Cell Shop
-
వివాహితకు సెల్ షాపు యజమాని బ్లాక్మెయిల్
నిడదవోలు : పట్టణంలోని గణేష్ చౌక్ సెంటర్ ఉన్న సిరి సెల్‌షాపు యజమాని పి.శేఖర్ ఓ వివాహితను బ్లాక్ మెయిల్ చేస్తుండటంతో ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఏస్సై జి.సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక పాటి మీద సెంటర్‌కు చెందిన యువతికి ఈ ఏడాది మార్చిలో వివాహమైంది. ఆమె ప్రస్తుతం భర్తతో కలిసి బెంగళూరులో ఉంటోంది. ఆమె ఫొటోలు తన దగ్గర ఉన్నాయని, తనకు రూ.5 లక్షలు ఇవ్వకుంటే వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతానని శేఖర్ ఆ వివాహితను, ఆమె కుటుంబ సభ్యులను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఇదే క్రమంలో శుక్రవారం కూడా ఆ వివాహిత తల్లి ఇంటికి వెళ్లి బెదిరించడం ప్రారంభించాడు. దీంతో వివాహిత తల్లి, శేఖర్ల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. ఆ తల్లిపై దాడి చేసి కొట్టి వెళ్లిపోయాడు. వివాహిత తల్లిదండ్రులు, బంధువులు సుమారు 20 మంది మహిళలు సెల్‌షాపును చుట్టుముట్టారు. షాపు వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో శేఖర్ పరారయ్యాడు. వివాహిత తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చెప్పారు. -
సెల్‌షాపులో చోరీ
బలిజిపేట రూరల్ : బలిజిపేటలో ప్రధాన రహదారి పక్కగా, పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉండే సీతారాం సెల్‌షాపులో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. సుమారు లక్ష రూపాయల విలువైన సెల్లు, మెమోరీకార్డులు, పెన్‌డ్రైవ్‌లు చోరీకి గురయ్యారుు. ఇదే షాపులో గత నెల 18న కూడా చోరీ జరిగింది. అప్పట్లోనూ సుమారు లక్ష రూపాయలకుపైగా విలువైన సామగ్రి పోయారుు. 15 రోజుల వ్యవధిలో మరలా అదే షాపులో చోరీ జరగడంతో వ్యాపారులందరూ ఆందోళన చెందుతున్నారు. మొబైల్ షాపు పైకప్పు సిమెంట్ రేకులు విరగ్గొట్టి దుండగలు లోపలికి దిగారు. నాలుగు ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్లు, సాధారణ సెల్ఫోన్లు 30కిపైగా, 15వేల రూపాయల విలువైన మెమోరీ కార్డులు, పెన్‌డ్రైవ్‌లు అపహరణకు గురయ్యాయని షాపు యజమాని శ్రీనివాసరావు తెలిపారు. ఎస్సై సింహాచలం ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. క్లూస్‌టీం కూడా షాపును క్షుణ్ణంగా పరిశీలించింది.