Buddhist history
-
న్యూయార్క్ బుద్ధిస్ట్ ఆర్ట్ ఎగ్జిబిషన్: ప్రత్యేకతను చాటుకున్న నీతా అంబానీ
న్యూయార్క్‌లోని మెట్ మ్యూజియంలో జూలై 17న బౌద్ధ కళల ప్రదర్శన ప్రత్యేక ప్రివ్యూకు నీతా అంబానీ హాజరయ్యారు. మెట్ మ్యూజియంలో ప్రారంభ బౌద్ధ కళా ప్రదర్శన 'ట్రీ & సర్పెంట్: ఎర్లీ బౌద్ధ కళ ఇన్ ఇండియా, 200 BCE–400 CE' ప్రత్యేక ప్రివ్యూలో ఆమె తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ ఎగ్జిబిషన్ జూలై 21- నవంబర్ 13, 2023 వరకు మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ , ది మెట్ ఫిఫ్త్ అవెన్యూలో జరగనుంది. భారతదేశానికి కళను తీసుకురావడానికి ప్రపంచంలోని వివిధ మ్యూజియంలతో భాగస్వామ్యం కావాలని చూస్తున్నాం. ఎన్ఎంఏసీసీ లాంచ్ తరువాత గత 3 నెలల్లో, ప్రతిరోజూ 5000-6000 మందిని వస్తున్నారు. కేవలం రెండు ప్రదర్శనలను ఒకటిన్నర లక్షల మంది దర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఆసక్తికరమైన భారతీయ సంస్కృతి పట్ల ఆసక్తి పెరుగుతోందన్నారు నీతా అంబానీ.ఈ కార్యక్రమానికి నీతా అంబానీతో పాటు, భారతదేశంలోని యుఎస్ రాయబారి ఎరిక్ గార్సెట్టి, యుఎస్‌లోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు ,న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్ రణధీర్ జైస్వాల్‌తో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం తర్వాత, నీతా భారతదేశాన్ని 'బుద్ధుని భూమి' అని అభివర్ణించారు. ఈ సందర్భంగా హాజరైన ప్రతి ఒక్కరూ 'బుద్ధం శరణం గచ్ఛామి' అనే పవిత్ర మంత్రాన్ని పఠించడంలో తనతో కలిసి రావాలని ఆమె అభ్యర్థించారు.200 BCE- 400 CE వరకు భారతదేశంలోని బౌద్ధ పూర్వపు మూలాలను హైలైట్ చేసే 140 వస్తువులను ఇక్కడ ప్రదర్శించనున్నారు., నాలుగు నెలల పాటు జరిగే ఈ ప్రదర్శనను ప్లాన్ చేయడానికి, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ది రాబర్ట్ హెచ్.ఎన్.హో ఫ్యామిలీ ఫౌండేషన్ గ్లోబల్, ఫ్రెడ్ ఐచానర్ ఫండ్ కలిసి పనిచేశాయి. నీతా 2016 నుండి మెట్ మ్యూజియంలో కీలకమైన భాగంగా ఉన్నారు. నవంబర్ 2019లో ఆమె గౌరవ ధర్మకర్తగా ,మెట్స్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ సభ్యురాలిగా ఎంపికయ్యారు. దీంతో మ్యూజియం ట్రస్టీల బోర్డులో చేరిన తొలి భారతీయురాలు నీతా కావడం విశేషం. #WATCH | We are looking at collaborating with various museums of the world to bring art to India. In last 3 months, after we opened NMACC, we saw footfall of 5000-6000 every day just for two exhibits we had over one and a half lakh people coming. India is at the right place and… pic.twitter.com/yga2AOeiUa — ANI (@ANI) July 19, 2023 -
