొహమ్మద్ షాకీర్ విజేతలకు బహుమతులు అందజేశారు.