cancer cure
-
క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల్లో... గేమ్ చేంజర్
సాక్షి, నేషనల్ డెస్క్: క్యాన్సర్ ప్రాణాంతక రోగమని, మొదట్లోనే గుర్తించకుంటే బతకడం కష్టమని అందరికీ తెలుసు. కొన్నిసార్లు వ్యాధిని గుర్తించేలోగానే పరిస్థితి చేయి దాటిపోతుంది. కొన్నిరకాల క్యాన్సర్లను కనిపెట్టేందుకు పరీక్షలు కూడా లేవు. అయితే ఒకే ఒక రక్తపరీక్షతో చాలారకాల క్యాన్సర్లను ఇట్టే కనిపెట్టేయొచ్చంటే? హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటాం కదా. సరిగ్గా అలాంటి మల్టీ క్యాన్సర్ అర్లీ డిటెక్షన్ (ఎంసీఈడీ) రక్తపరీక్షను సైంటిస్టులు కనిపెట్టేశారు. ఎలాంటి లక్షణాలూ కనిపించని క్యాన్సర్లను కూడా ఈ పరీక్ష ద్వారా నిర్ధారించగలగడం ఇందులో పెద్ద విశేషం. ఊపిరి పీల్చుకోదగ్గ విషయం కూడా! ఒకరకంగా ఎంసీఈడీ పరీక్షను వైద్యశాస్త్రంలో, ముఖ్యంగా క్యాన్సర్ నిర్ధారణలో గేమ్ చేంజర్‌గా చెప్పొచ్చు. క్యాన్సర్ స్క్రీనింగ్‌లో కొత్త విధానాలను కనుగొనేందుకు కృషి చేస్తున్న గ్రెయిల్ అనే హెల్త్ కేర్ సంస్థ ఈ సరికొత్త పరీక్ష విధానాన్ని అభివృద్ధి చేసింది. అధ్యయనంలో భాగంగా ఈ సంస్థ 6,662 మంది వ్యక్తులపై ఈ పరీక్ష నిర్వహించింది. వీళ్లంతా 50, అంతకన్నా ఎక్కువ వయసు వ్యక్తులే కావడం గమనార్హం. ప్యారిస్‌లో ఇటీవల జరిగిన యూరోపియన్ సొసైటీ ఫర్ మెడికల్ అంకాలజీ (ఈస్‌ఎంఓ) కాంగ్రెస్‌లో గ్రెయిల్ తమ పరిశోధన వివరాలను సమర్పించింది. ఆరువేల పై చిలుకు మందిపై పరీక్ష నిర్వహిస్తే వారిలో దాదాపు ఒక శాతం మందికి క్యాన్సర్ ఉన్నట్టు తేలింది. వీటిలో కొన్ని ఇప్పటిదాకా పరీక్షలకు దొరకని క్యాన్సర్ రకాలు కూడా ఉండటం విశేషం. దీన్ని క్యాన్సర్ పరిశోధనలను సమూలంగా మార్చివేసే పరీక్ష విధానంగా భావిస్తున్నారు. ఇప్పటిదాకా అందుబాటులో ఉన్న క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష అయిన గాలెరీ (ఎంసీఈడీ–ఈ)ని మరింతగా ఆధునీకరించి వ్యాధిని మరింత కచ్చితంగా గుర్తించేలా రూపొందించారు. గాలెరీ పరీక్ష ద్వారా పదుల సంఖ్యలో క్యాన్సర్లను గుర్తించే వీలుంది. వాటిలో లక్షణాలు కనపడని క్యాన్సర్లు కూడా ఉన్నాయి. అయితే ఎంసీఈడీ పరీక్ష పద్ధతిలో దాదాపు రెట్టింపు స్థాయిలో క్యాన్సర్లను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించే వీలుంది. గాలెరీ పరీక్ష ద్వారానే కాలేయం, చిన్న పేగు, యుటెరస్, పాంక్రియాటిక్ స్టేజ్–2, బోన్ క్యాన్సర్ వంటివాటిని లక్షణాలు లేని స్థాయిలోనే గుర్తించే వీలుంది. అయితే కొత్త పద్ధతి మరిన్ని రకాల క్యాన్సర్లను మరింత కచ్చితత్వంతో గుర్తిస్తుంది. కొత్త పరీక్ష (ఎంసీఈడీ)లో 92 మందిలో క్యాన్సర్ లక్షణాలను గుర్తించారు. పైగా 97 శాతం కచ్చితత్వముంది. ఇలా గుర్తించిన 36 రకాల క్యాన్సర్లలో 71 శాతం క్యాన్సర్లను నిర్ధారించే అవకాశం ఇప్పటిదాకా ఉండేది కాదు. ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌ను గుర్తించడం వల్ల చికిత్సా విధానంలో కూడా పెను మార్పులు రానున్నాయి. అయితే ఇది క్లినికల్‌గా ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉంది. ఇదీ చదవండి: శాస్త్రవేత్తలను సైతం కలవరపాటుకు గురిచేసిన విచిత్ర జీవి: వీడియో వైరల్ -
ఆరోగ్యశ్రీలో క్యాన్సర్‌కు పెద్దపీట
సాక్షి, అమరావతి: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో క్యాన్సర్ రోగులు పెద్దఎత్తున ఉపశమనం పొందుతున్నారు. గతంలో చికిత్సలు తక్కువ సంఖ్యలో ఉండటం, ఇతర రాష్ట్రాల్లో అనుమతి లేకపోవడం తదితర కారణాలతో రోగులు ఎక్కువగా ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించేవారు. దీనివల్ల ఆర్థిక భారంతో పేద రోగులు తీవ్రంగా చితికిపోయేవారు. కానీ, సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీని పటిష్టపర్చడంతో ఒక్క క్యాన్సర్‌లోనే అదనంగా 54 చికిత్సలను చేర్చడం.. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లోనూ చికిత్సకు అనుమతించడంతో బాధితులకు ఎంతో మేలు చేకూరుతోంది. ఏ ఆస్పత్రికి వెళ్లినా వైద్యం లేదనకుండా ఈ వ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తున్నారు. ఒక్క ఏడాదిలో రూ.300 కోట్లు వ్యయం 2018–19లో క్యాన్సర్ చికిత్సలకు గరిష్టంగా ఏటా రూ.197 కోట్లు మాత్రమే వ్యయం చేశారు. కానీ, 2020–21లో సుమారు రూ.300 కోట్లు వెచ్చించారు. దీన్నిబట్టి క్యాన్సర్ చికిత్సకు రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో పెద్దపీట వేస్తోందో అంచనా వెయ్యొచ్చు. ఇందులో భాగంగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యశ్రీ కింద 38,935 మంది బాధితులు లబ్ధిపొందగా.. 1,39,701 ప్రీ ఆథరైజేషన్లు (కీమో, రేడియేషన్ వంటి వాటికి రావడం) జరిగాయి. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 5,056 మంది బాధితులు నమోదయ్యారు. -
