కాశ్మీరులో గులాబీ తోట!
నితిన్ నాష్, ఫర్నాజ్ శెట్టి జంటగా జి.రవికుమార్ (బాంబే రవి) దర్శకత్వంలో చదలవాడ తిరుపతిరావు సమర్పణలో చదలవాడ శ్రీనివాసరావు నిర్మిస్తున్న చిత్రం ‘రోజ్‌గార్డెన్’. ప్రస్తుతం కాశ్మీర్లో చిత్రీకరణ జరుగుతోంది. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న తరుణంలో కాశ్మీర్లో చిత్రీకరణ చేయడం సాహసమే.
కాశ్మీర్ ప్రభుత్వ సహకారంతో భారీ భద్రత మధ్య ఏ టెన్షన్ లేకుండా షూటింగ్ చేస్తున్నాం’’ అన్నారు. చదలవాడ తిరుపతిరావు మాట్లాడుతూ - ‘‘ఓ ప్రేమ జంట తీవ్రవాదుల కారణంగా ఎటువంటి సమస్యలు ఎదుర్కొందనే అంశంతో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఎనభై శాతం చిత్రాన్ని కాశ్మీర్‌లోనే చిత్రీకరిస్తాం. ఢిల్లీ, హైదరాబాద్‌లలో మిగతా చిత్రీకరణ పూర్తి చేస్తాం. సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు.