కండక్టర్ ఇంట్లో చోరీ
రంగారెడ్డి : ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు పడి ఉన్నదంతా ఊడ్చుకెళ్లిన ఘటన రంగారెడ్డి జిల్లా కీసర మండలంలోని సిద్ధార్థ పాఠశాల సమీపంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కుషాయిగూడ ఆర్టీసీ డిపో పరిధిలో కండక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాస్.. సమీప బంధువులు మృతి చెందడంతో అక్కడికి వెళ్లారు.
తిరిగి గురువారం ఉదయం ఇంటికి వచ్చేసరికి తలుపులు పగలగొట్టి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించాడు. లోపలికి వెళ్లి చూసేసరికి ఇంట్లో దాచి ఉంచిన లక్ష రూపాయల నగదుతో పాటు కొద్ది మొత్తంలో బంగారు ఆభరణాలు కనిపించకుండా పోయాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.