విశ్వసనీయతకు పట్టం కట్టండి
తాళ్లూరు, న్యూస్‌లైన్:విశ్వసనీయతకు, వెన్నుపోటుకు జరగనున్న ఎన్నికల్లో ప్రజలు సరైన నాయకునికి పట్టం కావాలని వైఎస్ఆర్ సీపీ దర్శి నియోజకవర్గ సమన్వయకర్త బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి కోరారు.
మండలంలోని తూర్పుగంగవరం, మాధవరం, తాళ్లూరు గ్రామాల్లో ఆదివారం రాత్రి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు చంద్రబాబునాయుడు వెన్నుపోటు రాజకీయాలు చేసి అధికారంలోకి వచ్చారని, ప్రస్తుతం ప్రజలు ఆయన్ను నమ్మే పరిస్థితిలో లేరన్నారు.
ఎన్ని మహా కూటములు ఏర్పడినా వైఎస్ రాజశేఖరరెడ్డిని ఏమీ చేయలేకపోయాయని, ప్రస్తుతం చంద్రబాబు ఎంత మందితో పొత్తు పెట్టుకున్నా జగన్ ప్రభంజనాన్ని తట్టుకోలేరని స్పష్టం చేశారు. సమైక్యాంధ్ర కోసం చివరి వరకు పోరాడిన జగన్మోహన్రెడ్డికి ప్రజల్లో రోజు రోజుకూ ఆదరణ పెరుగుతోందన్నారు. ఓట్లు, సీట్ల కోసం రెండు కళ్ల సిద్ధాంతంతో చంద్రబాబు నాటకాలు ఆడి రాష్ట్ర విభజనకు కారకులయ్యారని ఆరోపించారు.
అనంతరం జెడ్పీటీసీ అభ్యర్థి మారం వెంకటరెడ్డి, తూర్పుగంగవరం, మాధవరం, తాళ్లూరు ఎంపీటీసీ అభ్యర్థులు నగుళ్ల ఏడుకొండలు, మహాబున్ని బేగం, గర్నెపూడ పాపులమ్మ, అవిశన తిరుపతమ్మ, ఇడమకంటి రమాదేవిలకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. తొలుత ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తూర్పుగంగవరంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బూచేపల్లి వెంకాయమ్మ, పార్టీ గ్రామాల కన్వీనర్లు తిరుపతిరెడ్డి, వీరనారాయణ, నాగిరెడ్డి, మాధవరం, తాళ్లూరు సర్పంచ్‌లు సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, మైనార్టీ నాయులు ఆదాం షరీఫ్, నాయకులు గుజ్జుల యోగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
435 కుటుంబాలు వైఎస్ఆర్ సీపీలో చేరిక
తాళ్లూరు మాజీ ఎంపీపీలు పోశం మధుసూధనరెడ్డి, కోటరామిరెడ్డిల సమక్షంలో బెల్లంకొండవారిపాలెం, నాగంబొట్లవారిపాలెం, తూర్పుగంగవరం గ్రామాలకు చెందిన 435 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బూచేపల్లి సమక్షంలో వైఎస్ఆర్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు.
వారికి బూచేపల్లి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బూచేపల్లి మాట్లాడుతూ కార్యకర్తలు ఐక్యతగా పనిచేసి జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు కష్టపడి పనిచేయాలని కోరారు.పార్టీలో చేరిన వారిలో తూర్పుగంగవరం మాజీ జెడ్పీటీసీ సభ్యుడు నాగరాజు, మాజీ సర్పంచ్ పేరుపాక కోటేశ్వరావు, కొండారెడ్డి, నాయకులు యాడిక యలమందారెడ్డి, దేవదానం, జక్రయ్య, దయానందం, బాలనాగరాజు, తిరుపతిరెడ్డి ఉన్నారు.
లింగాలపాడులో 40 కుటుంబాలు చేరిక ..
లింగాలపాడులో తెలుగుదేశం పార్టీకి చెందిన 40 కుటుంబాలు బూచేపల్లి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో పులి వెంకటరావు, గోగుల అంకయ్య, గోగుల ఓబులేసు, అండ్ర వెంకటరావు, గోగుల రాజశేఖర్, కీర్తిపాటి రామారావు, పులి చినవెంకటేశ్వర్లు, గోగుల కృష్ణ, జనమాల వెంకటేశ్వర్లు, జనమాల వీర వెంకటరావు ఉన్నారు. కార్యక్రమంలో నాయకులు కటకం శెట్టి శ్రీనివాసరావు, జక్కం రామక్రిష్ణలు పాల్గొన్నారు.