BS Yedurappa
-
కర్ణాటక సీఎం మార్పుపై నేడు రానున్న క్లారిటీ
-
బెంగళూరు అల్లర్లు : సీఎం కీలక ప్రకటన
బెంగళూరు: సోషల్ మీడియాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనల్లుడు చేసిన పోస్ట్‌తో గతవారం బెంగళూర్‌లో జరిగిన ఘర్షణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణ చేపట్టనున్నట్టు కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సోమవారం వెల్లడించారు. హింసాకాండలో అల్లరిమూకల విధ్వంసంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు వాటిల్లిన నష్టాన్ని అంచనా వేసేందుకు క్లెయిమ్ కమిషనర్ నియామకం కోసం ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టును సంప్రదిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బెంగళూరులో గతవారం చెలరేగిన అల్లర్లలో నలుగురు మరణించిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించేందుకు ఇప్పటికే సిట్‌ను ఏర్పాటు చేశామని, కేసుల సత్వర విచారణకు ముగ్గురు ప్రత్యేక ప్రాసికూటర్లను నియమిస్తామని యడియూరప్ప పేర్కొన్నారు. జరిగిన నష్టాన్ని బాధ్యుల నుంచే రాబడతామని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే గూండా యాక్ట్‌ను సిట్ ప్రయోగిస్తుందని యడియూరప్ప ట్వీట్ చేశారు. అల్లర్లు, హింసాత్మక ఘటనలను బాధ్యులపై కఠిన చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు. హోంమంత్రి బసవరాజ్ బొమ్మైతో పాటు పలువురు సీనియర్ అధికారులతో సమావేశమైన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయాలు వెల్లడించింది. బెంగళూర్ అల్లర్లు: ఎమ్మెల్యే భావోద్వేగం -
‘యడ్యూరప్ప పీఏ నన్ను హైజాక్ చేశాడు’
బెంగళూరు : కర్ణాటక రాష్ట్రంలో జనతా దళ్ (సెక్యులర్), కాంగ్రెస్ పార్టీలకు చెందిన 14 మంది శాసనసభ్యుల రాజీనామాతో కర్ణాటక ప్రభుత్వంలో తలెత్తిన రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఈ క్రమంలో రాజీనామ చేసిన రాష్ట్ర మంత్రి, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే నగేష్‌ను యడ్యూరప్ప హైజాక్ చేశారంటూ కాంగ్రెస్ నాయకులు సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంపై మంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ.. ‘ఇంతకుముందే నగేష్ నాకు కాల్ చేశారు. యడ్యూరప్ప పీఏ తనను హైజాక్ చేశాడని చెప్పారు. వెంటనే నేను విమానాశ్రయానికి వెళ్లాను. ఆ లోపే విమానం వెళ్లి పోయింది’ అన్నారు. ఇదంతా యడ్యూరప్ప దర్శకత్వంలోనే జరుగుతుందని శివకుమార్ ఆరోపించారు. ఇదిలా ఉండగా స్వతంత్ర అభ్యర్థి అయిన నగేష్ గత నెలలోనే జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజా సంక్షోభ పరిస్థితుల్లో నగేశ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ వాజుభాయ్ వాలాను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వానికి తన మద్దతు ఉపసంహరించుకుంటున్నానని, ఒక వేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీని ఆహ్వానిస్తే ఆ పార్టీకి మద్దతిస్తానని గవర్నర్‌కు రాసిన లేఖలో నగేశ్ పేర్కొన్నారు. రాజీనామా చేసిన ఆయన ఇప్పటికే ముంబయి చేరుకుని తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిశారు. విమానాశ్రయంలో నగేష్ విమానం వద్దకు నడుచుకుంటూ వెళ్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. -
యడ్యూరప్ప.. ఇవెక్కడి ఇడ్లీలప్పా!
-
యడ్యూరప్ప.. ఇవెక్కడి ఇడ్లీలప్పా!
బెంగళూరు: కర్ణాటక బీజేపీ చీఫ్ బీఎస్ యడ్యూరప్ప తాజాగా ఇడ్లీల వల్ల చిక్కుల్లో పడ్డారు. ఇటీవల తుముకూరు జిల్లాలోని ఓ దళితుడి ఇంట్లో ఆయన బస చేసిన సందర్భంగా హోటల్ నుంచి తెప్పించుకున్న ఇడ్లీలు తిన్నారని వెలుగుచూడటం దుమారం రేపుతోంది. మాజీ సీఎం అయిన యెడ్డీ ఇంకా అంటరానితనాన్ని పాటిస్తున్నారని, ఆయనపై కేసు నమోదు చేయాలని మాండ్యా జిల్లాకు చెందిన డీ వెంకటేశ్ పోలీసులను ఆశ్రయించారు. దళితులను ఆకట్టుకునేందుకు ఇటీవల యడ్యూరప్ప, బీజేపీ సీనియర్ నాయకుడైన కేఎస్ ఈశ్వరప్ప తదితరులు దళితుల ఇంట్లో అల్పాహారం తీసుకున్నారు. అయితే, ఈ సందర్భంగా యడ్యూరప్ప తిన్న ఇడ్లీలలను సమీపంలోని ఓ రెస్టారెంట్ నుంచి తెప్పించుకున్నవని తర్వాత తేలడం వివాదం రేపింది. ఈ వివాదంలో యడ్యూరప్పను బీజేపీ నేతలు వెనకేసుకొస్తున్నారు. దళితుల అభివృద్ధి కోసం బీజేపీ ఎంతగానో పాటుపడుతున్నదని, ఈ విషయంలో తమ చిత్తశుద్ధిని శంకించవద్దని ఆ పార్టీ నేతలు అంటున్నారు. బీజేపీ కర్ణాటక మీడియా ఇన్చార్జి దగ్గే శివప్రకాశ్ మాట్లాడుతూ అవి హోటల్ నుంచి తెప్పించిన ఇడ్లీలేనని అంగీకరించారు. అయితే, యెడ్డీకి ఇడ్లీ, వడ అంటే ఇష్టమని, అందుకే వాటిని తిన్నారని, అంతేకాకుండా దళితుల ఇంట్లో వండిన పులావు కూడా ఆయన రుచి చూశారని ఆయన చెప్పారు. అయితే, దళితుల ఇంట్లో యెడ్డీ భోజనం చేయడం ఒక రాజకీయ జిమ్మిక్కని, దళితుల ఓట్ల కోసం ఇలాంటి జిమ్మిక్కులు చేయకూడదని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.