camphor
-
ఆరోగ్యానికి హారతి కర్పూరం
కర్పూరం అనేది మనకి తెలిసినంతవరకు దేవునికి హారతి ఇవ్వడానికి ఉపయోగిస్తారనీ, లడ్టూల వంటి తీపి పదార్థాలకు కాసింత పచ్చకర్పూరాన్ని జత చేస్తే అద్భుతమైన రుచి వస్తుందనీ... అదేవిధంగా వేంకటేశ్వర స్వామి నామాన్ని తీర్చిదిద్దడానికి వాడతారనీనూ. అయితే, కర్పూరం రసాయనాలతో కృత్రిమంగా తయారయిందనుకుంటారు చాలామంది. కానీ, కాంఫర్ లారెల్ అనే చెట్టు ఆకులు, కొమ్మలనుండి కర్పూరాన్ని తయారు చేస్తారు. అలాగే కొన్నిరకాలైన తులసి (కర్పూర తులసి) జాతులనుండి కూడా తయారు చేస్తారు. ∙కర్పూరంలో హారతి కర్పూరం, ముద్ద కర్పూరం, పచ్చకర్పూరం, రసకర్పూరం, భీమసేని కర్పూరం, సితాభ్ర కర్పూరం, హిమకర్పూరం తదితర రకాలున్నాయి. దీని వలన అసంఖ్యాకమైన ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. అసలు కర్పూరం వాసన పీలిస్తే చాలు శారీరక రుగ్మతలన్నీ పోయినట్లు, సేద తీరినట్లు ఉంటుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. స్వల్ప గుండె సమస్యలు, అలసట వంటి వాటికి కొద్ది మొత్తం కర్పూరం వాడితే ఫలితముంటుంది. అన్ని రకాల ఆర్థరైటిస్, రుమాటిక్ నొప్పుల నివారిణిగా, నరాల సమస్యలు, వీపునొప్పికి బాగా పనిచేస్తుంది. పుండ్లు మానడానికి, పిల్లలకు గజ్జి, బొబ్బలు తగ్గడానికి, బ్రాంకయిటిస్, పలు రకాల ఇన్ఫెక్షన్లకు ఉపయోగిస్తారు. ∙శ్వాస సంబంధ సమస్యల నివారణకు వాడే మందుల తయారీలో కూడా దీనిని ఉపయోగిస్తారు. ∙కాలుష్యాన్ని పోగొట్టి, వాతావరణాన్ని స్వచ్ఛంగా మారుస్తుంది. అంటువ్యాధులు ప్రబలకుండా చేస్తుంది. ∙కళ్ళకు మేలు చేస్తుంది కనుకనే కాటుకలో కర్పూరాన్ని వాడతారు. ∙జలుబును, కఫాన్ని తగ్గిస్తుంది. మానసిక జబ్బులను సైతం పోగొడుతుంది. -
హారతి కళ్లకు అద్దుకోవటం
• సన్నిధి అంతరార్థం ఇంటిలో, ఆలయాల్లో, పూజామందిరాలలో, నోములు, వ్రతాల వంటి శుభకార్యాలలో హారతి ఇవ్వడం సర్వసాధారణం. ఈ హారతిని దర్శించుకుని, కన్నులకు అద్దుకోవడం అంతే సాధారణం. జ్యోతిస్వరూపం. పరమాత్ముడు స్వయంప్రకాశక స్వరూపుడు. వెలుగు అనేది అంధకారాన్ని తొలగించి వస్తువును దృష్టికి కనిపించేలా చేస్తుంది. చీకటిలో వస్తువులను చూడలేం. అజ్ఞానం అనే అంధకారం ఉన్నప్పుడు ఆ పరమాత్మ స్వరూపాన్ని చూడలేం. కాబట్టి కళ్లకు హారతి అద్దుకుంటూ అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానప్రకాశాన్ని కలిగించమని భగవంతుడిని ప్రార్థించాలి. సూర్యుడిలోని జ్యోతి, పరమాత్మ యొక్క ప్రకాశం, మన నేత్రాలలోని జ్యోతి ఒక్కటే. దానికి గుర్తుగానే హారతి ఇచ్చినప్పుడు కన్నులకు అద్దుకుంటాం. మరోరకంగా చూస్తే, కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం వల్ల సూక్ష్మక్రిములు నశిస్తాయి. శ్వాసకోశవ్యాధులు, అంటువ్యాధులు దరిచేరవు. కర్పూర హారతి ఎలా కరిగిపోతుందో, అలాగే మనం తెలిసీ తెలియక చేసిన తప్పులు సమసిపోవాలని వేడుకుంటూ హారతిని కళ్లకద్దుకోవడం అసలు సిసలైన ఆధ్యాత్మిక అంతరార్థం. -
బాలల చేతుల్లో కర్పూరం వెలిగించింది...
లక్కిరెడ్డిపల్లె(వైఎస్సార్): దొంగతనం నేరం మోపి.. నిజ నిర్ధారణ కోసమంటూ చిన్నారుల చేతుల్లో కర్పూరం వెలిగించి గాయపరిచిన ఘటన వైఎస్సార్ జిల్లా లక్కిరెడ్డిపల్లెలో వెలుగుచూసింది. గ్రామంలోని ప్రజాచైతన్య స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పది మంది బాలురతో ఆర్బీసీ స్కూల్ నడుస్తోంది. ఈ స్కూల్లో ఆశ్రయం పొందుతున్న ఓ బాలుడి డబ్బును ఎవరో దొంగిలించారు. ఈ విషయమై స్కూల్ అటెండర్ అన్నపూర్ణమ్మ ముగ్గురు బాలురను అనుమానించింది. శుక్రవారం సాయంత్రం వారి అరచేతుల్లో కర్పూరం ఉంచి వెలిగించింది. అది కాలితే దొంగతనం చేసినట్లు...లేకుంటే నిజాయితీపరులేనని వారికిపరీక్షపెట్టింది. అయితే,కర్పూరం మంటతోముగ్గురి చేతులకూ కాలినగాయాలయ్యాయి. ఈ విషయంలో బాధితుల తరఫు ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. సదరు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు చెన్నారెడ్డికి అధికార టీడీపీ నేతల అండదండలున్నాయని సమాచారం.