cases investigation
-
22 నుంచి హైకోర్టులో భౌతిక విచారణ
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సూచించిన కరోనా నిబంధనల మేరకు హైకోర్టులో ఈనెల 22 నుంచి మార్చి 19 వర కు పాక్షికంగా భౌతికంగా, ఆన్లైన్ విధానంలో కేసులను విచారించనున్నారు. సోమ, మంగళ వారాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనంతోపాటు న్యాయమూర్తులు జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ చల్లా కోదండరాం భౌతి కంగా కేసులను విచారించనున్నారు. బుధ, గురువారాల్లో జస్టిస్ ఎంఎస్ రామచందర్ రావు, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనంతో పాటు న్యాయమూర్తులు జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ టి.అమర్ నాథ్‌గౌడ్‌లు భౌతికంగా కేసులను విచారి స్తారు. శుక్రవారం రోజు జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి, జస్టిస్ షమీమ్ అఖ్తర్‌లతో కూడిన ధర్మా సనం, జస్టిస్ జి.శ్రీదేవి, జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డిలు కేసులను విచారిస్తారు. వారంలో రెండు రోజుల చొప్పున న్యాయమూర్తులు కేసులను భౌతికంగా.. మిగిలిన రోజులు ఆన్లైన్లో విచారిస్తారు. జస్టిస్ పి.కేశవరావు మాత్రం ఆన్లైన్లో మాత్రమే విచారిస్తారు. కాగా, మార్చి 1 నుంచి జిల్లా స్థాయి కోర్టుల్లో కేసులను భౌతికంగా మాత్రమే విచారించాలని హైకోర్టు ఆదేశించింది. -
మిస్టరీగానే మహిళల హత్య కేసులు
- నెలరోజుల వ్యవధిలో రెండు ఘటనలు - భయాందోళనలో జనం శంషాబాద్ రూరల్: శంషాబాద్ మండల పరిధిలో జరిగిన ఇద్దరు గుర్తుతెలియని మహిళల హత్య కేసులు మిస్టరీగా మారాయి. నెల రోజుల వ్యవధిలో రెండు ఘటనలు వెలుగుచూడడంతో జనం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. హతుల వివరాలు తెలియకపోవడంతో ఈ కేసుల దర్యాప్తు పోలీసులకు సవాలుగా మారాయి. గత జనవరి 12న పోశెట్టిగూడ శివారులో ఔటర్ సర్వీసు దారి సమీపంలో ఓ మహిళ(35) మృతదేహం వెలుగు చూసింది. దుండగులు మహిళ తలపై బండరాయితో మోది హత్య చేసిన ఆనవాళ్లు కనిపించా యి. ఈ కేసు మిస్టరీ వీడకముందే సయ్యద్‌గూడ రెవెన్యూ పరిధిలో ఈ నెల 5న ఓ గుర్తు తెలియని మహిళ(40) అస్థిపంజరం బయట పడింది. ఈ రెండు సంఘటనలు కొన్ని రోజుల వ్యవధిలో జరిగినప్పటికీ ఆ లస్యంగా వెలుగు చూశాయి. పోశెట్టిగూడలో ఘటన జరిగిన స్వల్ప కాలంలోనే మృతదేహం బయటపడింది. మృతురాలి ముఖంపై రక్తంమరకలు ఉండి, నల్లగా మారింది. ఆమె ఒంటిపై ఎర్రరంగు లం గా, చారల చీర, నల్లటి జాకెట్ ఉన్నాయి. సంఘటనా స్థలానికి కొద్ది దూరంలో రక్తం మరకలతో నీలిరంగు చారల టవల్, హత్యకు ఉపయోగించిన బండరాయి పడి ఉన్నాయి. సయ్యద్‌గూడ పరిధిలో లభ్యమైన అస్థిపంజరం వద్ద ఓ సెల్‌ఫోన్ ము క్క, కళ్లజోడు మినహా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. సంఘటన జరిగి చాలా రోజు లు కావడంతో మృతదేహం పూర్తిగా కుళ్లిపోయింది. మృతురాలి ఒంటిపై ఎర్ర రంగు చీర ఉంది. నిర్మానుష్య ప్రదేశాల్లో.. రెండు సంఘటనలు జరిగిన ప్రాంతాలు పూర్తిగా జనసంచారం లేని ప్రాంతాలు కావడంతో దుండగులు త ప్పించుకునేందుకు అవకాశం దొరికింది. పోశెట్టిగూడ వద్ద ఔటర్ సర్వీసు దారి అసంపూర్తిగా ఉండగా అటు వైపు వాహనాల రాకపోకలు ఉండవు. హత్య జరిగిన రెండు రోజుల తర్వాత వెలుగుచూసింది. సయ్యద్‌గూడ రెవెన్యూ పరిధిలో గతంలో మట్టి కోసం భారీ గోతులు తీశారు. ఈ ప్రాంతంలో సైతం జనసంచారం చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ సంఘటన జరిగిన తర్వాత సుమారు 20 రోజులకు విషయం వెలుగు చూసింది. అప్పటికే మహిళ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఆస్థిపంజరం మిగిలింది. మృతురాలికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దుండగులు నిర్మానుష్య ప్రాంతాలను ఎంచుకుని ఇలాంటి దారుణాలకు పాల్పడుతుండడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. అడ్డా కూలీలేనా..! రెండు ఘటనల్లో కూడా హతులు అడ్డా కూలీలు అయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుండగులు మహిళలను ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు తీసుకొచ్చి చంపేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళలపై అత్యాచారం జరిగి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. స్థానికంగా ఎవరైనా అదృశ్యం అయితే ఇప్పటికే తెలిసిపోయేది. హతుల వివరాలు తెలియకపోవడంతో కేసుల మిస్టరీ వీడడంలేదు. ఇలాంటి సంఘటనలు ఇటీవల పరిగి మండల పరిధిలో చోటు చేసుకోవడంతో అక్కడి పోలీసులు రెండు రోజుల కిందట ఇక్కడికి వచ్చారు. ఈప్రాంతంలో చోటు చేసుకున్న సంఘటనల తీరును వారు పరిశీలించారు. మహిళల హత్యల దర్యాప్తు విషయమై ఎస్ఐ పాషాను వివరణ కోరగా.. కేసుల దర్యాప్తు అన్ని కోణాల్లో ముమ్మరంగా సాగుతోందని, హతుల వివరాలు తెలిస్తే త్వరగా మిస్టరీలను ఛేదించవచ్చని పేర్కొన్నారు. -
కేసులు సరే.. శిక్షలేవి?
