Cardholders
-
కిరోసిన్ మంటలు!
లీటర్‌పై రూ.4ల పెంపు ప్రతి నెలా రూ.27,26,804 భారం ఆందోళనలో కార్డుదారులు కోడుమూరు రూరల్ : ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కార్డుదారులకు పంపిణీ చేసే కిరోసిన్ ధరను లీటర్‌పై రూ.4లను పెంచింది. గ్యాస్ కనెక్షన్ ఉన్న కార్డుదారుడు ప్రస్తుతం లీటర్ రూ.15 ఇస్తుండగా, ఇక నుంచి రూ.19 చెల్లించాల్సి ఉంది. గ్యాస్ కనెక్షన్ ఉన్న కార్డుదారుడికి ఒక లీటర్, లేని వారికి 2 లీటర్ల కిరోసిన్ పంపిణీ చేస్తున్నారు. అలాగే కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గ్యాస్ కనెక్షన్ లేని వారికి 4 లీటర్లు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై కార్డుదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నవంబర్ కోటా నుంచి అమలు గ్యాస్ కనెక్షన్ ఉన్న రేషన్ కార్డుదారులకు పంపిణీ చేసే కిరోసిన్‌పై ధర పెంపును నవంబర్ నుంచే అమలు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 10,77,525 రేషన్‌కార్డులుండగా, ఇందులో గ్యాస్ కనెక్షన్ ఉన్న కార్డుదారులు 6,81,701 ఉండగా, కనెక్షన్ లేని వారు 3,95,824 ఉన్నారు. ఈ లెక్కన ప్రతి నెలా గ్యాస్ కనెక్షన్ ఉన్న కార్డుదారులపై రూ.27,26,804 భారం పడనుంది. దీంతో కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు. పెంచిన ధరలను తగ్గించాలి కార్డుదారులకు కిరోసిన్ ధరలను పెంచడం దారుణం. పెరిగిన ధరలతో ఇబ్బందుల పడుతున్న ప్రజలపై మరింత భారం మోపడం మంచిది కాదు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి. -కృష్ణ, సీపీఐ తాలుకా కార్యదర్శి, కోడుమూరు ఈనెల నుంచే అమలు కిరోసిన్ ధర పెరుగుదల ఈ నెల నుంచే అమలవుతుంది. గ్యాస్ కనెక్షన్ లేని కార్డుదారులకు రూ.15లకే లీటర్ పంపిణీ చేస్తాం. -నిత్యానందరాజు, తహసీల్దార్, కోడుమూరు -
కార్డుదారులకు ప‘రేషన్’
* కొన్ని గంటల్లో నిలిచిపోనున్న సరుకుల పంపిణీ * ఉరుకులు పరుగులు పెట్టిస్తున్న గడువు * ఇప్పటివరకు జిల్లాలో 79.55 శాతమే పంపిణీ * పేదలకు కష్టాలు ..డీలర్లకు అవస్థలు చిలకలూరిపేట: అంతా హడావుడి... రేషన్ పంపిణీకి ప్రభుత్వం నిర్దేశించిన సమయం అటు డీలర్లకు, ఇటు రేషన్‌కార్డుదారులకు ఇబ్బందిగా మారింది. కూలి పనులు మానుకొని పేదలు రేషన్ దుకాణాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి నెలా 10వ తేదీ లోగానే రేషన్ సరుకుల పంపిణీ విధానం విమర్శల పాలవుతోంది. ఇక కొన్ని గంటల్లో సరుకుల పంపిణీ నిలిచిపోనుంది. ప్రచారం ఏదీ..? ఒక పథకంలో మార్పులు , చేర్పులు, సవరణలు చేయాలనుకున్నప్పుడు పథకంపై విసృత ప్రచారం నిర్వహించాల్సి ఉంది. కానీ డీలర్ల సమావేశం నిర్వహించి