క్రిస్పర్ క్యాస్–9తో.. కేన్సర్‌కు చెక్
సాక్షి, హైదరాబాద్: కేన్సర్‌పై పోరులో ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేశారు. జన్యు ఎడిటింగ్ టెక్నాలజీ క్రిస్పర్ క్యాస్–9 సాయంతో కేన్సర్ కణాలను విజయ వంతంగా మట్టుబెట్ట గలిగారు. ఎలుకలపై జరిగిన ప్రయోగాలు విజయవంతమైన నేపథ్యంలో ఇంకో రెండేళ్లలోనే ఈ కొత్త పద్ధతిని మానవ వినియో గానికి సిద్ధం చేస్తామని ఇజ్రాయెల్ శాస్త్రవేత్త డాన్ పీర్ పేర్కొన్నారు. ఇదే జరిగితే కేన్సర్ చికిత్సకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న కీమోథెరపీ చరిత్ర పుటల్లో కలిసిపోతుందని అంచనా. దుష్ప్రభావాలు ఉండవు... మన జన్యువుల్లో అవసరానికి తగ్గట్లు మార్పుచేర్పులు చేసుకొనేందుకు క్రిస్పర్ క్యాస్–9 ఉపయోగపడుతుంది. ఈ టెక్నాలజీని ఇప్పటికే అరుదైన వ్యాధుల చికిత్స కోసం ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో టెల్ అవీవ్ యూనివర్సిటీ శాస్త్రవేత్త డాన్ పీర్ ఈ టెక్నాలజీని కేన్సర్ చికిత్సకు ప్రయోగా త్మకంగా వాడి విజయం సాధించారు. పైగా ఈ టెక్నాలజీ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలూ ఉండవని, కేన్సర్ కణాలు మాత్రమే మరణించేలా డీఎన్ఏలో మార్పులు చేయగలిగామని డాన్ పీర్ తెలిపారు. ఇంకోలా చెప్పాలంటే ఇదో అందమైన కీమోథెరపీ అని ఆయన అభివర్ణించారు. పరిశోధన వివరాలు సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో ప్రచురితమ య్యాయి. ఈ పద్ధతిని ఉపయోగించి కేన్సర్ కణాలను చంపేస్తే మరోసారి వ్యాధి తిరగబెట్టే అవకాశం ఉండదని డాన్ పీర్ తెలిపారు. ఆయుష్షు పెరుగుతుంది.. క్రిస్పర్ క్యాస్–9 సాయంతో తాము అభివృద్ధి చేసిన కేన్సర్ చికిత్స వల్ల కేన్సర్ రోగుల జీవితకాలం మరింత పెరుగుతుందని, మూడుసార్లు ఉపయోగిస్తే చాలు.. ఈ టెక్నాలజీ కేన్సర్ కణతిని నాశనం చేయవచ్చని డాన్ పీర్ చెబుతున్నారు. కేన్సర్ కణాల డీఎన్ఏను ఈ టెక్నాలజీ ద్వారా కత్తిరించవచ్చని, ఫలితంగా ఆ కణాలు మరణిస్తాయని తెలిపారు. ప్రస్తుతం కేన్సర్ చికిత్సకు ఉపయోగించే కీమోథెరపీతో అనేక దుష్ప్రభావాలు ఉంటా యని, క్రిస్పర్ క్యాస్–9 టెక్నాలజీతో ఆ సమస్య లేదని స్పష్టం చేశారు. మెదడు, గర్భాశయ కేన్సర్లు ఉన్న వందలాది ఎలుకలపై తాము పరిశోధనలు చేపట్టామని, చికిత్స అందుకున్న ఎలుకల జీవితకాలం.. కంట్రోల్ గ్రూపులోని ఎలుకల కంటే