బూర్జ (శ్రీకాకుళం) : ఇంట్లో నిద్రిస్తున్న మహిళపై గుర్తుతెలియని మహిళలు మత్తు మందు ప్రయోగించి దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం కె.కె.రాజపురం గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పి.సింహాచలం కుటుంబసభ్యులు కొందరు గ్రామంలో జరిగే పెళ్లికి వెళ్లగా మరికొందరు ఆరుబయట నిద్రించారు. కోడలు ఒక్కర్తే ఇంట్లో నిద్రిస్తోంది.
ఇదే అదనుగా గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి ఆమె ముఖంపై మత్తు చల్లిన వస్త్రాన్ని వేశారు. ఆమె స్పృహ కోల్పోవటంతో దుండగులు ఇంట్లో ఉన్న రూ.1.56 లక్షలతోపాటు ఐదు తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు సోమవారం ఉదయం సీఐ నవీన్, ఎస్సై రవికిశోర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీంలతో వివరాలు సేకరించారు.
మత్తుమందు చల్లి దోపిడీ
Published Mon, Apr 25 2016 3:06 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
Advertisement
Advertisement