bramari
-
మయూర వాహనాధీశా.. నమో నమః
- నేటి రాత్రి వరకే మల్లన్న స్పర్శ దర్శనం - రేపటి నుంచి అందరికీ అలంకార దర్శనమే - రాష్ట్ర ప్రభుత్వం తరపున నేడు పట్టువస్త్రాల సమర్పణ - అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు శ్రీశైలం: శ్రీశైలేశుడు భ్రామరీ సమేతంగా మయూర వాహనంపై భక్తులను ఆశీర్వదించారు. స్వామి, అమ్మవార్ల దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకున్న భక్తులు హరోంహర.. శంభోశంకర.. శ్రీశైల మల్లన్నా పాహిమాం.. పాహిమాం అంటూ పురవీధుల్లో సాగిలపడ్డారు. సోమవారం రాత్రి 8 గంటలకు శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఆలయ ప్రాంగణంలోని అలంకార మండపంలో ఉత్సవమూర్తులను మయూర వాహనంపై అధిష్టింపజేశారు. వేదమంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు, వేద పండితులు వాహన పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం వాహన సమేతులైన స్వామి, అమ్మవార్లను ఆలయ ప్రాంగణం నుంచి ఊరేగిస్తూ కృష్ణదేవరాయల గోపురం మీదుగా రథశాల వద్దకు చేర్చారు. అక్కడి నుంచి ప్రారంభమైన గ్రామోత్సవం నంది మండపం, బయలు వీరభద్రస్వామి మండపం చేరుకొని తిరిగి రాత్రి 9.30 గంటలకు ఆలయ ప్రాంగణం చేరుకుంది. గ్రామోత్సవంలో లక్షలాది భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకొని కర్పూర నీరాజనాలర్పించారు. కార్యక్రమంలో ఈఓ నారాయణ భరత్‌గుప్త, ఈఈలు శ్రీనివాస్, రామిరెడ్డి, శ్రీశైలప్రభ ఎడిటర్ డాక్టర్ కడప అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. నేటి రాత్రి వరకే మల్లన్న స్పర్శదర్శనం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీ దృష్ట్యా మంగళవారం రాత్రి వరకే మల్లన్న స్పర్శదర్శనాన్ని ఏర్పాటు చేసినట్లు ఈఓ నారాయణ భరత్‌గుప్త తెలిపారు. ఆ తర్వాత మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు మల్లికార్జునస్వామివార్ల ఆలంకార దర్శనాన్ని మాత్రమే కల్పిస్తామన్నారు. శివస్వాములు, సాధారణ భక్తజనంతో పాటు వీఐపీలు, వీవీఐపీలకు కూడా మల్లన్న స్పర్శదర్శనం శివరాత్రి ముగిసే వరకు ఉండదన్నారు. శివరాత్రి పర్వదినాన నిర్వహించే స్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రోడ్లు భవనాలు, రవాణాశాఖ మంత్రి సిద్ధా రాఘవరావు మంగళవారం సాయంత్రం పట్టువస్త్రాలను సమర్పిస్తారన్నారు. -
కాళరాత్రి రూపంలో భ్రామరి
-
‘నంది’త మోహిని..!
- నందివాహనంపై ఆది దంపతులు - మహాగౌరిగా దర్శనమిచ్చిన భ్రామరి - కనుల పండువగా గ్రామోత్సవం శ్రీశైలం: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో శరన్నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. శనివారం ఎనిమిదో రోజు ఆదిదంపతులైన భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్లు నందివాహనంపై దర్శనమిచ్చారు. అమ్మవారు మహాగౌరి రూపంలో దీవెనలు అందించారు. దివ్య మంగళ స్వరూపంతో కనిపించిన స్వామి అమ్మవార్లను నందివాహనంపై వీక్షించిన భక్తులు నందీవాహనాధీశా నమోనమః అంటూ స్తుతించారు. ముగ్ధమనోహరంగా దరహాస వీచికతతో కనిపించిన శ్రీభ్రమరాంబాదేవికి సాష్టాంగ ప్రమాణాలను చేస్తూ పాహిమాం పాహిమాం అంటూ ప్రార్థించారు. అంతకు ముందుగా ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ఉత్సవమూర్తులను నందివాహనంపై అధిష్టింపజేసి విశేష వాహనసేవలను నిర్వహించారు. అనంతరం మహాగౌరి అలంకార రూపంలో ఉన్న అమ్మవారిని వేదమంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక అలంకార పూజలను చేశారు. ప్రధానాలయ రాజగోపురం గుండా రథశాల వద్దకు చేరిన ఉత్సవమూర్తులకు తిరిగి ప్రత్యేకార్చనలను చేసి గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి ప్రారంభమైన గ్రామోత్సవం అంకాలమ్మ గుడి, నంది మండపం, బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు కొనసాగి రాత్రి 9.30గంటలకు తిరిగి ఆలయప్రాంగణం చేరుకుంది. ఈఓ నారాయణ భరత్ గుప్త, జెఈఓ హరినాథ్‌రెడ్డి, ఏఈఓ కృష్ణారెడ్డి, పర్యవేక్షకులు మల్లికార్జునరెడ్డి, సాయికుమారి, మధుసూదన్‌రెడ్డి, అన్ని విభాగాలకు చెందిన సిబ్బంది, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. నేడు కల్యాణోత్సవం శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ భ్రమరాంబాదేవిని సిద్ధిదాయినీగా అలంకరించి ప్రత్యేకపూజలను చేస్తారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై అధిష్టింపజేసి వాహన పూజలను నిర్వహిస్తారు. హంసవాహనాధీశులైన స్వామిఅమ్మవార్లను పురవీధులలో ఊరేగిస్తారు. ఆ తరువాత కల్యాణోత్సవం, శయనోత్సవ సేవలు జరుగుతాయి. -
గజవాహనంపై ఆదిదంపతులు
- కాళరాత్రి రూపంలో భ్రామరి శ్రీశైలం: శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి వారు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారు కాళరాత్రిరూపంలో దీవెనలు అందించారు. శ్రీశైలమల్లన్న దేవేరి భ్రామరితో కలిసి గజవాహనాన్ని అధిష్టించి విశేషపూజలందుకున్నారు. అక్కమహదేవి అలంకార మండపంలో అమ్మవారి అలంకార రూపాన్ని గజవాహనంపై అధిష్టించిన స్వామివార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేకపూజలను నిర్వహించిన అనంతరం మూడుమార్లు ఉత్సవమూర్తులను ఆలయ ప్రదక్షిణ చేయించారు. వాతావరణ పరిస్థితుల్లో మార్పులు రావడంతో వాన పడుతుందనే ఉద్దేశంతో గ్రామోత్సవాన్ని రద్దు చేశారు. దీంతో ఉత్సవం ఆలయప్రదక్షిణకే పరిమితమైంది.