Balijipeta
-
పార్వతీపురం: బలిజిపేట మండలం అజ్జాడలో అగ్నిప్రమాదం
-
MLA Jogarao: ‘మార్గం’ చూపిన ఎమ్మెల్యే
సాక్షి, పార్వతీపురం మన్యం(బలిజిపేట): పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు చొరవతో వంతరాం నుంచి కొత్త వంతరాం వరకు రూ.20లక్షలతో రోడ్డు నిర్మాణం ముమ్మరంగా సాగుతోంది. కొత్తవంతరాం గ్రామస్తులకు సరైన రహదారి సదుపాయం లేక రాకపోకలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుండడంతో ఎమ్మెల్యే జోగారావుకు కొద్దికాలం క్రితం గ్రామస్తులు విన్నవించుకున్నారు. వంతరాం నుంచి కొత్తవంతరాం వరకు నిర్మిస్తున్న రోడ్డు ఇదే దీనికి స్పందించిన ఎమ్మెల్యే జోగారావు జిల్లా పరిషత్ నిధులు రూ.20లక్షలు మంజూరుచేయించి రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2 కిలోమీటర్ల పొడవు, 8 మీటర్ల వెడల్పుతో రోడ్డు చేపట్టి నిర్మాణం పూర్తయితే తమ అవస్థలు తీరుతాయని గ్రామస్తులు తెలిపారు. చదవండి: (Nandyal District: నెరవేరబోతోన్న రేనాటి ప్రాంత వాసుల కల) -
పేద రోగులంటే నిర్లక్ష్యమా?
సాక్షి, బలిజిపేట (విజయనగరం): వైద్యసేవల నిమిత్తం స్థానిక పీహెచ్‌సీకి వచ్చే రోగులంటే సిబ్బందికి లెక్కలేకుండా పోతోందని ప్రజల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పీహెచ్‌సీకి ఎక్కువగా నిరుపేదలే వస్తుంటారు. అయితే వీరిపట్ల వైద్యసిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. బలిజిపేట గొల్లవీధికి చెందిన బూర్ల భవాని శని వారం మధ్యాహ్నం కుక్కకాటుకు గురైంది. చికిత్స నిమిత్తం బలిజిపేట పీహెచ్‌సీకి రాగా కుక్కకాటు ఇంజక్షన్ లేదని చెప్పి టీటీ ఇంజక్షన్ చేసి పంపించేశారు. శనివారం అర్ధరాత్రి అదే గొల్లవీధికి చెందిన ఎన్ లక్ష్మణకు అదేకుక్క కాటు వేయగా స్థానికులు వెంటనే పీహెచ్‌సీకి తీసుకొచ్చారు. ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న వైద్య సిబ్బంది ఆయనకు కుక్కకాటు ఇంజక్షన్ చేసి అవసరమైన చికిత్స చేశారు. మధ్యాహ్నం ఇంజక్షన్ లేదన్నారు కదా? ఇప్పుడు ఎలా వచ్చిందని వారు ప్రశ్నించగా, ఇప్పుడే దొరికిందని సిబ్బంది సమాదానం చెప్పారు. కాగా ఆదివారం ఉదయం భవాని మళ్లీ పీహెచ్‌సీకి ఇంజెక్షన్ కోసం వెళ్లింది. ‘ఇంజక్షన్ లేదని చెప్పాం కదా మళ్లీ ఎందుకు వచ్చావు’ అంటూ వైద్య సిబ్బంది రుసరుసలాడారు. శనివారం రాత్రి కుక్కకాటుకు గురైన లక్ష్మణరావు ఆస్పత్రికి వచ్చినపుడు ఇంజక్షన్ చేశారు కదా, ఇప్పడు లేదని ఎందువల్ల బుకాయిస్తున్నారని బాధితురాలు నిలదీయగా ‘ఆ విషయం డాక్టర్‌ను అడుగు’ అంటూ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాదానం చెప్పడంపై బాధితురాలు భవాని, ఆమె బంధువులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం లేని ఇంజక్షన్ రాత్రి ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. పేదరోగులపై వైద్య సిబ్బంది ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతవరకు న్యాయమని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై వైద్యాధికారి మహీపాల్ను వివరణ కోరగా సోమవారం వరకు తాను సెలవులో ఉన్నానని వచ్చిన తర్వాత వివరాలు తెలుసుకుని తగు చర్యలు తీసుకుంటానని తెలిపారు. -
సెల్‌షాపులో చోరీ
