పగిలిన కృష్ణా పైప్లైన్
కందుకూరు: రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు మండలం రాచులూరు గ్రామ శివారులో కృష్ణ నీటిని సరఫరా చేసే పైపు లైన్ పగలడంతో.. తాగునీరు వృథాగా పోతోంది. షాద్నగర్ పైపు వెళ్లే పైప్లైన్ ప్రమాదవశాత్తు పగలిపోవడంతో.. గురువారం తెల్లవారుజాము నుంచి నీరు వృథాగా పోతోంది. ఇది గుర్తించిన స్థానికులు సంబంధిత అధికారులకు సమాచారం అందించినా ఇప్పటివరకు స్పందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు