అన్నదమ్ముల మధ్య వివాదం: ఒకరి మృతి
చాగలమర్రు (కర్నూలు): భూ వివాదంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో తమ్ముడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా చాగలమర్రు మండలంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది.
వివరాలు.. మండలంలోని కల్లగోంట్ల గ్రామానికి చెందిన సాల్మాన్, ఏసోబులు అన్నదమ్ములు. వీరి మధ్య భూమి విషయంలో గొడవ జరిగింది. దీంతో ఇరువురు ఘర్షణ పడ్డారు. ఏసోబు దాడి చేయడంతో సాల్మాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.