రైతు ప్రాణం తీసిన రాత్రి కరెంటు
కొల్లాపూర్(మహబూబ్నగర్): పైరును కాపాడుకునేందుకు వెళ్లిన ఓ రైతు పొలంలోనే విద్యుత్ షాక్తో మృతి చెందాడు. మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్ మండలం ముత్తిరెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. వివరాలివీ.. గ్రామానికి చెందిన బోయ లింగస్వామి(25) తన రెండెకరాల పొలంలో మొక్కజొన్న పంట వేశాడు. పైరుకు నీళ్లు పారించేందుకు మంగళవారం రాత్రి బోరుబావి దగ్గరకు వెళ్లాడు.
బోరు మోటార్ వైర్ తెగి నేలపై పడిన విషయం తెలియక అటుగా వెళ్లటంతో షాక్కు గురై మృతి చెందాడు. బుధవారం ఉదయం అటుగా వెళ్లిన పక్క పొలం రైతులు గమనించి తల్లిదండ్రులు లింగస్వామి, ఈశ్వరమ్మకు సమాచారం అందజేశారు.