15 వేల ఏళ్ల క్రితమే సిద్దిపేటకు వలసలు
ఆదిమానవుడి ఆనవాళ్లు సిద్దిపేట జిల్లాలో బయటపడుతున్నాయి. పాత రాతియుగం, కొత్త రాతియుగం, రాగి యుగం, ఆధునిక శిలాయుగం ఇలా అన్ని యుగాల మానవులు ఇక్కడ నివసించినట్లు రుజువులు కన్పిస్తున్నాయి. జైన, బౌద్ధ మతాలు, శాతవాహనులు, చాణిక్యులు, కాకతీయులు ఇలా పలు రాజవంశీయులు ఇక్కడ పాలించినట్లుగా, ఈ ప్రాంతంలో కలియతిరిగినట్లుగా చెప్పే శాసనాలు దర్శనమిస్తున్నాయి. సిద్దిపేట జిల్లాలో ఏ మూలన చూసినా పురాతన యుగం విరాజిల్లినట్లుగా వస్తువులు, శాసనాలు, వ్రిగహాలు, ఆయుధాలు, పూసలు, సమాధులు తదితరాలు దర్శనమిస్తున్నాయి. - సాక్షి, సిద్దిపేట ఆదిమానవుడి అడ్డాగా ‘పుల్లూరు’ జంతువులతో సమానమైన జీవనం సాగించిన ఆదిమానవుడు తర్వాత ఆహార అన్వేషణ, రక్షణ కోసం సమూహాలుగా ఉండేవారు. ఇందులో భాగంగానే సిద్దిపేట జిల్లాలోని పుల్లూరును వాళ్లు రాజ్యం గా ఏర్పాటు చేసుకొని జీవించినట్లు ఇటీవల ఆధారాలు లభించాయి. వారు పూజించిన శక్తి స్వరూపిణి అమ్మవారి విగ్రహం, ప్రత్యేక రాతి గుహల నడుమ నిర్మించిన సమాధులు, వినియోగించిన పలు రకాల వస్తువులు లభించాయి. ఈ వస్తువులను పరిశీలించిన చరిత్రకారులు క్రీ.పూ 5 వేల ఏళ్ల క్రితం నాటివని గుర్తించారు. సింగరాయకొండలో ‘అమ్మదేవత’ ఆదిమానవుడు స్త్రీని దేవతగా పూజించారని చరిత్రలో విన్నాం. సిద్దిపేట జిల్లా కూరెళ్ల సమీపంలో ఉన్న సింగరాయకొండలో అమ్మ దేవత విగ్రహం బయటపడింది. స్త్రీమూర్తి అందాన్ని వర్ణించి చెక్కిన ఈ విగ్రహం ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత గలదిగా చరిత్రకారులు చెబుతున్నారు. ఈ విగ్రహానికి సమీపంలో బౌద్ధ బ్రహ్మ కూడా లభించడం విశేషం. ఆయా పరిసర ప్రాంతాల్లో నీటిని నిల్వ చేసుకునేందుకు బావుల నిర్మాణం, వారు వినియోగించిన మట్టి పాత్రలు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఈ బౌద్ధ బ్రహ్మ విగ్రహం పాకిస్తాన్లో ఒకచోట లభించగా మరొకటి సిద్దిపేట జిల్లా సింగరాయకొండ సమీపంలో లభించడం గమనార్హం. విరాజిల్లిన జైన, బౌద్ధ మతం జిల్లాలోని శనిగరం, నంగునూరు, కూరెళ్ల, కోహెడ ప్రాంతాల్లో జైన మతం విరాజిల్లినట్లు ఆధారాలు లభించాయి. జైనమత తీర్థాంకరుల్లో 23వ వాడైన పార్శనాథుడి విగ్రహం ఇటీవల శనిగరం గుట్టపై లభించింది. జైనుల కాలంలో మహిళాయక్షిణి, పక్కన చంటి పిల్లవాడు పట్టుకున్న అపురూప శిల్పం లభించింది. ఈ శిల్పమే తర్వాత కాలంలో గొల్ల కేతమ్మగా పిలువబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో ఆదిమానవుడు ప్రత్యేక వరుసలో బండరాళ్లను పేర్చి నిర్మించిన సమాధులు కూడా లభించాయి. ఈ చరిత్ర అంతా జైనుల కాలం నాటిదే అని పురావస్తు శాఖ అధికారులు ధ్రువీకరించారు. కూరెళ్లలో జైనమత గుర్తులుగా భావించే చౌముఖి శిల్పం తవ్వకాల్లో బయటపడింది. దుద్దెడ గ్రామ శివాలయంలో దిగంబరుడైన జైన తీర్థాంకరుల విగ్రహాలు లభించాయి. కొమురవెల్లి గుట్టపైన జైన మత విగ్రహాలు, ఆనవాళ్లు లభించాయి. తొగుట మండలం ఆల్వాల్లోనూ జైన తీర్థాంకుల విగ్రహాలు లభించాయి. పాపన్నగుట్టపై అరుదైన అష్టభుజి తంత్ర భైరవుడు హుస్నాబాద్ మండలం పాపన్న(సర్వాయిపాపన్న) గుట్టగా పిలువబడే ప్రాంతంలో అరుదైన అష్టభుజి తంత్ర భైరవుడి విగ్రహం బయటపడింది. ఎనిమిది భుజాలతో భయంకరమైన స్వరూపిణిగా ఉన్న ఈ భైరవుడు ఆదిమానవులు, తర్వాత జైనుల పూజలు అందుకునేవారని నానుడి. వీరిని ఆరాధించిన వారి కోర్కెలు నెరవేరుతాయనే నమ్మకం. అందుకోసమే భైరవుడికి జంతుబలి, ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆయా ప్రాంతాల్లో లభిస్తున్న వస్తువుల ఆధారంగా తెలుస్తోందని పురావస్తుకారులు చెబుతున్నారు. చతురస్రాకారంలో సమాధులు ఆదిమానవుడి సమాధులు సిద్దిపేట జిల్లావ్యాప్తంగా దర్శనమిస్తున్నాయి. నర్మెటలో మెనిహీర్, శనిగరం, పుల్లూరు, కొండపాక, జగదేవ్‌పూర్, దామరకుంట, తంగెళ్లపల్లి గ్రామాల సమీ పంలో ట్రైనీడ్స్(త్రిశూలం) ఆకారంలో బండరాతిపై చెక్కిన శిల్పాలు దొరికాయి. వీటి కింది భాగంలో ఆది మానవుడి సమాధులు ఉండటం గమనార్హం. చుట్టూ బండరాతి ఫెన్సిం గ్, రంగురంగుల రాళ్లు, చతురస్రాకారంలో నిర్మాణాలు చేపట్టి మధ్యలో సమాధులు నిర్మించారు. ఈ నిర్మాణాలను ఆధారంగా చేసుకొని మృతి చెందినవ్యక్తి స్థాయిని అంచనా వేయొచ్చని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాజ్యరక్షకులు ‘వీరగల్లులు’ రాజ్యంలోని ప్రజలను ఖడ్గమృగాల బారి నుంచి రక్షించేందుకు, శత్రువుల దండయాత్రలను తిప్పికొట్టేందుకు వీరగల్లులు ఉండేవారు. శాతవాహనులు, చాణిక్యులు, కాకతీయుల కాలంలో వివిధ రూపాలతో వీరు దర్శనమిచ్చేవారు. ప్రధానంగా రుద్రదేవుడి కాలంలో ఆకునూరు, కొండపాక ప్రాంతాల్లో ఎక్కంటీలున్నట్లు (ధనుర్థారుల సైన్యం) దేవాలయాల్లో చెక్కిన శాసనాలు చెబుతున్నాయి. దూలిమిట్ట ప్రాంతంలో లభించిన వీరగల్లు ఆహార్యం కల్యాణి చాణిక్యుల కాలం నాటివిగా స్పష్టం అవుతోంది. కోహెడ ప్రాంతంలో లభించిన వీరగల్లు యుద్ధం చేస్తున్న దృశ్యాన్ని సూచిస్తోంది. ఇలా తొమ్మిది రకాలుగా ఉన్న వీరగల్లుల ప్రతిమలు ప్రతి గ్రామపొలిమేరల వద్ద