car - bike collision
-
వీడియో: అంత బలుపెందుకు భయ్యా.. హైస్పీడ్‌లో బైకును ఢీకొట్టి..
అతి వేగం ఎంత ప్రమాదకరమో అందరికీ తెలిసిందే. అయితే, హై స్పీడ్‌లో ఉన్న ఓ కారు డ్రైవర్ రెచ్చిపోయాడు. నా కారుకే అడ్డు వస్తారా అనుకున్నాడో ఏమో.. రెండు బైకులకు కారుతో ఢీకొట్టి.. ఓ బైక్‌ను ఏకంగా కిలోమీటర్ దూరం వరకు ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ర్యాష్ డ్రైవింగ్ చేశాడు. ఈ క్రమంలో తన కారుకు అడ్డుగా వచ్చిన రెండు బైకులను ఢీకొట్టాడు. అనంతరం.. కింద పడిపోయిన ఓ బైకును తన కారు ముందు భాగమైన బంపర్ కింద పెట్టుకుని దాదాపు కిలోమీటర్ దూరం వరకు ఈడ్చుకెళ్లాడు. ఈ క్రమంలో బైక్.. రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్తుండగా రోడ్డుమీద మెరుపులు సైతం రావడం విశేషం. ఇంతలో మరో బైక్‌పై బైకర్లు ఇద్దరూ కారును వెంబడించి వీడియో తీశారు. వారిని గమనించిన కారు డ్రైవర్ కారును మరింత స్పీడ్‌తో డ్రైవ్ చేశాడు. ఇక, ఓ చోట కారును ఆపిన బైకర్లు.. డ్రైవర్‌ను కిందకు దిగాలని అడిగినప్పటికీ అతడు దిగేందుకు నిరాకరించాడు. అనంతరం.. ఈ ఘటనపై ఇందిరాపురం పరిధిలోని పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఈ ప్రమాదంలో బైకర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. కాగా, ఈ ప్రమాదం శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో జరిగింది. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. वीडियो चौकाने वाली हैं #Ghaziabad में सड़क पर दीवाली की चरखी नही बल्कि बाइक सवार 2 को टक्कर मारने के बाद कारचालक गाड़ी के अगले हिस्से में फंसी बाइक को 1 किमी तक घसीट ले गया जिससे चिंगारियां निकल रही है। ।घटना इंदिरापुरम के मंगल चौक की है pic.twitter.com/8RAJvBt1hl — Ankit Tiwari (@Unknowankitt) November 5, 2022 -
ముగ్గురిని బలితీసుకున్న కారు
ఫిరంగిపురం (తాడికొండ): కారు ఢీకొని ద్విచక్రవాహనంపై వెళ్తున్న ముగ్గురు మృత్యువాత పడిన ఘటన గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం అమీనాబాద్ గ్రామ శివారులో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 113 తాళ్లూరు గ్రామానికి చెందిన దంపతులు షేక్ చిన్న మస్తాన్ (55), షేక్ నూర్జహాన్ (45), వారి కుమారుడు షేక్ హుస్సేన్ (25)లు ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనంపై అమరావతికి వెళ్తున్నారు. అమీనాబాద్ శివారు తులసీ సీడ్స్ సమీపంలో ఎదురుగా వేగంగా వస్తున్న కారు బైక్‌ను ఢీ కొనడంతో ముగ్గురూ కిందపడి, తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని ఆటోలో గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురూ మృతి చెందారు. తండ్రి పొలం పనులు చేసుకుంటుండగా, తల్లి ఉపాధి హామీ పనులకు వెళుతోంది. కుమారుడు పేరేచర్ల సమీపంలోని జోసిల్ కంపెనీలో పనికి వెళ్తుంటాడు. ముగ్గురూ మృతిచెందడంతో ఇక ఆ ఇంట్లో ఎవరూ మిగలలేదు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కారు, బైక్ ఢీ: ఒకరి మృతి
కృష్ణా(ఇబ్రహీంపట్టణం): బైక్‌ను కారు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు ప్రాణాలొదిలాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్టణం మండలంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని దొనబండ గ్రామంలో 65 నంబరు జాతీయ రహదారిపై బైక్‌పై వెళుతున్న షేక్ జానీ(22)ను వెనక నుంచి కారు ఢీకొట్టింది. దీంతో జానీ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిది మండలంలోని జూపుడి గ్రామంగా పోలీసులు నిర్ధరించారు.