burglray
-
చంద్రగిరిలో దోపిడీ దొంగల బీభత్సం
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. జిల్లాలోని చంద్రగిరి పట్టణంలోని విజయనగర్ కాలనీలో సోమవారం తెల్లవారుజామున దొంగలు ఇద్దరు వ్యక్తులపై దాడి చేశారు. వారి నుంచి ఐదు సవర్ల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. ఈ ఘటనలో సునీల్, మునిరాజ్ అనే ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను చికిత్స కోసం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. (చంద్రగిరి) -
నల్లగొండలో దోపిడీ దొంగల బీభత్సం
నల్లగొండ : నల్లగొండ జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. జిల్లాలోని నడిగూడెం మండలం వేణుగోపాల పురం గ్రామంలో ఓ ఇంట్లో చొరబడిన ఆగంతకులు దంపతులను కొట్టి నగదు దోచుకెళ్లారు. వివరాలు... గ్రామానికి చెందిన పత్తి వ్యాపారి డి. లక్ష్మయ్య, ఆయన భార్య సుజాత బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా ఐదుగురు దుండగులు ముసుగులు ధరించి లోపలికి ప్రవేశించారు. డబ్బు, నగలు ఎక్కడున్నాయో చెప్పాలని దంపతులను బాగా కొట్టారు. వారి వద్ద ఉన్న రూ.32 వేల నగదును ఎత్తుకుపోయారు. బాధితులు గురువారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీం సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తోంది. (నడిగూడెం) -
తిరుచానూరులో దొంగల బీభత్సం
చిత్తూరు : చిత్తూరు జిల్లాలో గురువారం అర్దరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. జిల్లాలోని తిరుచానూర్‌లో తొమ్మిదిళ్లల్లో దొంగలు పడి దొరికినంత దోచుకెళ్లారు. పోలీసుల కథనం ప్రకారం..స్థానికంగా నివాసం ఉండే ఎన్ వీ సుబ్బారావు ఇంట్లోకి దొంగలు ప్రవేశించి బీరువాలో ఉన్న రూ.10 వేల నగదు, 12 తులాల బంగారాన్ని తీసుకెళ్లారు. అదే కాలనీలో ఉన్న ఎనిమిదిఇళ్లలో చోరిలకు పాల్పడి మరో 50 వేల నగదు తో పాటు, 5 తులాల బంగారం అపహరించుకుపోయారు. బాధితులు శుక్రవారం ఉదయం పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. (తిరుచానూరు) -
హైదరాబాద్ లో దొంగల బీభత్సం
హైదరాబాద్ : నగరంలోని రాజేంద్రనగర్‌లో సోమవారం తెల్లవారు జామున అంతరాష్ట్ర దొంగలు హల్చల్ చేశారు. హిమగిరినగర్లోని రెండు ఇళ్లలోకి ప్రవేశించిన దొంగలు దొరికినకాడికి దోచుకెళ్లారు. పోలీసుల కథనం ప్రకారం పీరం చెరువు గ్రామపరిధిలోని శ్రీనిలయ విల్లాస్‌లో ఐదుగురు దోపిడిదొంగలు ఈ చోరీకి పాల్పడ్డారు. ఇనుపరాడ్లతో తాళం దర్వాజాను పగులగొట్టి ముందుగా రామక్రిష్ణ ఇంటిలోకి ప్రవేశించారు. దేవుని ఇంట్లో ఉన్న వెండి పూజా సమాగ్రిని తీసుకున్నారు. విల్లాలోనే వాచ్‌మెన్‌ని బంధించి తాళం వేశారు. అక్కడినుంచి నింధితులు జాషువా ఇంట్లోకి ప్రవేశించి అతన్ని బంధించి విలువైన నగదు, నగలు కావాలంటూ దాడిచేశారు. అనంతరం జాషువా దగ్గర నుంచి కారు తాళాలు తీసుకొని అందులోనే ఉడాయించారు. నిందితులంతా 30 సంవత్సరాలలోపు ఉన్నారని, కేవలం హింధీబాషలోనే మాట్లాడారని బాధితుడు జాషువా పోలీసులకు తెలిపారు.