ఉన్నాయి. వీటినే ఇప్పుడు హనుమంతులుగా, వీరభద్రులుగా, గ్రామరక్షకులుగా పూజిస్తున్నారు. ఆది మానవుడు నడయాడిన నేల సిద్దిపేట జిల్లాలో నలుమూలలా ఆది మానవుడు నడయాడినట్లు చరిత్ర చెబుతోంది. క్రీస్తుపూర్వం 15 వేల ఏళ్ల క్రితమే యూరప్ నుంచి ఒక తెగ ఈ ప్రాంతానికి వచ్చి జీవించినట్లు ఆధారాలు ఉన్నాయి. సమాధులు, వారు వాడిన వస్తువులు, జైన, బౌద్ధ మత ప్రచారం. వివిధ భంగిమల్లో స్త్రీల శిల్పాలు సాక్షాలుగా నిలుస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడా లభించని అరుదైన పురావస్తు సంపద సిద్దిపేట జిల్లాలో లభించడం విషేశం. –వేముగంటి మురళి, చరిత్రకారుడు -
బౌద్ధం @ బాదన్‌కుర్తి
బుద్ధుని శిష్యుల ఆవాసం ఇదే.. ∙బుద్ధుడిని కలసిన 16 మంది యువకులు ఇక్కడివారే ఆయన ఆదేశంతో ఇక్కడ్నుంచే బౌద్ధ ప్రచారానికి శ్రీకారం నిర్మల్ జిల్లా బాదన్‌కుర్తిలో వెలుగుచూసిన తొలి తరం బౌద్ధ నిర్మాణాలు సాక్షి, హైదరాబాద్: బుద్ధుడు సజీవంగా ఉండగానే బౌద్ధ ప్రచారానికి నడుం బిగించిన బృందం తెలంగాణ ప్రాంతానికి సంబంధించిందే అన్న విషయం ఎందరికి తెలుసు? ఇప్పటి వరకు చరిత్రపుటల్లోనే నిక్షిప్తమైన ఆ అంశానికి సంబంధించి తిరుగులేని ఆధారాలు వెలుగులోకి వచ్చా యి. నేరుగా బుద్ధుడిని కలిసి ఆయన ఆదేశంతో బౌద్ధ ప్రచారాన్ని ప్రారంభించిన తొలి బృందం ప్రస్తుత నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బాదన్‌కుర్తి ప్రాంతానికి చెందినదే! ఈ విషయం బౌద్ధ గ్రంథం సుత్తనిపాతంలోని పారాయణ వగ్గలో ఉంది. కానీ సాక్ష్యాలు లేకపోవడంతో ఇదంతా వట్టి ప్రచారమే అన్న వాదన కొనసాగింది. కానీ అది నిజమని చాటే ఆధారాల జాడ ఇప్పుడు దొరికింది. సుదీర్ఘ ప్రయత్నం తర్వాత బుధవారం దాని జాడ వెలుగుచూసింది. వెరసి రెండున్నర వేల ఏళ్ల నాటి అత్యం త కీలక చారిత్రక సాక్ష్యం ప్రపంచానికి చాటిచెప్పే అవకాశం తెలంగాణకు దక్కింది. తెలంగాణ వేదికగా బౌద్ధ చరిత్రకు ఇది కీలక పరిణామంగా భావిస్తున్నారు. బాదన్‌కుర్తి బౌద్ధ సంస్కృతి వ్యాప్తికి ప్రధాన కేంద్రంగా భాసిల్లిన తీరును గతంలోనే ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ మేరకు జూలైలో ప్రత్యేక కథనం కూడా ప్రచురించింది. ఆ ప్రస్తావన ఇక్కడిదే..: బౌద్ధ సాహిత్యంలో గోదావరి నదీ ప్రస్తావన.. బాదన్‌కుర్తి గ్రామానికి సంబంధించిందే అయి ఉంటుందని చరిత్రకారులు చాలాకాలం క్రితమే పేర్కొన్నారు. ‘మహాజనపథ రాజ్యం అస్మక పాలన కాలం.. గోదావరి నది రెండుగా చీలిన ప్రాంతంలోని ఆవాసానికి చెందిన బావరి ఆధ్వర్యంలో 15 మంది యువకులు బుద్ధుని కలసి ఆయన బోధనలకు ప్రభావితులయ్యారు. వారు