నిర్దేశించిన గడువులోగా సరుకులు పంపిణీ చేయాలని ఆదేశించటంతో వారు హడావుడిగానే సరుకుల పంపిణీ ప్రారంభించారు. పది రోజు ల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు రేషన్ దుకణాల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాల్సి ఉం డగా జిల్లాలో కొంతమంది డీలర్లు రెండు, మూడు తేదీలలో మాత్రమే సరుకుల పంపిణీ చేస్తున్నారు. పథకం పై ప్రచారం కొరవడటంతో ఎప్పటిలాగే సరుకులు అందజేస్తారని ప్రజలు ఆశించారు. కానీ ఆ నోట, ఈ నోట విషయం తెలిసి పరుగున రేషన్‌షాపులకు వచ్చిన పేదలకు ఈ-పాస్ విధానం ఎప్పటిలాగే చుక్కలు చూపించింది. అప్పుడప్పుడు సర్వర్ మెరాయిస్తుండటంతో ప్రజలకు అవస్థతలు తప్పలేదు. కొన్ని ప్రాంతాల్లో ఎంఎల్ పాయింట్ల నుంచి రేషన్ సరకుల పంపిణీ ఆలస్యంగా జరగటంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. అధికార వెబ్సైట్లో వివరాలు.. ఇంతా చేసి ఈ నెల 8తేదీ నాటికి జిల్లాలో 79.55 శాతం సరుకులు పంపిణీ చేసినట్లు ప్రభుత్వ అధికార వెబ్సైట్లో పొందుపరిచారు. ఇదీ నమ్మశక్యంగా లేదు. జిల్లాలోని మొత్తం 2728 రేషన్ దుకాణాల ద్వారా 13,58,883 కార్డుదారులకు మొదటిరోజు అంటే మార్చి ఒకటో తేదీన 6.68 శాతం మాత్రమే పంపిణీ చేయగలిగారు. మార్చి రెండో తేదీ నాటికి 20.17, మార్చి 5వ తేదీకి 58.16 శాతం సరుకులు పంపిణీ చేసినట్లు గణాంకాలు రూపొందించారు. ముగింపు(10వ)తేదీకి పూర్తిస్థాయిలో రేషన్ సరుకులు అందజేస్తామని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని ప్రజల నుంచి అనుకున్న స్పందన రాకపోవటంతో ముందుగా ఐదోతేదీవరకు మాత్రమే రేషన్ సరుకులు పంపిణీ చేస్తామని ప్రకటించారు. తర్వాత దాన్ని 10వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కొన్ని మండలాలల్లో పౌరసరఫరాల అధికారులు హడావుడి చేయటం విశేషం. సాధించేది ఏమిటి? ఇటు డీలర్లను, అటు పేదలను ఇబ్బందులు పెట్టడం మినహా నిర్దేశించిన 10 రోజల కాలపరిమితితో సాధించిందేమిటన్నది సమాధానం లేని ప్రశ్న. కూలినాలి చేసుకొని జీవించే సగటు జీవులు ఏ మాత్రం ఉపక్షేంచినా ఆ నెల రేషన్ వదులుకోవాల్సి వస్తుందని ఉరుకులు పరుగులు పెట్టారు. వలసకూలీలు తప్ప ని సరిగా పనులు మానుకొని సరకులు తీసుకువెళ్లారు. ఇప్పటికైనా ప్రభుత్వం పాత విధానాన్నే కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు. -
మే నుంచి ఆన్లైన్లో నిత్యావసర సరుకులు
- నూతన విధానంపై డిపోల్లో ప్రయోగాలు - ఈ పాస్ విధానంలో పెరుగుతున్న లోపాలు - మే నెల కూడా 242 డిపోల్లోనే ఈపాస్ అమలు శ్రీకాకుళం పాతబస్టాండ్ : పౌర సరఫరాల విభాగంలో పీఎఫ్ షాపుల ద్వారా బీపీఎల్ కార్డుదారులకు నిత్యవసరుకులు అందజేసేందుకు ప్రవేశపెట్టిన ఈ పాస్ విధానం పూర్తిగా విఫలమయింది. ఏప్రిల్‌లో జిల్లాలో 242 డిపోల్లో ఈ పాస్ విధానం ప్రారంభించిన కనీసం 30 శాతం కూడా సఫలీకృతం కాలేదు. ఈ విధానంలో ఉన్న లోపాల వల్ల డీలర్లు, ప్రజలు అవస్థలు పడ్డారు. చివరికి గతి లేక ఆధికారులు గతంలో వలే మ్యన్యువల్గా లబ్ధిదారులకు సరుకులు అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ పాస్ ప్రయోగం వల్ల మంచి ఫలితాలు వస్తే, మే నెల నుంచి మరిన్ని డిపోల్లో నూతన విధానం అమలు చేయాలని ఆధికారులు భావించారు. ఆశించిన రీతిలో ఈ పాస్ విధానం అమలు కాకపోవడంతో ఇబ్బందులు అధిగమించేందుకు మరో ప్రయత్నం అధికారులు ప్రారంభిస్తున్నారు. ఏప్రిల్‌లో సుమారుగా 30 డిపోల్లో ఈ పాస్ యంత్రాలు మొరాయించాయి. నెట్ వర్కు సమస్యల వల్ల ఈ పాస్ యంత్రాలు పనిచేయ లేదు. ఎస్ఆర్డీ హెచ్ అనుసంధానం లేకపోవడం వంటి సమస్యలు వచ్చాయి. నెట్ వర్కు సమస్యను ఆధిగమించేందుకు మే నెల నుంచి ఏపీ ఆన్లైన్ విధానంలో ఈ సరుకులు ఈపాస్ విధానంలో అందజేసేందుకు ప్రయోగాలు ప్రారంభించారు. ఏప్రిల్‌లో ఈ పాస్ విధానం అమలు చేసిన డిపోల్లోనే మే నెలలో కూడా అన్లైన్లో ఈ సరుకులు అందజేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. గతంతో ఈ నెట్ వర్కును నేషనల్ ఇన్పర్మేటివ్ సెంటర్ ద్వారా చేశారు. ఈ విధానం అమలులో సమస్యలు రావడంతో ఆన్లైన్ విధానంలో చేయాలని అధికారులు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. ఈపాస్ విధానం అమలు చేస్తున్న డిపోలకు దగ్గరలో ఉన్న అన్లైన్ కేంద్రాల ద్వారా సరుకులకు సంబంధించిన అనుమతులు పొంది, ఆ రసీదు ఆధారంగా ఈ పాస్‌లో డిపోల వద్దకు వచ్చి సరుకులు తీసుకు వెళ్లాల్సింటుంది. ఇది లబ్ధిదారులకు కూడా భారంగా, కాలయాపనగా మారనుంది. పీఎస్ షాపుల డీలర్లకు కూడా ఇబ్బందులు అధికమయ్యే ప్రమాదాలు ఉన్నాయి. ఆచరణలో సాధ్యంకాని, సంపూర్ణ స్థాయిలో నెట్ వర్కుని ఏర్పాటు చేయకుండా ఆదరాబాదరాగా రాష్ర్ట ప్రభుత్వం ఈ పాస్ విధానం తీసుకురావడంతో లబ్ధిదారులు, డీలర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఏప్రిల్‌లో పాత విధానంలోనే పంపిణీ జిల్లాలో 1990 డిపోలు ఉన్నాయి, ఈ డిపోల పరిధిలో బీపీఎల్ కార్డులు 7,66,611 ఉన్నాయి. ఏప్రిల్‌లో జిల్లాలో 242 డిపోల్లో ఈ పాస్ విధానం అమలు చేశారు. 242 డిపోల పరిధిలో 1,24,754 బీపీఎల్ కార్డులు ఉన్నాయి. వీటిలో కేవలం 36వేలు కార్డులకు మాత్రమే ఈ పాస్ ద్వారా సరుకులు అంద జేశారు. మిగిలిన కార్డులకు గతంలో వలే మ్యాన్యువల్‌గా సరుకులు అందజేశారు. మే నెలలో 242 డిపోల్లో ఈ పాస్ విధానంలో సరుకులు ఏపీ ఆన్లైన్ సాయంతో అందజేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది.