రాందేవ్బాబాకు క్యాబినెట్ మంత్రి హోదా
వివాదాస్పద యోగా గురు రాందేవ్ బాబాకు హర్యానా ప్రభుత్వం క్యాబినెట్ మంత్రి హోదాను కల్పించింది. ఇప్పటికే హర్యానా బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగున్న ఆయనకు మంత్రి హోదా కల్పిస్తున్న విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ సోమవారం ట్విట్టర్ ద్వారా తెలిపారు.
రాందేవ్ పర్యవేక్షణలో యోగా, ఆయుర్వేద విద్యను అభివృద్ధి చేయనున్నట్లు, ఈ మేరకు పాఠ్యాంశాల్లో యోగా పాఠాలను చేర్చడంతోపాటు స్కూళ్లు, గ్రామాల్లో యోగశాలలు నిర్మించనున్నట్లు విజ్ పేర్కొన్నారు. మరోవైపు మత సంస్థలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగిన వ్యక్తులకు ప్రభుత్వ పదవులు కట్టబెట్టడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.