CC roads construction
-
అభివృద్ధి దారులు.. వేగంగా రోడ్ల నిర్మాణం
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో రహదారులను వేగంగా అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం రూ.కోట్ల నిధులను వెచ్చిస్తోంది. పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా నాణ్యాతా ప్రమాణాలను పాటిస్తూ బీటీ, సీసీరోడ్లు నిర్మిస్తోంది. నెల్లూరు(బారకాసు): వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జిల్లాలో అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రధానంగా రోడ్ల మరమ్మతులు, కొత్త రహదారుల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి ప్రజలు వినతులు ఇస్తున్నా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ప్రమాదాలు జరుగుతున్నా స్పందించలేదు. ప్రస్తుతం పరిస్థితి మారింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఆర్అండ్బీ రోడ్లకు మహర్దశ పట్టింది. గతంలో ప్రతిపాదనలకే పరిమితం కాగా నేడు ఎన్నో కార్యరూపం దాల్చుతున్నాయి. ఎక్కడెక్కడంటే.. ఆర్అండ్బీ శాఖ నెల్లూరు డివిజన్ పరిధిలోని నెల్లూరు సిటీ, రూరల్, సర్వేపల్లి, ఆత్మకూరు, కోవూరు నియోజకవర్గాల్లో దెబ్బతిన్న రోడ్లను బాగు చేసేందుకు, కొత్తగా రోడ్ల నిర్మాణాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. వీటితో ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం ఎనిమిది పనులను పూర్తి చేశారు. మిగిలిన నిర్మాణాలను జూన్ నెలాఖరులోపు పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఇప్పటికే పూర్తి నెల్లూరు డివిజన్ పరిధిలో నెల్లూరు – కృష్ణపట్నం రోడ్డు (మాదారాజుగూడురు నుంచి బ్రహ్మదేవి వరకు), పొదలకూరు – రాపూరు రోడ్డు, నెల్లూరుపాళెం – ఆత్మకూరు, ఆత్మకూరు – సోమశిల, ఈపూరు ఫిషరీస్ రోడ్డు, నెల్లూరు – అనికేపల్లి (వయా గొలగముడి), మొగళ్లపాళెం – సౌత్మోపూరు, ములుముడి – తాటిపర్తి రోడ్డు పనులు పూర్తయ్యాయి. గడువులోగా పూర్తికి చర్యలు నెల్లూరు డివిజన్ పరిధిలోని రోడ్లు నిర్మాణాల పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఎనిమిది చోట్ల పనులు పూర్తి చేశాం. మిగిలిన వాటిని నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపపట్టాం. కిందిస్థాయి అధికారులతో సమీక్షిస్తూ పనుల పురోగతి తెలుసుకుంటున్నాం. ఇప్పటి వరకు ఎక్కడా కూడా సమస్యల్లేవు. సకాలంలో పనులు పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లు కూడా ఎంతో సహకరిస్తున్నారు. – రామాంజనేయులు, ఈఈ, నెల్లూరు డివిజన్, అర్అండ్బీ -
మరమ్మతులతో సరిపెడుతున్నారు!
- ఉపాధిహామీ కింద సీసీరోడ్ల నిర్మాణంలో కొన్నిచోట్ల అవకతవకలు - గ్రామీణాభివృద్ధి శాఖకు ఫిర్యాదులు సాక్షి, హైదరాబాద్: ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన సిమెంట్ రహదారుల నిర్మాణ పనుల్లో పెద్ద ఎత్తున అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని గ్రామీణాభి వృద్ధి శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఇంతకు మునుపే వివిధ ప్రభుత్వ పథకాల కింద వేసిన సీసీరోడ్లనే తాజాగా కొద్దిపాటి మరమ్మతులు చేసి, కొత్త సిమెంట్ రోడ్ల మాదిరిగా చిత్రీకరిస్తున్నట్లు ఉన్నతాధి కారుల పరిశీలనలో తేలింది. ఉపాధిహామీ పథకంలో మెటీరియల్ కాంపొనెంట్ నిధులను ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఖర్చు చేయాల్సి ఉన్నందున, గత నెలరోజు లుగా గ్రామాల్లో హడావిడి వాతావరణం నెలకొంది. కొన్ని జిల్లాల్లో సిమెంట్ రహదారుల నిర్మాణానికి అవసరమైన ఇసుక అందుబాటులో లేకపోవడం, కొన్ని ప్రాంతాల్లో నిర్మాణ పనులు చేసేందుకు అవసరమైన మేస్త్రీలు దొరకకపోవడంతో ఆశించిన స్థాయిలో పనులు ముందుకు సాగడం లేదని తెలుస్తోంది. రూ.300 కోట్లకు మించే పరిస్థితి లేదు... ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి కేవలం 7,564 పనులు మాత్రమే కొనసాగుతున్నాయని, వీటికి రూ.259.09కోట్లు మాత్రమే ఖర్చయిందని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తమ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు. కొన్ని జిల్లాల్లో ఇంటర్నెట్ సమస్యల కారణంగా పనుల వివరాలను నమోదు చేయలేదని, మొత్తంగా రూ.300 కోట్లకు మించి సీసీ రోడ్లకు ఖర్చయ్యే పరిస్థితి కనిపించడం లేదని తెలుస్తోంది. దీంతో ఆయా గ్రామాల్లో పాత సిమెంట్ రోడ్లనే కొత్త రహదారులుగా చూపి సొమ్ము చేసుకునేందుకు అక్రమార్కులు ప్రయత్నిస్తున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు తమ గ్రామాల్లో కొత్త సీసీరోడ్లు వేసినట్లు రికార్డుల్లో నమోదు చేయాలని క్షేత్రస్థాయి సిబ్బందిపై ఒత్తిడి చేస్తున్నారని తెలుస్తోంది. కొన్ని జిల్లాల్లోనైతే ఏకంగా ఎమ్మెల్యేలు, మంత్రులు తమ అనుయూయులకు సీసీరోడ్ల బిల్లులు ఇప్పించాలని జిల్లా కలెక్టర్లపై ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. పూర్తి చేసిన వాటికే బిల్లులు.. మార్చి 31లోగా సీసీరోడ్లు నిర్మించకుండా బిల్లులు పొందేందుకు అస్కారం లేదని, పూర్తిచేసిన రహదారులకు మాత్రమే బిల్లులు మంజూరవుతాయని ఉన్నతాధికారులు అంటున్నారు. నిర్మించిన ప్రతి సీసీరోడ్ను తప్పనిసరిగా జియోట్యాగింగ్ చేస్తున్నామని, ఆయా రహదారుల వద్ద ఉపాధిహామీ నిధులతో నిర్మించిన రహదారిగా శిలాఫలకాలు ఏర్పాటు చేయనున్నామని అధికారులు చెబుతున్నారు.