రాత్రిళ్లూ తెరుచుకోనున్న కంటోన్మెంట్ దారులు | cantonment roads available in nights | Sakshi
Sakshi News home page

రాత్రిళ్లూ తెరుచుకోనున్న కంటోన్మెంట్ దారులు

Published Sat, Jan 24 2015 3:29 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

cantonment roads available in nights

సాక్షి, న్యూఢిల్లీ: కంటోన్మెంట్ ప్రాంతంలోని రహదారులు అన్ని వే ళల్లో తెరిచి ఉంచేందుకు రక్షణ శాఖ వీలుకల్పించిందని టీడీపీ ఎంపీ మల్లారెడ్డి చెప్పారు. ఈ మేరకు త్రివిధ దళాధిపతులకు రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ఆదేశాలు జారీ చేశారని ఆయన శుక్రవారం ఏపీభవన్‌లో మీడియాకు తెలిపారు. సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్‌లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు దారులు మూసేయడంతో వాహనదారులు పది కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగి ప్రయాణం చేయాల్సివస్తోందని చెప్పారు. ఈ సమస్య పరిష్కారించినందుకు కేంద్ర మంత్రులు మనోహర్ పారికర్, ఇంద్రజిత్ సింగ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement