cable connections
-
బుల్లితెర వినోదం ఇక భారమే..!
సత్తెనపల్లి: కేబుల్ కనెక్షన్ పేదలకు ఇక భారం కానుం ది. ఇప్పటివరకు కేబుల్ కనెక్షన్ ఉంటే నెల పూర్తయిన తరువాత ఆయా ప్రాంతాలను బట్టి రూ.150 నుంచి రూ.200 వరకు వసూలు చేస్తున్నారు. కేబుల్ కనెక్షన్ ద్వారా 200 నుంచి 250 చానళ్లు ప్రసారం అయ్యేవి. ఇందులో 80 వరకు పే చానళ్లు ఉండేవి. వీటిలో వార్తా చానళ్లు, స్పోర్ట్స్ చానళ్ళు, వినోద చానళ్ళు, హిందీ, ఇంగ్లిషు, ఒరియా, తమిళం, మళయాళం తదితర భాషల చానళ్లు ఉండేవి. ప్రస్తుతం నూతన నిబంధనల ప్రకారం 150 ఎయిర్ ఫ్రీ చానళ్లు (జనరల్)కు రూ.130తో పాటు అదనంగా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. వినియోగదారులు కావాలనుకునే పే చానళ్లను ఎంపిక చేసుకుని వాటి రుసుం చెల్లిస్తే వారు కోరుకున్న చానళ్ల ప్యాకేజీలు మాత్రమే ప్రసారం అవుతాయి. ప్రస్తుతం కేబుల్ కనెక్షన్ ద్వారా ప్రసారం అవుతున్న చానళ్లన్నీ ఫిబ్రవరి ఒకటి నుంచి చూడాలంటే రూ.300 నుంచి రూ.400 వరకు చెల్లించాల్సి వస్తుంది. గతంలో ఇంత పెద్ద మొత్తం డీటీహెచ్‌ల ద్వారా వినియోగదారులు చెల్లించేవారు. తాజాగా దేశవ్యాప్తంగా డీటీహెచ్, కేబుల్ వినియోగదారులందరూ తాము చూస్తున్న చానళ్లకు చెల్లింపులు జరిపే సౌలభ్యాన్ని కల్పించినా, దీని వల్ల వినియోగదారులపై భారం పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. రూ.250 నుంచి రూ.300 వరకు... ఉదాహరణకు కేబుల్ కనెక్షన్ ఉన్న వినియోగదారుడు ఎయిర్ ఫ్రీ చానళ్ల కోసం రూ.130, దీనికి అదనంగా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. వీటికి అదనంగా జీటీవీ, మాటీవీ, జెమిని, ఈటీవీ వంటి చానళ్లు చూడాలనుకుంటే ఆయా ప్యాకేజీలకు ఆయా యాజమాన్యాలు నిర్దేశించిన మొత్తాన్ని జోడించి దానికి జీఎస్టీని కలిపి ఆపరేటర్‌కు చెల్లించాల్సి ఉంటుంది. ఈలెక్కన కేవలం తెలుగు చానళ్లనే ఎంపిక చేసుకుంటే నెలకు రూ.250 నుంచి రూ.280 వరకు చెల్లించాల్సి ఉంటుంది. స్పోర్ట్స్, ఇతర చానళ్లు కావాలంటే మరికొంత డబ్బు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. గతంలో కాకుండా ఇతర చానళ్లు కావాలంటే మరికొంత అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ట్రాయ్ నిర్ణయంపై సుప్రీం కోర్టులో కేసు వేసినప్పటికీ సుప్రీం కోర్టు తీర్పు ట్రాయ్ నిర్ణయానికి అనుగుణంగానే ఉంటుందని భావిస్తున్నారు. దీంతో ఫిబ్రవరి ఒకటి నుంచి కచ్చితంగా కొత్త రేట్లు, కొత్త విధానం అమలులోకి వచ్చే పరిస్థితి ఉంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కేబుల్ ఆపరేటర్ల సంఘం, దేశంలోని కొన్ని కేబుల్ ఆపరేటర్ల సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి కొత్త విధానం అమలులోకి తీసుకొచ్చేందుకు ఆరు నెలలు గడువు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం దీనికి అంగీకరిస్తే ఫిబ్రవరి ఒకటి నుంచి కొత్త రేట్లు అమలులోకి వచ్చి వినియోగదారులకు భారం అయ్యే పరిస్థితి ఉంటుంది. -
