bothsa Satya Narayan
-
గెలుపే లక్ష్యం
సాక్షి, అమరావతి బ్యూరో: జిల్లాలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యం గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ గుంటూరు జిల్లా పరిశీలకుడు బొత్స సత్యనారాయణ పార్టీ పార్లమెంటరీ జిల్లాల అ«ధ్యక్షులు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలతో రెండు రోజుల పాటు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలు, నాయకుల పని తీరుపై నియోజకవర్గాల వారీగా గుంటూరులోని పార్టీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎంను చేయడం లక్ష్యంగా, గ్రామస్థాయి నుంచి బూత్ కమిటీ సభ్యులు, పార్టీ అనుకూల సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, పార్టీ మండలాధ్యక్షులు, అనుబంధ విభాగాల నాయకులు, ముఖ్యనేతలు ఏకతాటిపైకి రావాలని సూచిం చారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘రావాలి జగన్ – కావాలి జగన్’ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్రధానంగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలను ప్రజలకు వివరించాలని సూచించారని నాయకులు తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలను టీడీపీ మభ్యపెట్టే అవకాశం ఉన్నందున కార్యకర్తలు, నాయకులు అప్రమత్తంగా ఉండి సమర్థవంతగా తిప్పికొట్టాలని సూచించారు. అభ్యర్థుల గెలుపే లక్ష్యం కావాలి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని పార్టీ నాయకులకు బొత్స సత్యనారాయణ దిశానిర్దేశం చేశారు. మొదటి దశలో తాడికొండ, పెదకూరపాడు, సత్తెనపల్లి, గుంటూరు పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల నేతలతో సమావేశం అయ్యారు. నాయకులతో ప్రత్యేకంగా మాట్లాడి సమష్టిగా పార్టీ పటిష్టతకోసం కృషి చేయాలని కోరారు. జిల్లాలో నియోజ కవర్గాల వారీగా నాయకులతో సమీక్ష జరగనున్నట్లు పార్టీ నేతలకు వివరించారు. ఈ సమీక్షలో గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, పార్లమెంట్ సమన్వయకర్త కిలారి రోశయ్య ఆధ్వర్యంలో నియోజకవర్గాల వారీగా పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు, స్థానిక నేతలతో బొత్స సమీక్షించారు. ఓటర్ల జాబితాలపై దృష్టి... పట్టణాలు, గ్రామాల్లో ఓటర్ల జాబితాలను పరిశీలించి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరుల ఓట్లు ఉన్నాయో, లేవో, చూసుకోవాలని నేతలకు సూచించారు. దొంగ ఓట్ల పై దృష్టి సారించాలని, వాటిని తొలగించేలా చూడాలని పేర్కొన్నారని సమాచారం. ఓటర్ల జాబితాకు సంబంధించి మార్పులు, చేర్పులపై అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఓటూ కీలకమేనని నాయకులకు వివరించినట్లు సమాచారం. -
పాల కన్నయ్య రెడ్డికి నివాళి
సాక్షి, విశాఖ : వైఎస్సార్సీపీ ఎన్నారై నేత పాల త్రివిక్రమ భానోజి రెడ్డి తండ్రి కన్నయ్యరెడ్డికి పార్టీ నేతలు నివాళి అర్పించారు. శనివారం రోజు జరిగిన ఆయన దశదిన కర్మ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ, టి. నాగిరెడ్డి, గుడివాడ అమర్నాథ్ రెడ్డి,తదితరులు హాజరై నివాళులర్పించారు. -
సెక్షన్-8 డిమాండ్ ఇప్పుడేమైంది?
చంద్రబాబును ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నేత బొత్స సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు సమయంలో హైదరాబాద్‌లోని ఆంధ్రుల రక్షణకు సెక్షన్- 8 అమలు చేయాలని డిమాండ్ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రేటర్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆ విషయమే ప్రస్తావనకు తీసుకురాకపోవడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న మంత్రులు గవర్నర్‌పై విమర్శలు చేయకూడదని అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సూచించినప్పటికీ పెడచెవిన పెట్టి తీవ్ర ఆరోపణలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం బొత్స విలేకరులతో మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా నేతల ప్రచారం నాటకీయంగా, తమాషాగా ఉందన్నారు. టీడీపీ సహా మిగిలిన పార్టీ నేతల హావభావాలు ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి లాంటి మహా నటుల నటననే మించిపోయాయని తెలిపారు. సొంత సమస్యల నుంచి బయటపడడం కోసం చంద్రబాబు హైదరాబాద్‌లో ఉన్న 50- 60 లక్షల మంది ఆంధ్ర ప్రజలను అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ‘నేను ఇక్కడే ఉంటాన’ని చంద్రబాబు హైదరాబాద్‌లోనూ, ఆంధ్రప్రదేశ్‌లోనూ చెప్తున్నారని, ఆయనేమైనా ద్విపాత్రాభినయం చేస్తారా? అని ఎద్దేవా చేశారు. ఇక కేసీఆర్ వద్ద ఓటుకు కోట్లు కేసును ప్రస్తావిస్తే... గ్రేటర్ ఎన్నికల తర్వాత మాట్లాడుకుందామన్నారని గుర్తు చేశారు. ప్రజలు అమయాకులనుకుంటూ ఏ సమయానికి ఆ మాటలు చెబుతున్నారా? అని దుయ్యబట్టారు. కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చే జీవోలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తట్టెడు మట్టి తీసే పనులు జరగడం లేదు కానీ, ఆ కాంట్రాక్టరుకు వందల వేల కోట్లు లబ్ది చేకూర్చుతూ ప్రభుత్వం ఇటీవల జీవో నెంబరు-13ని జారీ చేసిందని బొత్స దుయ్యబట్టారు. ఈ జీవో ద్వారా కాంట్రాక్టరు అదనపు ప్రయోజనం చేకూర్చిన రూ. 2000 కోట్లలో ప్రభుత్వ పెద్దల వాటా ఎంత అని ప్రశ్నించారు. కాపు కులంలో పుట్టిన వ్యక్తిగా తూర్పు గోదావరి జిల్లాలో జరిగే కాపు గర్జన సభలో తాను పాల్గొంటానని.. కులంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఆ సమావేశంలో పాల్గొనాలని తాను కోరుకుంటున్నట్టు విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు బదులిచ్చారు. కాపుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టు చె ప్పుకుంటున్న ప్రభుత్వం ఆ కార్యక్రమ నిర్వహణకు ఎందుకు అటంకాలు కల్పిస్తోందని ప్రశ్నించారు.