రెండు రెట్లు ఎక్కువైందని పీర్ వివరించారు. అన్ని రకాల కేన్సర్లకు ఈ టెక్నాలజీని ఉపయోగించేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నామని, అన్నీ సవ్యంగా సాగితే రెండేళ్లలో ఇది మానవ వినియోగానికి అందుబాటులోకి వస్తుందని వివరించారు. రోగి శరీరం నుంచి సేకరించిన పదార్థం (బయాప్సీ) ఆధారంగా సాధారణ ఇంజెక్షన్ ద్వారా చికిత్స కల్పించవచ్చా? లేక కణతిలోకి నేరుగా ఇంజెక్షన్ ఇవ్వాలా? అన్నది తెలుస్తుందని వివరించారు. జన్యువుల సూచనలను ప్రొటీన్లుగా మార్చే ఎంఆర్ఎన్ఏను ఈ టెక్నాలజీలో కత్తెరల మాదిరిగా వాడుకుంటామని, కేన్సర్ కణాలను గుర్తించే నానోస్థాయి కొవ్వు పదార్థాలను కూడా కలిపి ఇంజెక్షన్ ఇస్తామని చెప్పారు. -
కేన్సర్ చికిత్సలో కాంబినేషన్ థెరపీ
సాక్షి, సంగారెడ్డి: కేన్సర్ మహమ్మారిని నిర్మూలించేందుకు ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్లు చేసిన పరిశోధనల్లో ముందడుగు పడింది. కేన్సర్ చికిత్స కోసం సమర్థవంతమైన కాంబినేషన్ థెరపీని అభివృద్ధి చేశారు. కేన్సర్‌కు ఎలాంటి మందులు లేకపోవడంతో చికిత్స ద్వారానే నిర్మూలించేందుకు తాము మెరుగైన చికి త్స కోణంలో పరిశోధనలు జరిపిన ట్లు ఐఐటీ హైదరాబాద్ బయో మెడికల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అరవింద్‌కుమార్ రెంగన్ తెలిపారు. యాంటీ కేన్సర్ ఏజెంట్‌ను ఉపయోగించి ఫొటోథర్మల్ థెరపీ (పీటీటీ), కీమోథెరపీ సినర్జెటిక్ కలయికను గుర్తించినట్లు వివరించారు. పరిశోధన వివరాలతో మంగళవారం ఐఐటీ హెచ్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కాంబినేషన్ థెరపీపై ఐఐటీ బాంబే, కోల్‌కతా బోస్ విశ్వవిద్యాలయం సహకారంతో పరిశోధనలు నిర్వహించినట్లు డాక్టర్ అరవింద్‌కుమార్ రెంగన్ పేర్కొన్నారు. హోస్ట్ కణాలను నాశనం చేస్తారిలా.. ఫొటోథర్మల్ థెరపీలో కాంతిని వేడిగా మార్చే పదార్థం కణతి (గడ్డ) ఉన్న ప్రాంతానికే నేరుగా వెళ్తుందని.. తద్వారా హోస్ట్ కేన్సర్ కణాలను తొలగించడం, నాశనం చేయడం చాలా సులువవుతుందని అరవింద్‌కుమార్ రెంగన్ తెలిపారు. ఐఆర్ 780 ఇన్ఫ్రారెడ్ కాంతిని గ్రహించడంతో పాటు కణతి వద్ద ఉండే కేన్సర్ కణాలను చంపేస్తుందని పేర్కొన్నారు. ఐఆర్ 780 హోస్ట్ కేన్సర్ కణాలను నశింపజేసే ఆక్సిజన్ జాతులను ఉత్పత్తి చేస్తుందని పరిశోధన ద్వారా తెలుసుకున్నామన్నారు. -
పూడ్చిపెట్టకండి.. త్వరలో నేను బతికిరావొచ్చు!