ఆయన బోధనలను విశ్వవ్యాప్తం చేసేందుకు బయలుదేరారు’ అని సుత్తనిపాతం పారాయణవగ్గలో బుద్ధునికాలంలోనే లిఖించి ఉంది. అస్మక పాలన పరిధి తెలంగాణలోనే ఉంది. ఇక్కడ గోదావరి రెండుగా చీలిన ప్రాంతం ఇక్కడే కనిపిస్తుంది. అదే బాదన్‌కుర్తి గ్రామం ఉన్న చోటు. అది నదీ ద్వీపంగా భావిస్తారు. గోదావరి రెండుగా చీలగా మధ్యలో ఏర్పడ్డ భూభాగంలో ఉన్న ఒకేఒక్క జనావాసం ఈ గ్రామం. బావరి పేరుతోనే ఈ ప్రాంతానికి బాదన్కుర్తిగా పేరు వచ్చిందని పేర్కొన్నారు. కానీ ఆ గ్రామంలో ఇప్పటి వరకు ఎక్కడా బౌద్ధ సంస్కృతిని చాటే ఒక్క నిర్మాణం జాడ వెలుగు చూడలేదు. దీంతో ఆ వాదనలో సత్యం లేదనే వాదన మొదలైంది. కానీ ఇప్పుడు బౌద్ధ స్థూపానికి చెందినదిగా భావిస్తున్న నిర్మాణాల జాడను గుర్తించారు. ఇవి బౌద్ధానికి చెందిన తొలి నిర్మాణాలుగా భావిస్తున్నారు. ఈ ప్రాంతం నుంచే బౌద్ధమత ప్రచారం మొదలై ఇతర దేశాలకూ విస్తరించిందని అంచనా వేస్తున్నారు. బావరి బృందంతోపాటు అప్పట్లో బయలుదేరిన మరికొన్ని బృందాలే ప్రపంచానికి బౌద్ధాన్ని పరిచయం చేశాయి. వెలుగుచూసిన పురాతన ఇటుకల వరుస తెలంగాణలో బౌద్ధానికి చెందిన జాడలు చాలా వెలుగుచూశాయి. వాటి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన బుద్ధవనం ప్రాజెక్టు అధికారులే తాజాగా బావన్కుర్తిలో నిర్మాణాల జాడ కనిపెట్టారు. స్థానిక దత్తాత్రేయ దేవాలయం వెనకవైపు గోదావరి తీరం చేరువలో పురాతన ఇటుకల వరుస బయటపడింది. రెండడుగుల పొడవున్న ఆ ఇటుకలను వెలికితీసి పరిశీలింగా అవి బౌద్ధ స్థూప నిర్మాణాల్లో వాడేవని రూఢి అయింది. దీంతో అక్కడే బౌద్ధ స్తూపంతోపాటు ఇతర నిర్మాణాలు ఉండిఉంటాయని భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపి విలువైన ఆ నిర్మాణాలను వెలుగులోకి తేవాలని కేంద్రానికి లేఖ రాయాలని బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య నిర్ణయించారు. బౌద్ధ చరిత్రలో ఇది కీలక పరిణామం బావన్కుర్తి ప్రస్తావన బౌద్ధ సాహిత్యంలో ఉన్నా.. దాన్ని రూఢి చేసే ఆధా రాలు లేకపోవటం ఇంతకాలం వెలితి. ఇప్పుడు వాటి జాడ దొరకటం బౌద్ధ చరిత్రలో కీలక పరిణామం. బుద్ధుడిని స్వయంగా కలిసి ఆయన బోధన లను విశ్వవ్యాప్తం చేసేందుకు బయలుదేరిన బృందం తెలంగాణకు చెం దినది కావటం విశేషం. త్వరలో చేపట్టబోయే బుద్ధిస్ట్ సర్క్యూట్ ప్రాజెక్టుకు ఇది కీలకం కానుంది. ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపి భూగర్భంలో నిక్షిప్తమైన బుద్ధుడి కాలంనాటి అపురూప కట్టడాలను ప్రపంచం ముందు నిలపాల్సి ఉంది. – మల్లేపల్లి లక్ష్మయ్య, బుద్ధవనం ప్రత్యేకాధికారి