విజయా బ్యాంక్ ఈడీగా బీఎస్ రామారావు బాధ్యతలు
హైదరాబాద్: ప్రభుత్వరంగ విజయా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా బీఎస్ రామారావు బాధ్యతలు చేపట్టారు. గుంటూరు జిల్లాకి చెందిన రామారావు.. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో పీజీ చేశారు. 1978లో ఆంధ్రాబ్యాంక్ విజయవాడ బ్రాంచీ లో పీఓగా కెరియర్ ప్రారంభించారు. ఏజీఎంగా అహ్మదాబాద్, చెన్నై, హైదరాబాద్ తదితర జోనల్ కార్యాలయాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. 2011 ఏప్రిల్ నుంచి ఆంధ్రా బ్యాంక్‌లో జీఎంగా చేసిన ఆయన తాజాగా విజయా బ్యాంక్ ఈడీగా నియమితులయ్యారు.