నన్ను పూడ్చిపెట్టకండి. నా శరీరాన్ని ఐస్‌లో భద్రపరచండి. భవిష్యత్తులో క్యాన్సర్‌కు చికిత్స కనుగొనవచ్చు. అప్పుడు నేను బతికే అవకాశం ఉంటుంది.. ఇది ఇటీవల మృతిచెందిన 14 ఏళ్ల బాలిక చివరి కోరిక. ఆమె కోరికను బ్రిటన్ కోర్టు మన్నించింది. లండన్‌కు చెందిన ఈ బాలిక గత ఏడాది ఆగస్టులో క్యాన్సర్ బారిన పడింది. తెలివైన అమ్మాయిగా పేరుతెచ్చుకున్న ఆమె అన్ని వైద్యచికిత్సలు విఫలమవ్వడంతో నెలరోజుల తర్వాత ప్రాణాలు విడిచింది. అయితే, తాను చనిపోయేముందు బ్రిటన్ హైకోర్టు జడ్జి జస్టిస్ పీటర్ జాక్సన్‌కు లేఖ రాసింది. ‘నేను జీవించాలనుకుంటున్నా. చాలాకాలం జీవించాలనుకుంటున్నా. నాకు సోకిన క్యాన్సర్‌కు భవిష్యత్తులో చికిత్స కనుగొనవచ్చు. అప్పుడే నేను మేలుకుంటాను. క్రియోజెనిక్ (ఐస్‌తో గడ్డకట్టించే) పద్ధతిలో నా శరీరాన్ని పరిరక్షించడం ద్వారా వందేళ్ల తర్వాత అయిన నాకు చికిత్స అందించే నన్ను మేలుకొలిపే అవకాశం ఉండొచ్చు’ అని ఆమె పేర్కొంది. ఆమె చివరికోరికను మన్నించిన జస్టిస్ పీటర్ జాక్సన్.. ఇలాంటి కేసు రావడం ఇంగ్లండ్‌లోనే తొలిసారి అని, ప్రపంచంలో కూడా ఇదే తొలి కేసు కావొచ్చునని పేర్కొన్నారు. బాలిక మౌలిక ప్రిజర్వేషన్ ఆప్షన్ (క్రియోజెనిక్)ను ఎంచుకుంది. ఇందుకోసం 46వేల డాలర్ల (రూ. 31.31లక్షల) ఖర్చు అవుతుంది. విడాకులు తీసుకున్న బాలిక తల్లిదండ్రులు ఆమె చివరికోరికపై భిన్నంగా స్పందించారు. ఇలాంటి పద్ధతిని ఎంచుకోవడానికి బాలిక తండ్రి నిరాకరించగా, తల్లి మాత్రం తన బిడ్డ చివరి కోరిక నెరవేరాలని ఆకాంక్షించింది. తల్లి అభిప్రాయానికే కోర్టు మొగ్గుచూపింది. -
బీర్ హాప్స్‌తో కేన్సర్‌కు చెక్..!
వాషింగ్టన్: బీర్ హాప్స్.. బీరును తయారీకి వాడే ఒక రకం పువ్వులు. వీటిలో ఉండే రసాయనాలు కేన్సర్‌కు దివ్యౌషధంగా పనిచేస్తాయట. కేన్సర్‌నే కాదు పలు బ్యాక్టీరియాలను, ఇతర వ్యాధులను కూడా నియంత్రించవచ్చట. బీర్ హాప్స్‌లో ఉన్న వ్యాధి నిరోధక కారకాలపై శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. త్వరలోనే ఆరోగ్యకరమైన ఇలాంటి హాప్స్‌ను కృత్రిమంగా టేబొరేటరీల్లో తయారు చేసే దిశగా పరిశోధనలు సాగిస్తున్నారు. హాప్స్‌లో ఉన్న రసాయనాల్లో తమకు కావాల్సిన ఆరోగ్యకారకమైన రసాయనాలను గుర్తించే వేరుచేసే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. పరిశోధనకు నేతృత్వం వహించిన వర్సిటీ ఆఫ్ ఇదహో శాస్త్రవేత్త క్రిస్టోఫర్ వేనంట్ పరిశోధన వివరాలు తెలిపారు. ‘హాప్స్‌లో హుములోనెస్, లుపులోనెస్ మిశ్రమాలను గుర్తించాం. హుములోనెస్ అనేవి ఆల్ఫా యాసిడ్స్ , వీటిలో కేన్సర్ నిరోధక కారకాలుంటాయి. లుపులోనెస్ అనేవి బెటా యాసిడ్స్. ఇవి కూడా ఆరోగ్యానికి సహాయపడేవే. ఈ యాసిడ్స్‌కు కేన్సర్ సెల్స్‌ను నశింపజేసే శక్తి ఉందని, అలాగే లుకేమియా సెల్స్‌ను కూడా నియంత్రిస్తాయి. ఈ రెండింటిని కలిపే ప్రక్రియను కొనసాగిస్తున్నాం’ అని చెప్పారు.