కేబుల్ కనెక్షన్లపై వినోద పన్ను
హైదరాబాద్‌లో కనెక్షన్‌పై రూ.5 వసూలుకు నిర్ణయం కేబుల్ ఆపరేటర్లకు వాణిజ్య పన్నుల శాఖ ఆదేశాలు వినియోగదారులపై భారం మోపేందుకు సిద్ధమైన ఆపరేటర్లు ఈ నెల నుంచే అమల్లోకి.. గ్రేటర్‌పై నెలసరి పన్ను భారం రూ. 1.20 కోట్ల పైనే సాక్షి, హైదరాబాద్: వినోద సాధనమైన కేబుల్ టీవీ మరింత భారం కానుంది. వాణిజ్య పన్నుల శాఖ వినోదం పేరుతో ‘పన్ను’ పీకేందుకు సిద్ధమవుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో పన్నుల ద్వారా ఆదాయం సమకూరే అన్ని మార్గాలపై దృష్టిసారించిన ఈ శాఖ.. తాజాగా కేబుల్ టీవీ కనెక్షన్లపై కన్నేసింది. తొలుత నగరంలోని వినియోగదారుల నుంచి వినోద పన్ను వసూలు చేసేందుకు సిద్ధమైంది. మహా నగర పరిధిలో కేబుల్ టీవీ ప్రసారాల ద్వారా వినోద పన్ను వసూలుకాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. వాస్తవంగా జీహెచ్ఎంసీ కేబుల్ టీవీ కనెక్షన్ల చార్జీలపై 20 శాతం వినోద పన్ను వసూలు చేసి అందులో రెండు శాతాన్ని వాణిజ్య పన్నుల శాఖకు అప్పగించాల్సి ఉంది. ఆయితే జీహెచ్ఎంఎసీ అధికారులు కేబుల్ కనెక్షన్ల రాబడిపై పెద్దగా దృష్టి సారించకపోవడంతో వినోద పన్ను వసూళ్లు లేకుండాపోయాయి. తాజాగా వాణిజ్య పన్నుల శాఖ రాబడి పెంచుకునే పనిలో భాగంగా ఒక అడుగు ముందుకేసి కేబుల్ కనెక్షన్లపై నేరుగా వినోద పన్నులోని తన వాటాను వసూలు చేసేందుకు తయారైంది. అక్టోబర్ నుంచి కేబుల్ ఆపరేటర్లు కనెక్షన్‌పై నెలకు రూ.5 వినోద పన్ను చెల్లించాలని ఏకంగా ఆదేశాలు జారీ చేసింది. 24 లక్షల కనెక్షన్లు గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 24 లక్షల కేబుల్ టీవీ కనెక్షన్లు, మరో 4 లక్షల వరకు డీటీహెచ్ కనెక్షన్లు ఉన్నాయి. నగరంలో ఎమ్‌ఎస్‌ఓగా ఉన్న సిటీ కేబుల్, హాత్వే, డిజీ కేబుల్, ఆర్వీఆర్, భాగ్యనగర్, ఇన్ డిజిటల్ సంస్థలు కేబుల్ ప్రసారాలు అందిస్తున్నాయి. ఎమ్ఎస్ఓల కంట్రోల్ రూమ్ నుంచి ట్రంక్ లైన్ ద్వారా ప్రసారాలు స్థానిక కేబుల్ ఆపరేటర్లకు అందుతాయి. కేబుల్ ఆపరేటర్లు స్థానిక కేంద్రాల ద్వారా వినియోగదారులకు ప్రసారాలు అందిస్తున్నారు. నగరంలో రెండు వేల మంది పైగా కేబుల్ ఆపరేటర్లు ఉన్నారు. వినియోగదారులకు కేబుల్ ద్వారా ప్రసారాలు అందిస్తున్నందుకు నెలకు రూ.150-200 వరకు చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు వినోద పన్ను భారాన్ని వినియోగదారులపైనే మోపేందుకు కేబుల్ ఆపరేటర్లు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం వసూలు చేస్తున్న నెలసరి చార్జీలతో పాటు అదనంగా రూ.5 వసూలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ లెక్కన గ్రేటర్‌లోని వినియోగదారులపై నెలకు సుమారు రూ.1.20 కోట్ల అదనపు భారం పడనుంది. వినియోగదారులు వినోద పన్నును తమ ఆపరేటర్ ద్వారా వాణిజ్య పన్నుల శాఖకు చెల్లించాలని కొన్ని ఎంఎస్ఓలు స్క్రోలింగ్ ఇవ్వడం గమనార్హం.