సాక్షి, హైదరాబాద్: హత్యలు, అత్యాచారాలు, కిడ్నాప్‌లు వంటి తీవ్రనేరాల సమయంలో పోలీ సుల హడావిడి అంతాఇంతాకాదు. అయితే ఆ కేసుల దర్యాప్తు మాత్రం ‘ఎక్కడ వేసిన గొంగడి అక్క డే’ అన్న చందంగా ఉంది. కేసుల నమోదులో పోలీసులది ఆరంభశూరత్వంగా...దర్యాప్తులో నిర్లక్ష్యంగా కనబడుతోంది. హత్యలు,అత్యాచారాలు, దోపిడీలు, ఆస్తికోసం హత్యలు వంటి తీవ్ర నేరాలకు సంబంధించిన కేసుల్లో రాష్ట్రవ్యాప్తంగా శిక్షలు పడుతున్నది 10 నుంచి 12 శాతం మాత్రమే. రోడ్డు ప్రమాదాలు, రోడ్డు భద్రత నిబంధనలు ఉల్లంఘించినవారికి జరిమానాల వంటి చిన్నచిన్న కేసులను చూస్తే నిందితుల్లో 50 శాతం మందికే శిక్షలు పడుతున్నాయి. రాష్ట్ర పోలీసుశాఖ జరిపిన అధ్యయనంలో తేలిన కఠోరమైన నిజాలివి. రాష్ట్రంలో శాంతిభద్రతలపై పోలీసుశాఖ ప్రభుత్వానికి ఇటీవల నివేదిక అందించింది. 2010లో వివిధ కేసుల్లో శిక్షల శాతం 31.47 శాతం ఉండగా ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఎట్టకేలకూ 49.99 శాతానికి పెరిగింది. హైదరాబాద్, సైబరాబాద్, విజయవాడ, విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ల పరిధిలో శిక్షల శాతం మరీ తక్కువగా ఉంది. హత్యలు, అత్యాచారాలు, దోపిడీల వంటి తీవ్రస్థాయి నేరాలలో రాజధాని నగరంలో నమోదవుతున్న కేసుల్లో ఒకటి నుంచి రెండు శాతం వరకే శిక్షలు పడుతున్నాయంటే కేసుల దర్యాప్తులో పోలీసుల నిర్లక్ష్యం ఎలా ఉందనే విషయం అర్థమవుతుంది. తీవ్రస్థాయి నేరాలతోపాటు సంచలనాత్మక కేసుల దర్యాప్తుపై దృష్టిసారించడం, కోర్టులో విచారణ పూర్తయ్యే వరకూ పర్యవేక్షించేలా ప్రతి జిల్లాలో కోర్టు మానిటరింగ్ కమిటీలను ఏర్పాటుచేశామని పోలీసు కో-ఆర్డినేషన్ విభాగం అదనపు డీజీ వినయ్‌కుమార్‌సింగ్ ‘సాక్షి’కి వివరించారు. దీనివల్లే ఈ ఏడాది శిక్షల శాతం గత ఏడాదితో పోలిస్తే 12 శాతం వరకు పెరిగిందని తెలిపారు. శిక్షల శాతం పెరగకపోవడానికి కారణాలివే: దర్యాప్తులో నిర్లక్ష్యం, అవగాహనా రాహిత్యం, నేర నిర్ధారణకు అవసరమైన ఆధారాల సేకరణపై దృష్టిపెట్టకపోవడం, కోర్టుకు శాస్త్రీయమైన ఆధారాలను అందించలేకపోవడం...వంటి కారణాల వల్లే శిక్షల శాతం పెరగడంలేదని పోలీసుశాఖ అధ్యయనంలో తేలింది. కేసుల దర్యాప్తులో తీవ్ర జాప్యం, కోర్టుల్లో దీర్ఘకాలికంగా కేసుల విచారణ కొనసాగడం వల్ల సాక్షులను బెదిరించి, ప్రలోభ పెట్టడం ద్వారా నింది తులు బయటపడుతున్నారని తేలింది. అత్యధిక కేసుల్లో నిర్ణీత గడువు ఆరు నెలలు గడువులోపల చార్జిషీటు దాఖలుచేయకపోవడం కూడా మరో కారణంగా ఉంది.కాగా, దీర్ఘకాలికంగా కేసులు పోలీస్స్టేషన్లలో పెండింగ్‌లో ఉండడడం ప్రధాన సమస్యగా ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలలో మొత్తం 98,546 కేసులు దర్యాప్తు దశలో ఉన్నట్టు పోలీసుశాఖ నివేదికలో పేర్కొంది.