CAT Exam
-
ఎంబీఏ చదవలేకపోయాడు.. టీ కొట్టుతో కోట్లు సంపాదించాడు..
అహ్మదాబాద్: జీవితంలో సక్సెస్ ఎవరికీ అంత ఈజీగా రాదు. కానీ వినూత్న ఆలోచన, పట్టుదల ఉంటే అదే సక్సెస్ వెతుక్కుంటూ మన ఇంటి తలుపు తడుతుందని నిరూపించాడు మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రపుల్ బిల్లోర్. మొదట్లో ఈ పేరు కూడా పలకడం రాని వాళ్లకు, అలాంటి పేరుని ఇప్పుడు పది మంది నోళ్లలో నానేలా చేశాడు. ఓ చిన్న టీ కోట్టుతో మొదలై దేశవ్యాప్తంగా 22 స్టాల్స్‌ను ప్రారంభించే స్థాయికి వెళ్లాడు. అలాంటి ప్రపుల్ విజయగాథ వివరాలను ఓ సారి చూసేద్దాం. మధ్యప్రదేశ్‌లోని లాబ్రవదా గ్రామానికి చెందిన రైతు కుమారుడు ప్రఫుల్ బిల్లోర్. అయితే వ్యాపారవేత్త కావాలని మొదటి నుంచి కలలు కనేవాడు. అందుకు ప్రతిష్ఠాత్మక ఐఐఎం విద్యాసంస్థల్లో ఎంబీఏ చేద్దామనుకున్నాడు కానీ క్యాట్ పరీక్షలో మూడు సార్లు ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేకోయాడు. కానీ అదే తన జీవితాన్ని మార్చేయబోతోందని ఆ రోజు అతనికి తెలీదు. మధ్య తరగతి కుటుంబం కావడంతో ఆర్థిక ఇబ్బందులు కారణంగా చదువు పక్కన పెట్టి మెక్‌డొనాల్డ్స్‌లో చేరాడు. అలా కొన్ని నెలల తరువాత, అతను ఉద్యోగం చేస్తునే సొంతంగా చిన్న కొట్టు ప్రారంభించాడు. అయితే వ్యాపారానికి డబ్బులు సరిపోయేవి కావు, దీంతో చదువు కోసం రూ.10,000 కావాలని తండ్రి దగ్గర తీసుకుని వాటిని టీ సామాగ్రిని కొనుగోలుకి ఉపయోగించాడు. అలా సెట్ అయిన వ్యాపారంతో ప్రపుల్ డ్రీమ్ కాలేజ్ అయిన, ఐఐఎం అహ్మదాబాద్ వెలుపల తన టీ అమ్మడం మొదలుపెట్టాడు. మొదటగా మిస్టర్ బిల్లోర్ అహ్మదాబాద్ అనే పేరు పెట్టినప్పటికీ, అతని కస్టమర్లకి ఆ పేరు పిలవడం కష్టంగా ఉండడంతో దానిని ‘ఎంబీఏ చాయ్’ వాలాగా మార్చాడు. ఆ వ్యాపారంలో నిలదొక్కుకోవడానికి ఎన్నో వ్యయ ప్రయాసలు, కష్టాలను ఎదుర్కొని ముందుకు సాగాడు. తన షాపుకి వచ్చే ఎంబీఏ విద్యార్థులు, స్టాఫ్‌తో ఇంగ్లిష్‌లో మాట్లాడుతూ కస్టమర్ బేస్‌ను క్రమంగా పెంచుకుంటూ పోయాడు. గతేడాది అతని వ్యాపారం టర్నోవర్ 3 కోట్లు చేరినట్లు తెలిపాడు ప్రపుల్. ఇలా కొద్దికాలంలోనే దేశవ్యాప్తంగా 22 టీస్టాల్స్‌ను ప్రారంభించి తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. చదవండి: A Man Sends Mail TO Paytm CEO: "నా స్టార్ట్ప్ బిజినెస్‌కి పెట్టుబడి పెట్టండి ప్లీజ్" -
CAT 2021: ఐఐఎంలకు దారిచూపే.. క్యాట్!
ఐఐఎంలు.. మేనేజ్మెంట్ కోర్సులకు ప్రఖ్యాతిగాంచిన ఇన్స్టిట్యూట్స్! వీటిల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష.. క్యాట్(కామన్ అడ్మిషన్ టెస్ట్)!! ఐఐఎం అహ్మదాబాద్.. క్యాట్–2021 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఐఐఎంలతోపాటు దేశంలోని పలు ప్రముఖ బీస్కూల్స్‌లో ప్రవేశానికి క్యాట్ స్కోర్ కీలకంగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో.. క్యాట్ పరీక్ష విధానం, విజయానికి ప్రిపరేషన్ గైడెన్స్.. ఎంబీఏ, పీజీడీఎం, పీజీపీఎం వంటి మేనేజ్ మెంట్ కోర్సులను ప్రముఖ బీస్కూల్స్‌లో చదివిన ప్రతిభావంతులకు కార్పొరేట్ కంపెనీలు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. లక్షల్లో ప్యాకేజీలు ఆఫర్ చేస్తాయి. ముఖ్యంగా ఐఐఎంల్లో ఎంబీఏ పూర్తి చేస్తే.. కార్పొరేట్ కంపెనీలకు హాట్‌కేకే!! అందుకే పేరున్న ఇన్స్టిట్యూట్స్లో మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు తీవ్ర పోటీ నెలకొంది. క్యాట్‌లో స్కోర్ తోపాటు మలిదశలో ప్రతిభ చూపితేనే వీటిల్లో అడ్మిషన్ ఖాయం అవుతుంది. అర్హత కనీసం 50శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్లు్యడీ అభ్య ర్థులకు డిగ్రీలో కనీసం 45శాతం మార్కులు రావాలి. డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు/ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తు న్నవారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక విధానం ► ప్రతి ఏటా క్యాట్‌కు 2 లక్షల మందికి పైగా అభ్య ర్థులు హాజరవుతుంటారు. గతేడాది దాదాపు 2.27 లక్షల మంది పరీక్ష రాసారు. క్యాట్‌కు హాజరవడం అనేది ఐఐఎంల ఎంపిక ప్రక్రియలో ఎంతో కీలకమైన మొదటి దశ. ఈ పరీక్షలో నిర్దేశిత కటాఫ్ స్కోర్ సాధించిన అభ్యర్థులను మలిదశకు షార్ట్‌లిస్ట్ చేస్తారు. ► మలి దశలో..గ్రూప్ డిస్కషన్(జీడీ), రిటెన్ ఎబిలిటీ టెస్ట్(వాట్), పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ► పలు ఐఐఎంలు గత అకడెమిక్ రికార్డ్, సంబంధిత పని అనుభవం, జెండర్ అండ్ అకడెమిక్ డైవర్సిటీ వంటి ప్రమాణాలను పరిగణనలోకి తీసుకునే అవకాశముంది. 76 ప్రశ్నలు–మూడు విభాగాలు ► క్యాట్ పరీక్ష ఆన్లైన్(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో జరుగుతుంది. ► పరీక్షలో మూడు విభాగాల నుంచి మొత్తం 76 ప్రశ్నలు ఉంటాయి. ► వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ (వీఏఆర్సీ) నుంచి 26 ప్రశ్నలు వస్తాయి. ► డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ (డీఐఎల్ఆర్) నుంచి 24 ప్రశ్నలు ఉంటాయి. ► క్వాంటిటేటివ్ ఎబిలిటీ(క్యూఏ) విభాగం నుంచి 26 ప్రశ్నలు అడుగుతారు. ► మొత్తం 76 ప్రశ్నలు–228 మార్కులకు క్యాట్ పరీక్ష నిర్వహిస్తారు. ► ఈ పరీక్షలో నెగిటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి సరైన సమాధానానికి మూడు మార్కులు లభిస్తాయి. ప్రతి తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు. ► ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్, నాన్ మల్టిపుల్ ఛాయిస్(టైప్ ఇన్ ది ఆన్సర్) విధానంలో ఉంటాయి. నాన్ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు నెగిటివ్ మార్కులుండవు. పరీక్ష సమయం రెండుగంటలు ఈ ఏడాది క్యాట్ పరీక్ష సమయం రెండు గంటలు. ఒక్కో సెక్షన్‌కు 40 నిమిషాలు మాత్రమే ఉంటుంది. రెండు గంటల్లో మొత్తం ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం.. ఇలా మూడు ఆన్లైన్ స్లాట్స్ ఉంటాయి. టైమ్ మేనేజ్మెంట్ గతేడాది నుంచి ‘క్యాట్’ సమయం తగ్గింది. అందువల్ల అభ్యర్థులు ‘గోల్ సెట్టింగ్ థియరీ’ ప్రకారం చదివితే విజయం సాధించగలరు అంటున్నారు నిపుణులు. అంటే.. పరీక్షలో మూడు సెక్షన్లతోపాటు ‘టైమ్ మేనేజ్మెంట్’ను నాలుగో విభాగంగా పరిగణించాలి. అభ్యర్థులు ఏదైనా విభాగాన్ని పరిష్కరించడానికి 40 నిమిషాల కంటే ఎక్కువ సమయం అందుబాటులో ఉండదు. ఈ సమయంలోనే మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతోపాటు టైప్ చేసే ప్రశ్నలకు కూడా సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. బలాబలాలు క్యాట్ విభిన్నంగా, క్లిష్టంగా ఉంటుంది. ఇందులో మంచి స్కోర్ సాధించాలంటే.. వేగంతోపాటు కచ్చితత్వం చాలా అవసరం. పరిమిత కాలంలో క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు తమ శక్తి సామర్థ్యా లను అంచనా వేసుకోవాలి. ఏ విభాగం ప్రశ్నలకు వేగంగా సమాధానాలు గుర్తించగలుగుతున్నారు.. ఏ విభాగంలో బలహీనంగా ఉన్నారో తెలుసు కోవాలి. వెనుకబడిన విభాగంలో ఇప్పటికే ప్రాక్టీస్ చేసిన నమూనా ప్రశ్నలను మరోసారి సాధించాలి. మాక్ టెస్టులు ► క్యాట్–2021 పరీక్ష నవంబర్ 28న నిర్వహిం చనున్నారు. అంటే.. దాదాపు నాలుగు నెలల సమయం అందుబాటులో ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి సీరియస్‌గా ప్రిపరేషన్ ప్రారం భించినా.. టాప్ స్కోరు సాధించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ► ముఖ్యంగా పరీక్షలోని మూడు విభాగాల్లో ఒక్కో దానికి నెలరోజుల చొప్పున సమయం కేటాయిం చి చదవడం మంచిది. చివర్లో మిగతా నెలరోజు ల పాటు పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి. ► గత ఐదేళ్ల పాత ప్రశ్న పత్రాలను పరిశీలించి.. ప్రశ్నల శైలిని పరిశీలించాలి. ఏ టాపిక్‌లో ఎలాం టి మార్పులతో ప్రశ్నలు వస్తున్నాయో గుర్తిం చాలి. అందుకు అనుగుణంగా ప్రిపరేషన్ సాగి స్తూ.. మాక్ టెస్టులు సైతం ప్రాక్టీస్ చేయాలి. ముఖ్యమైన సమాచారం ► దరఖాస్తు: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 15.09.2021 ► దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీలకు రూ.1100, ఇతరులకు రూ.2200. ► హాల్‌టికెట్ల డౌన్లోడ్ ప్రారంభం: అక్టోబర్ 27–నవంబర్ 28 ► ఆన్లైన్ క్యాట్–2021 పరీక్ష తేది: నవంబర్ 28, 2021 ► ఫలితాల వెల్లడి: జనవరి రెండో వారం 2022 ► పూర్తి వివరాలు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు వెబ్సైట్: https://iimcat.ac.in -
క్యాట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లలో 2020–21 విద్యా సంవత్సరం ఎంబీఏ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి గతేడాది నవంబర్ 24న నిర్వహించిన క్యాట్ (కామన్ అడ్మిషన్ టెస్ట్)–2019 పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా 2.09 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 1.34 లక్షల మంది పురుషులు, 75 వేల మంది మహిళలు ఉన్నారు. తెలంగాణకు చెందిన వారు దాదాపు 7 వేల మంది క్యాట్ పరీక్ష రాసినట్లు సమాచారం. తాజా ఫలితాల్లో దేశవ్యాప్తంగా 10 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించగా, వీరంతా పురుషులే కావడం గమనార్హం. 100 పర్సంటైల్ వచ్చిన వారంతా డిగ్రీలో ఇంజనీరింగ్ నేపథ్యమున్న వారే. టాప్ టెన్‌లో ఆరుగురు ఐఐటీ విద్యార్థులు కాగా, మరో ఇద్దరు ఎన్ఐటీకి చెందిన విద్యార్థులు. వీరిలో నలుగురు మహారాష్ట్ర, మిగిలిన ఆరుగురు తెలంగాణ, జార్ఖండ్, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందినవారు. మరో 21 మంది 99.9 పర్సంటైల్ సాధించగా, ఇందులో 19 మంది ఇంజనీరింగ్ నేపథ్యమున్న వారే కావడం గమనార్హం. వరంగల్ నిట్ విద్యార్థులు క్యాట్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. -
నవంబర్ 25న క్యాట్ పరీక్ష
కోల్‌కతా: ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)ల్లో ప్రవేశాలకు ఏటా నిర్వహించే క్యాట్–2018 పరీక్షను నవంబర్ 25న నిర్వహిస్తామని ఐఐఎం కోల్‌కతా తెలిపింది. అభ్యర్థులు వచ్చే నెల 8 నుంచి సెప్టెంబర్ 19వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. రెండు దశల్లో జరగనున్న ఈ పరీక్ష కోసం దేశవ్యాప్తంగా 147 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు క్యాట్ కన్వీనర్ ప్రొఫెసర్ సుమంతా బసు చెప్పారు. అభ్యర్థులు ప్రాధాన్యతా క్రమంలో 4 పట్టణాలను ఎంపిక చేసుకోవచ్చని సూచించారు. అక్టోబర్ 24 నుంచి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని, పరీక్ష ఫార్మట్‌పై అభ్యర్థులకు అవగాహన కల్పించేందుకు అక్టోబర్ 17 నుంచి అధికారిక వెబ్సైట్లో మోడల్ పేపర్లను అందుబాటులోకి ఉంచనున్నట్లు తెలిపారు. -
దీర్ఘకాలిక ప్రిపరేషన్ ప్రణాళిక
క్యాట్-2015 నిర్వహణను పర్యవేక్షిస్తున్న ఐఐఎం-అహ్మదాబాద్.. పరీక్ష నిర్వహణ పరంగా మార్పులు చేయనుంది. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఒకే రోజు రెండు స్లాట్లలో క్యాట్ జరిగే అవకాశముంది. పరీక్ష తేదీ కూడా అక్టోబర్‌లోనే ఉండొచ్చు. కాబట్టి ఔత్సాహిక విద్యార్థులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్‌కు పదును పెట్టాలి. ముఖ్యంగా బ్యాచిలర్ డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు అటు అకడమిక్స్‌తోపాటు, ఇటు క్యాట్ కోసం కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పరీక్ష విధానం: క్యాట్ పరీక్షలో ఏటా ఏదో ఒక మార్పు చోటుచేసుకుంటోంది. ఈసారి కూడా కొన్ని మార్పులు ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే పరీక్ష విధానంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని, గతేడాది మాదిరిగానే పరీక్ష స్వరూపం ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. ఈసారి కూడా 1) క్వాంటిటేటివ్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్, 2) వెర్బల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్.. రెండు సెక్షన్లు ఉంటాయన్నారు. ప్రతి సెక్షన్లో 50 ప్రశ్నలకు 150 మార్కులు చొప్పున రెండు సెక్షన్లకు మొత్తం 300 మార్కులకు పరీక్ష జరగనుంది. సమయం కూడా గతేడాది తరహాలోనే 170 నిమిషాలు ఉంటుందని భావిస్తున్నారు. దీన్ని గమనించి పటిష్ట ప్రణాళిక ప్రకారం ప్రిపరేషన్ సాగించాలి. వెర్బల్ ఎబిలిటీ: వెర్బల్ ఎబిలిటీ విభాగంలో అధిక స్కోరింగ్‌కు కీలకం.. రీడింగ్ కాంప్రహెన్షన్. ఇందులో మంచి స్కోర్ సాధించాలంటే అభ్యర్థులు ఒక అంశాన్ని విశ్లేషణాత్మకంగా చదవడాన్ని అలవర్చుకోవాలి. చదివేటప్పుడు అందులోని ముఖ్య సమాచారం, ప్రశ్నార్హమైన అంశాలు, కీలక పదాలను గుర్తించే నేర్పును సొంతం చేసుకోవాలి. దీనికోసం ఇంగ్లిష్ దినపత్రికల్లోని ఎడిటోరియల్స్, ఇతర వ్యాసాలు చదవాలి. తర్వాత సొంతంగా క్లుప్తంగా సారాంశం రాసుకోవాలి. వొకాబ్యులరీపై పట్టు సాధించడం వెర్బల్ ఎబిలిటీకి ఎంతో ఉపయోగకరం. ఇంగ్లిష్ గ్రామర్‌లోని కీలక అంశాలను అధ్యయనం చేయాలి. ప్రిఫిక్స్, సఫిక్స్ విధానం.. వర్డ్ లెర్నింగ్ వొకాబ్యులరీపై పట్టు సాధించేందుకు ఉపకరిస్తుంది. రోజూ కనీసం 20 నుంచి 30 కొత్త పదాలను నేర్చుకోవాలి. ఆయా పదాల ఉపయోగించడంపై అవగాహన అవసరం. లాజికల్ రీజనింగ్: స్వీయ ఆలోచన, తులనాత్మక పరిశీలనతో రాణించగలిగే విభాగం లాజికల్ రీజనింగ్. ఇందులో అధిక మార్కుల సాధనకు క్లిష్టమైన డేటాను అర్థం చేసుకుని, విశ్లేషించే నైపుణ్యం చాలా అవసరం. లాజికల్ రీజనింగ్‌లో అడిగే ప్రశ్నలు ఒక సమాచారం ఆధారంగా ఉంటాయి. ప్రధానంగా వెన్ డయాగ్రమ్స్, డిడక్షన్, పజిల్స్, లాజికల్ కనెక్టివిటీ, క్యూబ్స్ తదితర అంశాలకు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థులు స్టేట్మెంట్లను, ఇతర స్టేట్మెంట్లతో పోల్చి అవసరమైన సమాచారాన్ని గుర్తించే నైపుణ్యాన్ని పెంచుకోవాలి. క్వాంటిటేటివ్ ఎబిలిటీ: మ్యాథమెటిక్స్ ఆధారంగా ఉండే క్వాంటిటేటివ్ ఎబిలిటీలో ప్రిపరేషన్‌ను శాస్త్రీయంగా సాగించాలి. నెంబర్స్, అల్జీబ్రా, జామెట్రీ విభాగాల్లో పట్టు ఎంతో ముఖ్యం. వీటికి సంబంధించిన బేసిక్ కాన్సెప్టులను సమగ్రంగా అధ్యయనం చేయాలి. సూత్రాల ఆధారంగా ప్రశ్నల సాధనకు ప్రాధాన్యమివ్వాలి. పరీక్షకు మూడు, నాలుగు వారాల ముందు వరకు ప్రిపరేషన్ కొనసాగించి, పరీక్ష సమీపిస్తున్నప్పుడు గత ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. క్లిష్టమైన అంశాలను విస్మరిద్దాం అనే భావన సరికాదు. డేటా ఇంటర్‌ప్రిటేషన్: అభ్యర్థుల్లో గణన సామర్థ్యాన్ని, వేగవంతమైన విశ్లేషణ నైపుణ్యాలను పరీక్షించే విభాగం డేటా ఇంటర్‌ప్రిటేషన్. ఇందులో రాణించేందుకు సూక్ష్మ పరిశీలన, కాలిక్యులేషన్, లాజికల్ రీజనింగ్ నైపుణ్యాలు పెంచుకోవాలి. నిర్ణీత అంశాన్ని వేగంగా విశ్లేషించే సామర్థ్యం సొంతం చేసుకోవాలి. ముఖ్యంగా పర్సంటేజీ, యావరేజెస్‌పై పట్టు సాధించాలి. ఇందుకోసం ఏదైనా క్యాట్ ప్రామాణిక మెటీరియల్ లేదా ఆన్లైన్ టెస్ట్లలోని ప్రశ్నలను బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ కేవలం ఒకే తరహా ప్రశ్నలు కాకుండా భిన్న కాఠిన్యతతో ఉన్న సమస్యల సాధనకు ప్రాధాన్యమివ్వాలి. ప్రతి అంశమూ ప్రధానమే క్యాట్ విజయాన్ని లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులు సిలబస్‌లో పేర్కొన్న ప్రతి అంశాన్నీ చదవడం అలవర్చుకోవాలి. అకడమిక్ లెర్నింగ్ విధానం తరహాలో క్లిష్టమైన అంశాలను చాయిస్‌కు వదిలేద్దాం అనుకోవడం సరికాదు. ప్రిపరేషన్ సమయం నుంచే పరీక్షలో ఒక ప్రశ్నకు లభించే సమయాన్ని గుర్తిస్తూ ప్రాక్టీస్ చేయడం అలవర్చుకోవాలి. పదో తరగతి తర్వాత మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌ను చదవని విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీనికోసం కొంత ప్రత్యేక సమయం కేటాయించుకోవాలి. చివరి నెల రోజులు పూర్తిగా రివిజన్‌కే కేటాయించేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. చదివే సబ్జెక్ట్‌కు సంబంధించి ముఖ్యమైన అంశాలను షార్ట్ నోట్స్ రూపంలో పొందుపర్చుకుంటే రివిజన్ సమయంలో ఉపయుక్తంగా ఉంటుంది. - కె.రామ్‌నాథ్, క్యాట్ కోర్స్ డెరైక్టర్, టైమ్ ఇన్స్టిట్యూట్. కాన్సెప్టులపై అవగాహన అవసరం క్యాట్‌లో విజయం సాధించాలంటే ముందుగా ఆయా సబ్జెక్ట్‌ల కాన్సెప్ట్లపై పట్టు సాధించాలి. అంతేకాకుండా ప్రిపరేషన్ పరంగా స్పష్టమైన అవగాహన ఉండాలి. శాస్త్రీయ దృక్పథంతో చదవాలి. విజయంలో కీలక పాత్ర పోషించే క్వాంటిటేటివ్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్‌ల కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలి. ప్రాక్టీస్ టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌లకు హాజరవుతూ ఎప్పటికప్పుడు స్వీయ విశ్లేషణ చేసుకుంటూ ప్రిపరేషన్‌కు పదునుపెట్టుకోవాలి. - పి.అనురాగ్ రెడ్డి, ఐఐఎం-అహ్మదాబాద్, క్యాట్-2014 (100 పర్సంటైల్) విజేత. క్యాట్-2015 ముఖ్య వివరాలు.. నోటిఫికేషన్ వెల్లడి: జూలై 26, 2015 నిర్వహణ ఇన్స్టిట్యూట్- ఐఐఎం అహ్మదాబాద్ ఈ ఏడాది 115 నగరాలు/పట్టణాల్లో క్యాట్ నిర్వహణ. మహిళా అభ్యర్థులకు ప్రత్యేకంగా వారి సమీప ప్రాంతాల్లోనే టెస్ట్ సెంటర్లు కేటాయించే దిశగా చర్యలు. క్యాట్-2015 ఆధారంగా ప్రవేశం కల్పించనున్న ఐఐఎంల సంఖ్య: 19 ప్రస్తుతం ఐఐఎంలలో ఉన్న సీట్ల సంఖ్య: సుమారు 4055. క్యాట్-2014 కటాఫ్ పర్సంటైల్ సీటు పొందాలంటే 97 పర్సంటైల్పైనే:ఐఐఎంలు పేర్కొనే కటాఫ్‌లు కేవలం దరఖాస్తు ప్రక్రియకు అర్హత ప్రమాణాలు మాత్రమే. అందుబాటులో ఉన్న సీట్లు, పోటీని దృష్టిలో పెట్టుకుంటే 97కుపైగా పర్సంటైల్ సాధిస్తేనే తదుపరి దశలైన జీడీ/పీఐలో పాల్గొనేందుకు, ఆపై సీటు పొందే అవకాశాలుంటాయి. ఐఐఎం-అహ్మదాబాద్, కోల్‌కతాల్లో 99.5 శాతంపైగా పర్సంటైల్ ఉంటేనే ప్రవేశం లభిస్తుంది. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి కేవలం ప్రాథమిక కటాఫ్లపైనే దృష్టి సారించకుండా తుది జాబితాలో నిలించేందుకు అవసరమైన కటాఫ్ పర్సంటైల్ సాధన దిశగా కృషి చేయాలి. కనీస అర్హత కటాఫ్‌ల విషయంలో ఐఐఎంలు చాలా పకడ్బందీగా వ్యవహరిస్తున్నాయి. సెక్షన్ల వారీగా, మొత్తం సగటు కటాఫ్‌లను పేర్కొంటున్నాయి. రిఫరెన్స్ బుక్స్ క్వాంటిటేటివ్ ఎబిలిటీ 1) ఆబ్జెక్టివ్ అర్థమెటిక్ - ఆర్.ఎస్.అగర్వాల్. 2) పియర్సన్ గైడ్ టు క్వాంటిటేటివ్ ఎబిలిటీ - నిషిత్ సిన్హా వెర్బల్ ఎబిలిటీ/లాజికల్ రీజనింగ్. 1) వెర్బల్ ఎబిలిటీ- అరుణ్ శర్మ. 2) వర్డ్ పవర్ మేడ్ ఈజీ - నార్మన్ లూయిస్. డేటా ఇంటర్‌ప్రిటేషన్ 1) అనలిటికల్ అండ్ లాజికల్ రీజనింగ్ - బి.ఎస్.సిజ్వాల్ 2) హౌ టు ప్రిపేర్ ఫర్ డేటా ఇంటర్‌ప్రిటేషన్ ఫర్ క్యాట్-టాటా మెక్‌గ్రాహిల్, అరిహంత్ ప్రకాశన్. 3) వెర్బల్ అండ్ నాన్-వెర్బల్ రీజనింగ్ - ఆర్.ఎస్.అగర్వాల్.