నల్లగొండ : నల్లగొండ జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. జిల్లాలోని నడిగూడెం మండలం వేణుగోపాల పురం గ్రామంలో ఓ ఇంట్లో చొరబడిన ఆగంతకులు దంపతులను కొట్టి నగదు దోచుకెళ్లారు. వివరాలు... గ్రామానికి చెందిన పత్తి వ్యాపారి డి. లక్ష్మయ్య, ఆయన భార్య సుజాత బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా ఐదుగురు దుండగులు ముసుగులు ధరించి లోపలికి ప్రవేశించారు. డబ్బు, నగలు ఎక్కడున్నాయో చెప్పాలని దంపతులను బాగా కొట్టారు. వారి వద్ద ఉన్న రూ.32 వేల నగదును ఎత్తుకుపోయారు. బాధితులు గురువారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీం సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తోంది.
(నడిగూడెం)