bus shortage
-
బస్సుల కోసం విద్యార్థుల ఆందోళన
యలమంచిలి: పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం దొడ్డిపట్లలో మంగళవారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆర్టీసీ యాజమాన్యం తమ గ్రామానికి రోజూ నడపుతున్న బస్సుల సంఖ్యను తగ్గించడంతో రోడ్డుపై ధర్నా చేశారు. వాహన రాకపోకలను అడ్డుకున్నారు. స్కూలు కు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున బస్సుల సంఖ్య పెంచాల్సిందిగా డిమాండ్ చేశారు. విద్యార్థుల ధర్నాతో కాసేపు రాకపోకలకు అంతరాయమేర్పడింది. -
MGBSలో ప్రయాణికుల ఆందోళన