cantonment roads
-
తెరుచుకోనున్న కంటోన్మెంట్ దారులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మూసేసిన అన్ని కంటోన్మెంట్ దారులను వెంటనే తెరవాలని రక్షణ శాఖ నిర్ణయించింది. ఇటీవల మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదివారం ఒక ప్రకటన వెలువడింది. కంటోన్మెంట్లు, అక్కడి దారుల మూసివేతపై నిర్వహించిన ఈ భేటీకి 62 కంటోన్మెంట్ల ఉపాధ్యక్షులు, ఆ ప్రాంత ఎంపీలు హాజరయ్యారు. ఇకపై ఒక్కో కంటోన్మెంట్ దారి మూసివేతను సంబంధిత చట్టంలోని నిబంధనలను అనుసరించి సమీక్షించాలని నిర్ణయించారు. స్థానికులు, సైనికుల ఫిర్యాదులు, అవసరాలను ఉమ్మడిగా పరిష్కరించేందుకు ప్రామాణిక విధానాన్ని అమల్లోకి తేవాలని కూడా నిర్ణయించారు. -
రాత్రిళ్లూ తెరుచుకోనున్న కంటోన్మెంట్ దారులు
సాక్షి, న్యూఢిల్లీ: కంటోన్మెంట్ ప్రాంతంలోని రహదారులు అన్ని వే ళల్లో తెరిచి ఉంచేందుకు రక్షణ శాఖ వీలుకల్పించిందని టీడీపీ ఎంపీ మల్లారెడ్డి చెప్పారు. ఈ మేరకు త్రివిధ దళాధిపతులకు రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ఆదేశాలు జారీ చేశారని ఆయన శుక్రవారం ఏపీభవన్‌లో మీడియాకు తెలిపారు. సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు దారులు మూసేయడంతో వాహనదారులు పది కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగి ప్రయాణం చేయాల్సివస్తోందని చెప్పారు. ఈ సమస్య పరిష్కారించినందుకు కేంద్ర మంత్రులు మనోహర్ పారికర్, ఇంద్రజిత్ సింగ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
కంటోన్మెంట్ రోడ్లు రాత్రి వేళల్లో తెరచి ఉంచాలి
* రక్షణశాఖ మంత్రికి టీడీపీ ఎంపీ మల్లారెడ్డి విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: భద్రత పేరిట సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని రోడ్లను మిలిటరీ సిబ్బంది మూసివేస్తుండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మల్కాజ్గిరి టీడీపీ ఎంపీ మల్లారెడ్డి పేర్కొన్నారు. గురువారం పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ సమస్యను రక్షణ మంత్రి మనోహర్ పారీకర్ దృష్టికి తెచ్చినట్టు తెలిపారు. విజయ్‌చౌక్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిజాం కాలం నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ప్రజలకు అందుబాటులో ఉన్న రోడ్లను అకస్మాత్తుగా భద్రత పేరుతో మూసివేయడం సరికాదన్నారు. దీంతో సుమారు 12 లక్షల మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ‘రాత్రి వేళల్లో అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వెళ్లాలంటే 8 కిలోమీటర్లు అదనంగా తిరిగి రావాల్సి వస్తోంది. దీంతో ప్రజలకు ఎంతో ఇబ్బందిగా ఉందని రక్షణశాఖ మంత్రికి విజ్ఞప్తి చేశా. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారు’ అని మల్లారెడ్డి తెలిపారు.