Burja
-
అర్హులందరికీ పింఛన్ అందిస్తామన్న తమ్మినేని సీతారాం
-
ఆ కల నెరవేరే రోజు వచ్చింది: తమ్మినేని
సాక్షి, బుర్జ(శ్రీకాకుళం): మండలంలోని పలు గ్రామాలు పర్యంచిన ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పలు అభివృద్ధి పనులకు శంకస్థాపన చేశారు. గుత్తావళ్లి గ్రామంలో సుమారు 60 లక్షల నిధులతో పిహెచ్సీ కాంపౌండ్ గోడకు శంకుస్థాపన చేసి అనంతరం నాడు-నేడు, గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం పనులను శనివారం పరిశీలించారు. కళపర్తి గ్రామంలో 7.50 లక్షల నిధులతో ఇటీవల నిర్మించిన అంగన్వాడి భవనం కూడా ప్రారంభించారు. తరువాత సుమారు 17.50 లక్షల నిధులతో వైఎస్ఆర్ ఆరోగ్య కేందద్రానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన గుత్తావళి సభలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమం, అభివృద్ధిని ఈరోజు పరుగులు పెట్టిస్తున్నారన్నారు. ఈ గ్రామంలో 2 కోట్ల 50 లక్షల రూపాయల నిధులు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా 4.77 లక్షలు రూపాయలు సంక్షేమ పథకాల కింద ఈ ఊరుకి కేటాయించామని, జల జీవన మిషన్ ద్వారా ఇంటింటికి కొళాయిల ద్వారా నీరు అందించేందుకు 67 లక్షల రూపాయల నిధులు ఖర్చుచేయనున్నట్టు తెలిపారు. సీఎం వైఎస్ జగన్ అవినీతి లేని పాలన ప్రజలకు అందిస్తున్నారని, వ్యవస్థలలో పారదర్శకతను తీసుకువచ్చారన్నారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి యువత ఉద్యోగం కోసం కలలు కంటూనే ఉన్నారని, ఇప్పుడు ఆ కల నెరవేరే రోజు వచ్చిందన్నారు. అధికారం ఇవ్వండి ఉద్యోగ సునామీ సృష్టిస్తానని పాదయాత్రలో సీఎం వైఎస్ జగన్ అన్నారని, ఇవాళ ఉద్యోగ విప్లవం సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. నాయకుడికి ప్రజల్ని ఆదుకోవాలనే సంకల్పం ఉండాలని, అత్యంత శక్తివంతమైన వ్యవస్థ పౌర వ్యవస్థని వాళ్ళ శక్తికి ప్రభుత్వాలే కులాయని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం పోరాడే వాడే నిజమైన నాయకుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఖండాపు గోవిందరావు, గుమ్మడి రాంబాబు, బెజ్జివరపు రామారావు, సింగపూరపు కోటేశ్వరరావు, బొడ్డేపల్లి నాగరాజు, బోడ్డేపల్లి నారాయణమూర్తి తదితర వైఎస్సార్ సీసీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు. -
ఆ గ్రామం ఏమైంది..?
సాక్షి, శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం వైకుంఠపురం సమీపంలో ఉన్న కొండప్రాంతంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన 10గిరిజన కుటుంబాలను వైకుంఠపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం జన్మభూమి కమిటీ సభ్యుడు సంపతిరావు చినబాబు తన స్వార్థ రాజకీయాల కోసం, వారి వ్యవసాయ పనుల కోసం ఉపయోగ పడతారని ఇక్కడికి తీసుకువచ్చారు. వారంతా 2015వ సంవత్సరంలో కొరగాం పంచాయతీ పరిధిలో ఉన్న కొండల్లో పూరిపాకలు నిర్మించుకుని నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వారు వచ్చిన అర్ధసంవత్సర కాలంలోనే వారి కోసం అధికారులు లక్షల రూపాయలు వెచ్చించి ఒక మంచినీటి బావి, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా అందజేశారు. వారిలో 29మందికి ఓటు హక్కు కల్పించి రేషన్ కార్డులు మంజూరు చేశారు. వారి పిల్లలను వైకుంఠపురం పాఠశాలలో చేర్పించారు. ఆ గిరిజనులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. అయితే వారంతా ఆ గ్రామంలో రెండు సంవత్సరాలు ఉన్నారు. వారికి ఏం కష్టమొచ్చిందో ఏమో? గానీ గత ఏడాది మే నెలలో రాత్రికి రాత్రే బస ఎత్తేశారు. దీంతో లక్షల రూపాయలు ప్రజాథనం వృథా అయింది. గ్రామానికి గ్రామం లేక పోయినా అధికారులు మాత్రం అక్కడి వారి ఓట్లను తొలగించలేదు. గ్రామాల్లో నివాసం ఉన్నవారి ఓట్లు మాత్రం ఇష్టానుసారం తొలగిస్తున్నారు. ఆనందపురంలో ప్రజలు లేకపోయినా ఇప్పటికీ విద్యుత్ సరఫరా అవుతోందంటే ఆ గ్రామస్తుల కోసం కాదని, రాజకీయ నాయకుడి కోసమేనని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ గిరిజన ఓటర్లంతా ఒడిశా రాష్ట్రంలోని వారి సొంత ప్రాంతానికి చేరుకుని ఉంటారని పలువురు అభిప్రాయ పడుతున్నారు. -
మత్తుమందు చల్లి దోపిడీ
బూర్జ (శ్రీకాకుళం) : ఇంట్లో నిద్రిస్తున్న మహిళపై గుర్తుతెలియని మహిళలు మత్తు మందు ప్రయోగించి దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం కె.కె.రాజపురం గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పి.సింహాచలం కుటుంబసభ్యులు కొందరు గ్రామంలో జరిగే పెళ్లికి వెళ్లగా మరికొందరు ఆరుబయట నిద్రించారు. కోడలు ఒక్కర్తే ఇంట్లో నిద్రిస్తోంది. ఇదే అదనుగా గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి ఆమె ముఖంపై మత్తు చల్లిన వస్త్రాన్ని వేశారు. ఆమె స్పృహ కోల్పోవటంతో దుండగులు ఇంట్లో ఉన్న రూ.1.56 లక్షలతోపాటు ఐదు తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు సోమవారం ఉదయం సీఐ నవీన్, ఎస్సై రవికిశోర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీంలతో వివరాలు సేకరించారు.