కాలంచెల్లిన మైనింగ్లను గుర్తించండి
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : జిల్లాలో కాలంచెల్లిన మైనింగ్ ప్రాంతాలను గుర్తించి పర్యావరణహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు పంపించాలని గనులు, భూగర్భశాఖ రాష్ట్ర సంచాలకులు బీఆర్వీ సుశీల్‌కుమార్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జిల్లా మైనింగ్ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో గుర్తించిన 32 పెద్దతరహా గనులకు జియో కోఆర్డినేట్ ద్వారా లొకేషన్ ఇవ్వాలని, ఈ ప్రక్రియను వారం రోజుల్లో పూర్తిచేయాలని సూచించారు. రసీదులు, నిధుల కేటాయింపువంటి అంశాలపై రికన్సిలేషన్ చేసి రిపోర్టును పంపాలన్నారు. అలాగే ఏజీ ఆడిట్‌కు సంబంధించి ఒక ప్యారా పెండింగ్‌లో ఉందని, దాన్ని సరిచేసి రిపోర్టును వారంలోపు పంపించాలని ఆదేశించారు. కాన్ఫరెన్స్‌లో మైనింగ్ సర్వేయర్ రామలింగయ్య, రాయల్టీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌లు హాజరయ్యారు.