Casio India
-
కేసియో వాచీల తయారీ ఇక భారత్‌లోనూ..
న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం కేసియో భారత్‌లో తమ వాచీల తయారీపై దృష్టి పెడుతోంది. ఈ ఏడాది ఆఖరు నుంచి దేశీయంగా ఉత్పత్తి ప్రారంభం కాగలదని కేసియో ఇండియా ఎండీ హిడెకి ఇమాయ్ తెలిపారు. స్థానిక భాగస్వామితో కలిసి పని చేస్తున్నామని, ప్రస్తుతం నాణ్యతపరమైన మదింపు జరుగుతోందని ఆయన చెప్పారు. 2023 ఆఖరు నాటికి మేడిన్ ఇండియా శ్రేణి వాచీలను ప్రవేశపెట్టే అవకాశం ఉందని హిడెకి వివరించారు. అత్యధిక యువ జనాభా ఉన్న భారత్‌లో తమ వ్యాపార వృద్ధిపై ఆశావహంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. రాబోయే అయిదేళ్లలో భారత విభాగం అత్యధిక వృద్ధి సాధించగలదని హిడెకి ధీమా వ్యక్తం చేశారు. కేసియోకి చెందిన జీ–షాక్, వింటేజ్ కలెక్షన్, ఎన్‌టైసర్ తదితర బ్రాండ్స్ వాచీల ధరలు రూ. 1,500 నుంచి రూ. 3 లక్షల వరకు ఉన్నాయి. -
స్నాప్‌డీల్‌లో ఆ విక్రయాలపై నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ స్నాప్‌డీల్‌కు జపాన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం భారీ షాక్ ఇచ్చింది. తన బ్రాండ్ పేరుతో నకిలీ ఉత్పత్తులను విక్రయిస్తోందని ఆరోపిస్తూ స్నాప్‌డీల్‌పై కేసు నమోదు చేసింది. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీదారు కాసియో ఈ మేరకు ఢిల్లీలోని తీస్ హజారీ జిల్లా కోర్టులో కేసు వేసింది. దీంతో ఆ వస్తువుల ప్రకటనలు, ప్రదర్శన, అమ్మకాలను నిలిపివేయాలంటూ మధ్యంతర ఎక్స్-పార్ట్ నిషేధ ఉత్తర్వులను కోర్టు జారీ చేసింది. కాసియో బ్రాండ్ వాచెస్, కాలిక్యులేటర్ల నకిలీ అమ్మకాలకు సంబంధించి వినియోగదారుల ఫిర్యాదులు వెల్లువెత్తడంతో స్నాప్‌డీల్ చట్టపరమైన చర్యలను ప్రారంభించినట్లు కంపెనీ లీగల్ డిపార్ట్మెంట్ జనరల్ మేనేజర్ సతోషి యమజాకి వెల్లడించారు. అయితే కోర్టు ఆదేశాలను సమీక్షించి, మార్పులు చేయాల్సిందిగా కోరతామని స్నాప్‌డీల్ తెలిపింది. ప్లాట్‌ఫాంలు, విక్రేతల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం ముఖ్యమని వ్యాఖ్యానించింది. కొద్దిమంది చర్యల వల్ల నిజమైన అమ్మకందారులపై ప్రతికూల ప్రభావితం చూపుతోందని స్నాప్‌డీల్ ప్రతినిధి చెప్పారు. ఈ క్రమంలో నిజమైన ఉత్పత్తులను మాత్రమే విక్రయించేలా సెల్లర్స్ జాగ్రత్త వహించాలన్నారు. లేనిపక్షంలో ఆయా సంస్థలు తమ మార్కెట్‌ను కోల్పోవడంతోపాటు, కాంట్రాక్టు నిబంధనల ప్రకారం భవిష్యత్తులో ప్లాట్ఫామ్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తామని హెచ్చరించారు. అలాగే బ్రాండ్లు తమ మేధో సంపత్తి హక్కుల ఉల్లంఘనను నివేదించడానికి వీలుగా, ఆన్లైన్లో నకిలీ ఉత్పత్తుల నిరోధక కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నట్టు కంపెనీ తెలిపింది. -
కాసియో టచ్ స్క్రీన్ పియానో ‘పిఎక్స్- 560’
హైదరాబాద్: డిజిటల్ పియానోలకు, వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్ ఎడ్యుకేషన్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ‘కాసియో ఇండియా’ తాజాగా ‘పిఎక్స్-560’ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.69,995. వినూత్నమైన ఫీచర్స్, నూతన టోన్స్, యూజర్ ప్రోగ్రామ్ బుల్ రిథమ్స్, బిల్టిన్ స్పీకర్స్‌ను కలగలిపి ఉన్న ఆకర్షణీయమైన బ్లూ కేస్‌లో ఈ డిజిటల్ పియానో వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో 5.3 అంగుళాల డిస్ప్లేతో కలర్ టచ్ ఇంటర్ఫేజ్, ఎబోనీ-ఐవరీ కీలతో ట్రై-సెన్సర్ స్కేల్డ్ హామర్ యాక్షన్ కీబోర్డ్, 256 నోట్ పోలిఫోనీ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నాయని వివరించింది. గ్రేట్ సౌండింగ్ ఫిల్టర్స్, రెస్పాన్సివ్ ఎన్వలప్స్, ఎక్స్టెన్సివ్ మాడ్యులేషన్స్‌తో పిఎక్స్-560 ఒక చక్కటి పర్ఫార్మన్స్ ఇన్‌స్ట్రుమెంట్‌గా ఉంటుందని కాసియో ఇండియా వైస్ ప్రెసిడెంట్ కుల్‌భూషణ్ సేథ్ పేర్కొన్నారు.