burning of dead body
-
బెడ్రూమ్లో అనుమానాస్పద స్థితిలో యువతి మృతి.. ఏం జరిగింది?
తణుకు (పశ్చిమ గోదావరి) : తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో ఓ యువతి సజీవ దహనం ఘటన ఈ ప్రాంతంలో సంచలనం రేకెత్తించింది. ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న గ్రామానికి చెందిన ముళ్లపూడి నాగహారిక (19) ఇంట్లో బెడ్రూమ్లో మంచంపైనే సజీవ దహనం అయ్యింది. అయితే, ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా లేక ఎవరైనా హత్య చేసి కాల్చివేశారా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ముళ్లపూడి శ్రీనివాస్, రూపరాణి దంపతుల కుమార్తె నాగహారిక శుక్రవారం రాత్రి తన గదిలో నిద్రించింది. తెల్లారేసరికి నాగహారిక మంచంపై కాలి బూడిదై కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగహారికకు రూపరాణి సవతి తల్లికాగా ఆమెకు తొమ్మిదేళ్ల మంజలిప్రియ అనే కుమార్తె ఉంది. ఇటీవల నూతనంగా ఇల్లు నిర్మించుకున్న వీరు మూడు నెలల క్రితం గృహప్రవేశం చేశారు. అయితే పూర్తిస్థాయిలో ఇంటి సామగ్రి తెచ్చుకోకపోవడంతో యజమాని ముళ్లపూడి శ్రీనివాస్ పాత ఇంటివద్దనేనిద్రిస్తున్నారు. శనివారం ఉదయం కొత్త ఇంటికి వచ్చి భార్యను నిద్రలేపే సమయంలో కుమార్తె నిద్రిస్తున్న గది నుంచి పొగలు రావడం గమనించారు. అప్పటికే నాగహారిక మంటల్లో కాలిపోయింది. తండ్రి ముళ్లపూడి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ సీఐ సీహెచ్ ఆంజనేయులు, ఎస్సై రాజ్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్సిక్ సిబ్బంది, డాగ్‌స్కా్వడ్ ఘటనా స్థలంలో పలు ఆధారాలను సేకరించారు. ఈ కేసులో పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు నాగహారిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. -
ఎక్కడో చంపి.. ఇక్కడ తగులబెట్టి..
- గుర్తుతెలియని యువకుని దారుణ హత్య - గొడ్డలితో నరికి చంపిన హంతకులు - పెట్రోల్‌తో మృతదేహం దహనం - ఉలిక్కిపడిన ఈపూరుపాలెం చీరాల : ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఈపూరుపాలెం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా హత్య జరగడంతో గ్రామస్తులు నిర్ఘాంతపోయారు. పట్టణ ప్రాంతాల్లోని హత్యల సంస్కృతి రూరల్ గ్రామాలకు పాకడంతో గ్రామీణులు భయాందోళన చెందుతున్నారు. నిత్యం వందలాది మంది రాకపోకలు సాగించే రోడ్డుపై మృతదేహాన్ని తగలబెట్టడం స్థానికులను కలవరపరిచింది. ఈ సంఘటన మండలంలోని ఈపూరుపాలెం స్ట్రయిట్‌కట్ నుంచి తోటవారిపాలెం బండారు నాగేశ్వరరావు కాలనీకి వెళ్లేదారిలో ఉన్న కాలువకట్టపై ఆదివారం జరిగింది. మృతదేహం గుర్తు పట్టలేని విధంగా ఉండటంతో కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. చీరాల రూరల్ సీఐ ఎండీ ఫిరోజ్ కథనం ప్రకారం.. గుర్తుతెలియని యువకుడిని దారుణంగా హత్య చేసి పెట్రోల్ పోసి ఆదివారం తెల్లవారు జామున తగులబెట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈపూరుపాలెంలో ఇటువంటి సంఘటనలు జరగలేదు. సమాచారం తెలుసుకున్న చీరాల డీఎస్పీ డి.నరహర సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఒంగోలు నుంచి పోలీసు జాగిలాన్ని పిలిపించి క్షుణ్ణంగా తనిఖీలు చేయించగా పోలీసు జాగిలం బైపాస్ రోడ్డు వరకు వెళ్లి వెనుదిరిగింది. మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టుకుని వచ్చి తగలబెట్టారని తమ పరిశీలనలో తేలినట్లు డీఎస్పీ తెలిపారు. యువకుడు దారుణ హత్యకు గురవ్వడంతో పాటు పెట్రోల్ పోసి తగులబెట్టారని సమాచారం దావానలంలా వ్యాపించడంతో ప్రజలు తండోపతండాలుగా సంఘటన స్థలానికి చేరుకున్నారు. 90 శాతం వరకు కాలిన మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఫిరోజ్ తెలిపారు. సంఘనా స్థలాన్ని ఈపూరుపాలెం వీఆర్వోలు విద్యుల్లత, రాము, కరీముల్లా పరిశీలించి పంచనామా నిర్వహించారు.