Cashless health card scheme
-
వంద శాతం క్యాష్‌లెస్ హెల్త్ క్లెయిమ్ - ఐఆర్డీఏఐ
ముంబై: పాలసీదారులు త్వరలోనే నూరు శాతం నగదు రహిత వైద్య సదుపాయం పొందేందుకు వీలుగా బీమా సంస్థలతో కలసి పనిచేస్తున్నట్టు బీమా రంగ అభివృద్ధి, నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) ప్రకటించింది. నూరు శాతం క్యాష్‌లెస్ క్లెయిమ్ పరిష్కారాల కోసం బీమా సంస్థలు, నేషనల్ హెల్త్ అథారిటీ, బీమా కౌన్సిల్‌తో చర్చిస్తున్నట్టు ఐఆర్డీఏఐ చైర్మన్ దేవాశిష్ పాండా వెల్లడించారు. ముంబైలో జరుగుతున్న ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో భాగంగా ఆయన ఈ అంశంపై మాట్లాడారు. పాలసీదారులు నగదు రహిత చికిత్సలు పొందే విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పాండా దీన్ని ప్రస్తావించడం గమనార్హం. క్లెయిమ్ మొత్తంలో బీమా సంస్థలు నిబంధనల పేరుతో కొంత కోత పెడుతుండగా, కొన్ని క్లెయిమ్‌లను తిరస్కరించడం, రీయింబర్స్మెంట్ విధానంలో రావాలని కోరుతున్నాయి. నేషనల్ హెల్త్ ఎక్సే్ఛంజ్ పరిధిలోకి మరిన్ని హాస్పిటల్స్ చేర్చేందుకు కూడా ఇన్సూరెన్స్ కౌన్సిల్, నేషనల్ హెల్త్ అథారిటీతో సంప్రదింపులు చేస్తున్నట్టు పాండా తెలిపారు. వృద్ధులకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీఇయం అందుబాటులో ఉండేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు. -
ఉద్యోగులకు ఉచిత హెల్త్ కార్డు స్కీమ్!
దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్ గా ఉచిత హెల్త్ కార్డు స్కీమ్ ను ప్రారంభిస్తున్నట్టు ఆదివారం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగులకు ఉచిత వైద్య సేవలు అందించాలనే ప్రతిపాదనకు ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి ఆమోదం తెలిపారు. ఈ పథకం కింద సుమారు 14 లక్షల మంది ఉద్యోగులకు, పెన్సన్ దారులకు, వారి కుటుంబ సభ్యులకు లబ్ది చేకూరుతుంది అని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఉచిత హెల్త్ కార్డు స్కీమ్ కోసం ఏటా 400 కోట్ల రూపాయలను కేటాయించనున్నట్టు అధికారులు తెలిపారు. 60 శాతం ప్రభుత్వం భరిస్తుందని.. 40 శాతం ఉద్యోగులు, పెన్షన్ దారులు భరిస్తారని వెల్లడించారు. ఈ పథకం కింద ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులలో 1885 వ్యాధులు కవర్ అవుతాయన్నారు. జీతాన్ని బట్టి ప్రతి ఉద్యోగి వద్ద నుంచి నెలకు 90 నుంచి 120 రూపాయలు వసూలు చేయనున్నట్టు అధికారులు చెప్పారు. నేడు జరిగిన మంత్రివర్గ సమీక్ష సమావేశంలో ఆర్ధిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి కొండ్రు మురళి, ప్రధాన కార్యదర్శి పీకే మహంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు. పెన్సన్ దారులకు, ఉద్యోగులకు ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం హెల్త్ కార్డు పథకాన్ని ప్రవేశపెట్టిందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.