Celebrate Birthday
-
డెలివరీ ఏజెంట్‌కు సర్ప్రైజ్
బంధువులతో కలిసి పార్టీ.. ఆత్మ బంధువుల బర్త్‌డే.. వేడుక ఏదైనా మనకు టైమ్‌కు ఫుడ్ డెలివరీ చేసి మన సంతోషంలో భాగస్వాములవుతారు డెలివరీ ఏజెంట్. వాళ్ల కష్టాన్ని చాలాసార్లు గుర్తించం. కానీ.. తమకోసం ఫుడ్ తీసుకొచ్చిన డెలివరీ ఏజెంట్ బర్త్ డే సెలబ్రేట్ చేసి అతని సంతోషాన్ని రెట్టింపు చేశారు కొందరు యువకులు. వారం కిందట అహ్మదాబాద్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. నగరానికి చెందిన యశ్ షా జొమాటోలో ఫుడ్ ఆర్డర్చేశాడు. ఆర్డర్ డీటెయిల్స్ చూస్తుండగా.. భారీ వర్షం వల్ల డెలివరీ లేట్ అవుతుందని ఉంది. దాంతో పాటు.. డెలివరీ బాయ్ అయిన షేక్ ఆకిబ్ బర్త్‌డే అని కూడా కనిపించింది. డెలివరీ ఏజెంట్ తన బర్త్‌డే రోజు వర్షంలో తడుస్తూ పనిచేస్తున్నాడని గ్రహించి, ఏజెంట్‌ను సర్ప్రైజ్ చేయాలనుకున్నారు. ఆర్డర్‌తో వచ్చిన అతడికి ఫ్రెండ్స్‌తో కలిసి ‘హ్యాపీ బర్త్ డే’ అంటూ విష్ చేశారు. అంతేకాదు చిన్న కానుకను కూడా అందజేశారు. ఊహించని ఈ వేడుకకు డెలివరీ ఏజెంట్ చలించిపోయాడు. చిరునవ్వుతో వారికి కృతజ్ఞతలు తెలిపాడు. ఆ దృశ్యం వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన యశ్.. ‘మీకు చేతనైనంత వరకు ఆనందాన్ని పంచండి. మాకు అవకాశం ఇచ్చినందుకు జొమాటోకు ధన్యవాదాలు’ అని క్యాప్షన్ పెట్టాడు. ఈ వీడియోకు రెండు మిలియన్ల వ్యూస్, లెక్కలేనన్ని లైక్స్, కామెంట్లు వచ్చాయి. దీనిపై జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్, డెలివరీ ఏజెంట్ షేక్ ఆకిబ్ కూడా స్పందించి ధన్యవాదాలు తెలిపారు. – అహ్మదాబాద్ -
ప్రియుడి మీద అలిగిన అనుష్క
‘మీకు నచ్చిన క్రికెటర్ బొమ్మ గీయండి’... అని యాంకర్ అడగ్గానే, అనుష్క శర్మ ఎవరి బొమ్మ గీస్తుందని ఊహించారో సరిగ్గా అతని బొమ్మే గీసింది. అవును.. ప్రియుడు ‘విరాట్ కోహ్లి’ బొమ్మ గీసింది. గీస్తున్నంతసేపూ మురిసిపోయింది. సిగ్గుల మొగ్గ అయి పోయింది. ప్రియుడి మీద ఉన్న ప్రేమ అంతా ఆమె కళ్లల్లో కనిపించింది. ఆ సంగతలా ఉంచితే, మొన్న శుక్రవారం అనుష్క పుట్టినరోజు. ఈ సందర్భంగా విషెస్‌ని మోస్తూ వందల ఫోన్ కాల్స్, సువాసనలు వెదజల్లే పుష్పగుచ్ఛాలు ఎన్నో వచ్చినా అనుష్కకు మాత్రం వెలితిగానే ఉండిపోయిందట. దానికి కారణం విరాట్ తన చెంత లేకపోవడమే. హఠాత్తుగా ప్రత్యక్షమై అతగాడు తనకు స్వీట్ షాక్ ఇస్తాడని కలలు కనేసింది. విరాట్ షాకే ఇచ్చాడు కానీ, అది స్వీట్‌గా లేదు. ఫోన్లో విషెస్ చెప్పి ఊరుకున్నాడు కానీ, పర్సనల్‌గా ప్రత్యక్షమై, బర్త్‌డే సెలబ్రేట్ చేయలేదట. విరాట్‌పై గుండెల్లో ఎంతో ప్రేమ దాచుకున్న అనుష్క హర్ట్ అయ్యిందనీ, విరాట్ మీద అలిగిందనీ సమాచారం. ప్రస్తుతం ఈ అలక గురించి బాలీవుడ్లో జోరుగా చెప్పుకుంటున్నారు. ఈవిడగారి అలక చూస్తే.. ప్రసన్నం చేసుకోవడానికి విరాట్ ఎన్ని తిప్పలు పడాలా? అని జోకులేసుకుంటున్నారు కూడా. విరాట్ కొహ్లీ ఇక అనుష్క శర్మను ‘‘అలిగితివా సఖి...!’’ అని పాట పాడుతూ బుజ్జగించాలేమో.