- నెలరోజుల వ్యవధిలో రెండు ఘటనలు
- భయాందోళనలో జనం
శంషాబాద్ రూరల్: శంషాబాద్ మండల పరిధిలో జరిగిన ఇద్దరు గుర్తుతెలియని మహిళల హత్య కేసులు మిస్టరీగా మారాయి. నెల రోజుల వ్యవధిలో రెండు ఘటనలు వెలుగుచూడడంతో జనం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. హతుల వివరాలు తెలియకపోవడంతో ఈ కేసుల దర్యాప్తు పోలీసులకు సవాలుగా మారాయి. గత జనవరి 12న పోశెట్టిగూడ శివారులో ఔటర్ సర్వీసు దారి సమీపంలో ఓ మహిళ(35) మృతదేహం వెలుగు చూసింది. దుండగులు మహిళ తలపై బండరాయితో మోది హత్య చేసిన ఆనవాళ్లు కనిపించా యి. ఈ కేసు మిస్టరీ వీడకముందే సయ్యద్‌గూడ రెవెన్యూ పరిధిలో ఈ నెల 5న ఓ గుర్తు తెలియని మహిళ(40) అస్థిపంజరం బయట పడింది.
ఈ రెండు సంఘటనలు కొన్ని రోజుల వ్యవధిలో జరిగినప్పటికీ ఆ లస్యంగా వెలుగు చూశాయి. పోశెట్టిగూడలో ఘటన జరిగిన స్వల్ప కాలంలోనే మృతదేహం బయటపడింది. మృతురాలి ముఖంపై రక్తంమరకలు ఉండి, నల్లగా మారింది. ఆమె ఒంటిపై ఎర్రరంగు లం గా, చారల చీర, నల్లటి జాకెట్ ఉన్నాయి. సంఘటనా స్థలానికి కొద్ది దూరంలో రక్తం మరకలతో నీలిరంగు చారల టవల్, హత్యకు ఉపయోగించిన బండరాయి పడి ఉన్నాయి. సయ్యద్‌గూడ పరిధిలో లభ్యమైన అస్థిపంజరం వద్ద ఓ సెల్‌ఫోన్ ము క్క, కళ్లజోడు మినహా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. సంఘటన జరిగి చాలా రోజు లు కావడంతో మృతదేహం పూర్తిగా కుళ్లిపోయింది. మృతురాలి ఒంటిపై ఎర్ర రంగు చీర ఉంది.
నిర్మానుష్య ప్రదేశాల్లో..
రెండు సంఘటనలు జరిగిన ప్రాంతాలు పూర్తిగా జనసంచారం లేని ప్రాంతాలు కావడంతో దుండగులు త ప్పించుకునేందుకు అవకాశం దొరికింది. పోశెట్టిగూడ వద్ద ఔటర్ సర్వీసు దారి అసంపూర్తిగా ఉండగా అటు వైపు వాహనాల రాకపోకలు ఉండవు. హత్య జరిగిన రెండు రోజుల తర్వాత వెలుగుచూసింది. సయ్యద్‌గూడ రెవెన్యూ పరిధిలో గతంలో మట్టి కోసం భారీ గోతులు తీశారు. ఈ ప్రాంతంలో సైతం జనసంచారం చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ సంఘటన జరిగిన తర్వాత సుమారు 20 రోజులకు విషయం వెలుగు చూసింది. అప్పటికే మహిళ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఆస్థిపంజరం మిగిలింది. మృతురాలికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దుండగులు నిర్మానుష్య ప్రాంతాలను ఎంచుకుని ఇలాంటి దారుణాలకు పాల్పడుతుండడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.
అడ్డా కూలీలేనా..!
రెండు ఘటనల్లో కూడా హతులు అడ్డా కూలీలు అయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుండగులు మహిళలను ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు తీసుకొచ్చి చంపేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళలపై అత్యాచారం జరిగి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. స్థానికంగా ఎవరైనా అదృశ్యం అయితే ఇప్పటికే తెలిసిపోయేది.
హతుల వివరాలు తెలియకపోవడంతో కేసుల మిస్టరీ వీడడంలేదు. ఇలాంటి సంఘటనలు ఇటీవల పరిగి మండల పరిధిలో చోటు చేసుకోవడంతో అక్కడి పోలీసులు రెండు రోజుల కిందట ఇక్కడికి వచ్చారు. ఈప్రాంతంలో చోటు చేసుకున్న సంఘటనల తీరును వారు పరిశీలించారు. మహిళల హత్యల దర్యాప్తు విషయమై ఎస్‌ఐ పాషాను వివరణ కోరగా.. కేసుల దర్యాప్తు అన్ని కోణాల్లో ముమ్మరంగా సాగుతోందని, హతుల వివరాలు తెలిస్తే త్వరగా మిస్టరీలను ఛేదించవచ్చని పేర్కొన్నారు.
మిస్టరీగానే మహిళల హత్య కేసులు
Published Mon, Feb 9 2015 11:28 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM
Advertisement