బలిజిపేట రూరల్ : బలిజిపేటలో ప్రధాన రహదారి పక్కగా, పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉండే సీతారాం సెల్‌షాపులో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. సుమారు లక్ష రూపాయల విలువైన సెల్లు, మెమోరీకార్డులు, పెన్‌డ్రైవ్‌లు చోరీకి గురయ్యారుు. ఇదే షాపులో గత నెల 18న కూడా చోరీ జరిగింది. అప్పట్లోనూ సుమారు లక్ష రూపాయలకుపైగా విలువైన సామగ్రి పోయారుు. 15 రోజుల వ్యవధిలో మరలా అదే షాపులో చోరీ జరగడంతో వ్యాపారులందరూ ఆందోళన చెందుతున్నారు. మొబైల్ షాపు పైకప్పు సిమెంట్ రేకులు విరగ్గొట్టి దుండగలు లోపలికి దిగారు. నాలుగు ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్లు, సాధారణ సెల్ఫోన్లు 30కిపైగా, 15వేల రూపాయల విలువైన మెమోరీ కార్డులు, పెన్‌డ్రైవ్‌లు అపహరణకు గురయ్యాయని షాపు యజమాని శ్రీనివాసరావు తెలిపారు. ఎస్సై సింహాచలం ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. క్లూస్‌టీం కూడా షాపును క్షుణ్ణంగా పరిశీలించింది. -
అమ్మవారికి కరెన్సీ నోట్లతో అలంకరణ
బలిజిపేట రూరల్: శ్రావణమాసం సందర్భంగా బలిజిపేట వెంకటేశ్వరాలయంలోని లక్ష్మీదేవి అమ్మవారిని శనివారం కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఆలయ ధర్మకర్త బి.వెంకటరమణ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిచారు. భక్తుల నుంచి వివిధ రకాల కరెన్సీ నోట్లను సేకరించి అలంకరించినట్టు అర్చకులు కష్ణమాచార్యులు, రామానుజాచార్యులు తెలిపారు. కార్యక్రమంలో శ్రీవారి సేవకుడు సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
వసూళ్ల బడి
ఆరు నుంచి ఎనిమిది వరకు రూ.30 పదో తరగతికి రూ.100 బలిజిపేట ఉన్నత పాఠశాలలో వసూళ్లు విద్యార్థుల ఆందోళన బలిజిపేట రూరల్: బలిజిపేట ఉన్నత పాఠశాల విద్యార్థుల నుంచి రుసుము రూపంలో నగదు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బలిజిపేట ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు 720 మంది చదువుతున్నారు. ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు రూ.30 వసూలు చేస్తున్నట్టు విద్యార్థులు తెలిపారు. 9, 10వ తరగతులకు ఎస్–1, ఎస్–2 పేపర్లకు రూ.30, ప్రత్యేక రుసుముగా రూ.20, ఆటలకు రూ.15 కలిపి మొత్తం రూ.65 వసూలు చేయాల్సి ఉండగా రూ.100 వసూలు చేస్తున్నారని తెలిపారు. దీనికి ఎలాంటి రశీదులు ఇవ్వకపోవడం గమనార్హం. రూ.100 వసూలు చేశారు: అరసాడ వంశీ బలిజిపేట ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. నా నుంచి రూ.100 వసూలు చేశారు. 6,7 తరగతి విద్యార్థుల నుంచి రూ.30 వసూలు చేశారు. విద్యార్థుల కోసమే: జె.త్రినాథ, ప్రధానోపాధ్యాయుడు విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తోంది వారి సౌకర్యార్థమే. విద్యార్థులకు పరీక్ష పత్రాలు, స్టడీ మెటీరియల్ అందించేందుకు వసూలు చేస్తున్నాం. ఇది అనధికారికమే. -
133 మందికి మూడున్నర కిలోల పప్పు
కస్తూర్బా పాఠశాలలో సాంబారు తయారీ నిర్వాహకులపై మండిపడ్డ ఎంపీపీ పార్వతి బలిజిపేట రూరల్ :బలిజిపేట కస్తూర్బా పాఠశాలను ఎంపీపీ పెంకి పార్వతి గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. వంటకాలను పరిశీలించినప్పుడు తక్కువ పప్పు కనిపించడంతో నిర్వాహకులపై మండిపడ్డారు. పాఠశాలలో 140మంది విద్యార్థులుండగా 133మంది హాజరైనట్టు వారు తెలిపారు. ఎంత కందిపప్పు వినియోగించారని ప్రశ్నించగా మూడున్నర కిలోలు వినియోగించనట్టు వంటవారు తెలిపారు. రాత్రి వడ్డించే సాంబారుకు కలిపి మొత్తం ఇదే పప్పు అని వారు తెలిపారు. దీంతో 133మందికి ఎలా సరిపోతుందని, అసలు ఎంత పప్పు వడ్డించాలని ప్రశ్నించారు. పాఠశాల ప్రిన్సిపాల్ హరిత సమావేశానికి వెళ్ళిపోవడంతో సిబ్బంది సరైన సమాచారం లేక నీళ్లు నమిలారు. చాలీచాలని వంటకాలు వండి విద్యార్థులకు అన్యాయం చేయడం తగదని హెచ్చరించారు. మజ్జిగ పలచగా ఉందని, ఎన్ని లీటర్ల పాలు కొంటున్నారని ప్రశ్నించారు. ముప్ఫయ్ రెండు లీటర్ల పాలు కొంటున్నట్టు సిబ్బంది తెలిపారు. వంటకాలు, పాఠశాల రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో రామకష్ణ, వెంకటినాయుడు, అప్పలనాయుడు పాల్గొన్నారు. -
మొబైల్ కూరగాయల బజార్ ప్రారంభం
బలిజిపేట రూరల్: జాతీయ ఆహార భద్రత మిషన్ పిలుపుతో నిర్వహిస్తున్న వినియోగదారుల సేవా కేంద్రాన్ని బలిజిపేటలో గురువారం గ్రామ సర్పంచ్ వెలిది తాయారమ్మ ప్రారంభించారు. ప్రతి గురువారం బలిజిపేటలో తక్కువ ధరలకు నిర్వహించే మొబైల్ కూరగాయల బజారును సద్వినియోగం చేసుకోవాలని తాయారమ్మ కోరారు. టమాటాలను రూ.28, బెండకాయలు రూ.25, చిక్కుడు రూ.30, ఉల్లిపాయలు రూ.15, బంగాళదుంపలు రూ.23కు విక్రయించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి కన్వీనర్ వి.సుబ్బారావు, ఎం.పాపినాయుడు, ఎం.అప్పారావు, టి.ప్రసాదరావు పాల్గొన్నారు. -
అగ్నిప్రమాదం: భారీగా పంట నష్టం
విజయనగరం : విజయనగరం జిల్లా బలిజపేట మండలంలోని బైరిపురం గ్రామంలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 50 ఎకరాల్లో సాగుచేసిన పంటలు కాలి బూడిద అయ్యాయి. గ్రామంలోని సుమారు 30 కుటుంబాలకు చెందిన రైతులు ఒకే చోట యాభై ఎకరాల్లో మామిడి, చెరుకు, జీడి పంటలను సాగుచేశారు. బుధవారం మధ్యాహ్నం పంటల వద్ద ఆకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో రైతులు పంట వద్దకు చేరుకునేలోపే అది పూర్తిగా కాలిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణం తెలియరాలేదు. దీనిపై మరింత సమాచారం అందవలసి ఉంది. -
ఆత్మ విశ్వాసమే ఆయుధంగా...
కష్టాలు కట్టగట్టుకుని వచ్చి దాడి చేశాయి. బాధలు బండెడు బరువును నెత్తిన మోపాయి. విధి మాటిమాటికీ ఆమె జీవితంతో ఆడుకుంది. అయినా ఆమె ఏనాడూ ఆశ కోల్పోలేదు. అధైర్యపడలేదు. కష్టం విసిరిన రాళ్లను విజయానికి పునాదిగా మలుచుకుంది. బాధలు చూపిన ముళ్లబాటలోనే జీవితాన్ని వెతుక్కుంది. విధిని ఎదురించి అమ్మ తోడుతో ముందుకు వెళుతోంది. ఆమె పేరు లలిత. పేరు సౌమ్యంగానే ఉన్నా... ఆమె జీవితం మాత్రం ఆటుపోట్ల మయమే. బలిజిపేట గ్రామానికి చెందిన బొత్స అప్పారావు, హైమావతిల కుమార్తె లలిత. తండ్రి గతంలో రైస్‌మిల్లులో పనిచేసేవారు. రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. దీంతో ఆయన ఉన్న ఉద్యోగం చేయలేక ఇంటి వద్దే ఉండిపోయారు. ఇది ఆ కుటుంబానికి మొదటి దెబ్బ. విరిగిన కాలు బాగుపడిన తర్వాత చిన్న పనులు మాత్రమే చేసుకుంటున్నారు. ఆనాటి నుంచి తల్లి హైమావతి చిరు వ్యాపారం చేస్తూ కుటుంబ భారాన్ని మోస్తున్నారు. లలితకు చిన్నతనంలో 11వ నెలలో జ్వరం వచ్చి పోలియో సోకింది. ఇక అప్పటి నుంచి ఆమె నడవలేదు. మొదటి దెబ్బ నుంచి కోలుకుంటున్న సమయంలోనే ఆమెకు తగిలిన రెండో దెబ్బ ఇది. ఎంతో మంది వైద్యులకు చూపించినా ప్రయోజనం లేకపోయింది. కానీ లలిత ఏనాడూ తన పై తాను విశ్వాసం కోల్పోలేదు. చదువు విషయంలో చాలా పట్టుదలగా ఉండేది. కుటుంబం కష్టా ల కడలిలో ఉన్నప్పటికీ ఆమె అధైర్యపడలేదు. స్థానిక ఉన్నత పాఠశాలలో 2009లో 10వ తరగతి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. నూజివీడులో ట్రిపుల్ ఐటీ సీటు సాధించింది. కానీ అక్కడ జాయిన్ అ యిన తర్వాత ఆమెకు అనారోగ్యం చేసింది. ఇక్కడ కూడా విధి ఆమెతో ఆడుకుంది. పెద్ద చదువులు చదవనీయకుండా అడ్డుపడింది. దీంతో ఆమె తిరిగి బలిజిపేట వచ్చి పీఎస్ఎన్ కళాశాలలో ఇంటర్లో జాయిన్ అయింది. పట్టుదలతో చదివి మంచి మార్కులు సాధించింది. అ నంతరం డైట్ ప్రవేశ పరీక్ష రాసి మంచి మార్కులు తెచ్చుకుని స్థానికంగా ఉండే శ్రీభారతి డైట్ శిక్షణ కేంద్రంలో ఉపాధ్యాయ శిక్షణ పొందుతోంది. తాను నడవలేకపోయినా పది మందికి నడత నేర్పుతానని విశ్వాసంగా చెబుతోందీ యువతి. చదువుకునే సమయంలో పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లేందుకు తల్లి, తోటి విద్యార్థులు సహకరించారు. వారి సహకారంతో మూడు చక్రాల బండిపై వెళ్లి చదువుకుంటున్న లలిత అందరి మన్ననలు పొందుతోంది. - బలిజిపేట రూరల్ -
జిల్లాలో 500 ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు
బలిజిపేట రూరల్ : జిల్లాలో సుమారు 500 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయని జిల్లా విద్యాశాఖాధికారి జి.కృష్ణారావు తెలిపారు. చిలకలపల్లి ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా తన ను కలిసిన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో సుమారు 500 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయని చెప్పారు. డీఎస్సీ కొత్త నోటిఫికేషన్ ద్వారా ఇవి భర్తీ అయ్యే అవకాశం ఉందన్నారు. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత ఉందన్నారు. జిల్లాలో 550 ప్రైవేటు, 2294 ప్రాథమిక, 248 ప్రాథమిక, 321 ప్రభుత్వ సంబంధమైన అన్ని రకాల ఉన్నత పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో 90 వేల మంది, ప్రభుత్వ పాఠశాలల్లో 2.60 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని చెప్పారు. 34 మండలాలకు విద్యాశాఖాధికారులు లేరని, మౌలిక సదుపాయూ ల కొరత పాఠశాలలకు ఉందన్నారు. పాఠశాలల్లో మరుగు దొడ్ల సక్రమ నిర్వహణ బాధ్యత పాఠశాలల ప్రధానోపాధ్యాయులదేనని చెప్పారు. దీనికి సంబంధించి రెండు మూడు రోజుల్లో ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. జీఓ నంబరు 55 ప్రకారం జిల్లాలో ఉపాధ్యాయుల, విద్యార్థుల సంఖ్య గణాంకాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. దీని ప్రకారం అవసరాలను గుర్తిస్తామన్నారు. ఈ ఏడాది పాఠశాలలు తెరవక ముందే పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశామన్నారు. -
ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
బలిజిపేట రూరల్, న్యూస్‌లైన్ : పరీక్షకు హాజరుకాలేక పోయానన్న మనస్థా పంతో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ట్రెనీ ఎస్సై అశోక్ చక్రవర్తి తెలిపిన వివరాల ప్రకా రం... మండలంలోని అరసాడ గ్రామానికి చెందిన సంకిలి సతీష్(19) దాకమర్రి వద్ద ఉన్న ‘విట్స్’ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలలోనే హాస్టల్లో ఉంటున్నాడు. అయితే పండగ సెలవుల సందర్భంగా స్వగ్రామం అరసాడకు వచ్చాడు. కళాశాలలో సోమవారం ప్రాక్టికల్స్ పరీక్ష ఉంది. దీనికోసం ఆ విద్యార్థి విజయనగరం వెళ్లవలసి ఉంది. ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో స్వగ్రామం నుంచి బొబ్బిలి బయలుదేరి వెళ్లాడు, అక్కడ నుంచి విజయనగరానికి ట్రైన్ మీద వెళ్లేందుకు యత్నించాడు. అయితే ట్రైన్ మిస్ అవడంతో తిరిగి స్వగ్రామానికి చేరుకున్నాడు. పరీక్షకు హాజరు కాలేకపోయాననే మనస్థాపానికి గురయ్యాడు. దీంతో సోమవారం సాయంత్రం అరసాడలోని బస్టాప్ వద్ద పురుగు మందు తాగాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని వెంటనే అతనిని బొబ్బిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు