brhma kamalam
-
బ్రహ్మకమలం విరబూసింది
సంవత్సరానికి ఒకేసారి పూసే బ్రహ్మకమలం హిందూపూర్ లోని ఓ ఇంట్లో విరబూసింది. అనంతపురం జిల్లా హిందూపురంలోని డీబీ కాలనీలోని ద్వారకానాథ్ రెడ్డి కొన్ని సంవత్సరాల క్రితం బ్రహ్మ కమలం మొక్కను తెచ్చి పెంచుతున్నారు. ఈ క్రమంలో శనివారం బ్రమ్మ కమలం పువ్వు వికసించింది. కొన్ని గంటలు మాత్రమే వికసించే ఈ అందమైన పుష్పాన్ని చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో వచ్చారు. హిమాలయాల్లో దొరికే.. ఈ మొక్క ఇంట్లో ఉంటే మంచిదని భావిస్తారు. -
విరబూసిన బ్రహ్మకమలం
మణికొండ(హైదరాబాద్): సంవత్సరానికి ఒకేసారి పూసే బ్రహ్మకమలం మణికొండలోని ఓ ఇంట్లో విరబూసింది. ఒకే సారి ఐదు పువ్వులు పూయడంతో స్థానికులు దాన్ని చూసేందుకు క్యూ కట్టారు. మణికొండ పంచాయతీ పరిధిలోని సెక్రటేరియట్ కాలనీలో నివసిస్తున్న నీటి పారుదల శాఖ విశ్రాంత ఎస్ఈ ముప్పర కుమారరత్నం గత కొన్ని సంవత్సరాల క్రితం బ్రహ్మకమలం మొక్కను తెచ్చి పెంచుతున్నారు. గత మూడు సంవత్సరాలుగా... ఏటా ఒకే పువ్వు పూయగా ఈ ఏడాది మాత్రం మంగళవారం అర్ధరాత్రి ఏకంగా ఐదు పువ్వులు పూసిందని ఆయన తెలిపారు. హిమాలయాల్లోనే ఉండే ఈమొక్క ఇంట్లో ఉంటే మంచిదని తెలపటంతో తెచ్చి పెంచుకుంటున్నామని చెప్పారు.