బెల్లంపల్లిలో పోలీసుల తనిఖీలు
వరంగల్ జిల్లాలో జరిగిన శృతి, విద్యాసాగర్‌ల ఎన్‌కౌంటర్‌పై సీబీఐతో విచారణ చేపట్టాలని కోరుతూ.. తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఇచ్చిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి హైదరాబాద్ వెళ్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు. అదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి నుంచి రాజధాని వెళ్లడానికి సిద్ధమవుతున్న శ్రేణులను మంగళవారం సాయంత్రం పోలీసులు ప్రత్యేక బలగాల సాయంతో అడ్డుకుంటున్నారు. పట్టణం నుంచి బయటకు వెళ్తున్న వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.