సెల్‌షాపులో చోరీ | theft in Cell Shop | Sakshi
Sakshi News home page

సెల్‌షాపులో చోరీ

Published Tue, Nov 8 2016 2:43 AM | Last Updated on Mon, Sep 4 2017 7:28 PM

సెల్‌షాపులో చోరీ

సెల్‌షాపులో చోరీ

 బలిజిపేట రూరల్ : బలిజిపేటలో ప్రధాన రహదారి పక్కగా, పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉండే సీతారాం సెల్‌షాపులో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. సుమారు లక్ష రూపాయల విలువైన సెల్‌లు, మెమోరీకార్డులు, పెన్‌డ్రైవ్‌లు చోరీకి గురయ్యారుు. ఇదే షాపులో గత నెల 18న కూడా చోరీ జరిగింది. అప్పట్లోనూ సుమారు లక్ష రూపాయలకుపైగా విలువైన సామగ్రి పోయారుు. 15 రోజుల వ్యవధిలో మరలా అదే షాపులో చోరీ జరగడంతో వ్యాపారులందరూ ఆందోళన చెందుతున్నారు.  మొబైల్ షాపు పైకప్పు సిమెంట్ రేకులు విరగ్గొట్టి దుండగలు లోపలికి దిగారు. నాలుగు ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్లు, సాధారణ సెల్‌ఫోన్లు 30కిపైగా,  15వేల రూపాయల విలువైన మెమోరీ కార్డులు, పెన్‌డ్రైవ్‌లు అపహరణకు గురయ్యాయని షాపు యజమాని శ్రీనివాసరావు తెలిపారు. ఎస్సై సింహాచలం ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. క్లూస్‌టీం కూడా షాపును క్షుణ్ణంగా పరిశీలించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement