తెలంగాణలో అమెరికా,బ్రిటన్ తరహా విద్యావ్యవస్థ:కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణలో విద్యారంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు చెప్పారు. అమెరికా, బ్రిటన్ తరహా విద్యావ్యవస్థను తెలంగాణలో అమల్లో పెడతామన్నారు. తెలంగాణలోని 16 టీచర్ యూనియన్ల ప్రతినిధులతో కెసిఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ ఏకీకృత సర్వీస్ డిమాండ్‌పై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఇదిలా ఉండగా, ఆర్డీఎస్ వివాదంపై కర్ణాటక ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. కర్ణాటక పరిధిలో జరుగుతున్న ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలని ఆ లేఖలో తెలంగాణ ప్రభుత్వం కోరింది. నీటి వివాద సమస్య పరిష్కరించాలని లేఖ రాసిన మంత్రి హరీశ్‌రావు కర్ణాటక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.