ప్రియుడి మీద అలిగిన అనుష్క
‘మీకు నచ్చిన క్రికెటర్ బొమ్మ గీయండి’... అని యాంకర్ అడగ్గానే, అనుష్క శర్మ ఎవరి బొమ్మ గీస్తుందని ఊహించారో సరిగ్గా అతని బొమ్మే గీసింది. అవును.. ప్రియుడు ‘విరాట్ కోహ్లి’ బొమ్మ గీసింది. గీస్తున్నంతసేపూ మురిసిపోయింది. సిగ్గుల మొగ్గ అయి పోయింది. ప్రియుడి మీద ఉన్న ప్రేమ అంతా ఆమె కళ్లల్లో కనిపించింది. ఆ సంగతలా ఉంచితే, మొన్న శుక్రవారం అనుష్క పుట్టినరోజు. ఈ సందర్భంగా విషెస్‌ని మోస్తూ వందల ఫోన్ కాల్స్, సువాసనలు వెదజల్లే పుష్పగుచ్ఛాలు ఎన్నో వచ్చినా అనుష్కకు మాత్రం వెలితిగానే ఉండిపోయిందట. దానికి కారణం విరాట్ తన చెంత లేకపోవడమే. హఠాత్తుగా ప్రత్యక్షమై అతగాడు తనకు స్వీట్ షాక్ ఇస్తాడని కలలు కనేసింది.
విరాట్ షాకే ఇచ్చాడు కానీ, అది స్వీట్‌గా లేదు. ఫోన్‌లో విషెస్ చెప్పి ఊరుకున్నాడు కానీ, పర్సనల్‌గా ప్రత్యక్షమై, బర్త్‌డే సెలబ్రేట్ చేయలేదట. విరాట్‌పై గుండెల్లో ఎంతో ప్రేమ దాచుకున్న అనుష్క హర్ట్ అయ్యిందనీ, విరాట్ మీద అలిగిందనీ సమాచారం. ప్రస్తుతం ఈ అలక గురించి బాలీవుడ్‌లో జోరుగా చెప్పుకుంటున్నారు. ఈవిడగారి అలక చూస్తే.. ప్రసన్నం చేసుకోవడానికి విరాట్ ఎన్ని తిప్పలు పడాలా? అని జోకులేసుకుంటున్నారు కూడా. విరాట్ కొహ్లీ ఇక అనుష్క శర్మను ‘‘అలిగితివా సఖి...!’’ అని పాట పాడుతూ బుజ్జగించాలేమో.