ఐష్ ఫీస్ట్
శుక్రవారం కాన్స్ చలనచిత్రోత్సవాలు అంతకు ముందు రెండు రోజుల్లానే పసందుగా జరిగాయి. కానీ, ఆరోజు కాన్స్ వేదిక కొత్త శోభ సంతరించుకుంది. దానికి కారణం అందాల సుందరి ఐశ్వర్యా రాయ్ పాల్గొనడం. అందంగా ముస్తాబై, ఎర్ర తివాచీ మీద మెరిశారు ఐష్. ఎప్పటిలా తనదైన శైలిలో గాల్లో ముద్దులు విసిరి సందడి చేశారు. దాదాపు ఏడాది క్రితం ఇదే ఉత్సవాల్లో ఫిజిక్ వైజ్‌గా ఐష్ కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ, ఈసారి మాత్రం మెరుపు తీగలా కనిపించి, కనువిందు చేశారు.